కన్ను పడిందంటే కారు మాయం | Car Robbery Gang Arrest in Karnataka | Sakshi
Sakshi News home page

కన్ను పడిందంటే కారు మాయం

Published Sat, Oct 12 2019 9:03 AM | Last Updated on Sat, Oct 12 2019 9:03 AM

Car Robbery Gang Arrest in Karnataka - Sakshi

యశవంతపుర: కీ ప్రోగ్రామింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వాహనాలను అపహరిస్తున్న ముగ్గురు నిందితులను బాగలగుంట పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళూరుకు చెందిన దిలీప్‌ శంకరన్, శాజీ కేశవన్, కేరళకు చెందిన అలీ అహమ్మద్‌లను అరెస్ట్‌ చేసి 9 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బాగలగుంట పోలీసుస్టేషన్‌ పరిధిలో ఐదు, అన్నపూణేశ్వరినగర, మహాలక్ష్మీపుర –1, సుబ్రమణ్యపుర రెండు కార్లను దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. నగరంలో ఇళ్ల ముందు ఉంచి న కార్లను దొంగలించి నంబర్లను మార్చి తక్కువ ధరలకు అమ్మేవారని పోలీసుల విచారణలో తేలింది. ఖరీదైన కార్లకు కీ ప్రోగ్రామింగ్‌సాఫ్ట్‌వేర్‌ తాళాన్ని ఉపయోగించి దొంగ లించేవారు. కార్లను ఎలా దొంగలించాలో ముగ్గురు నిందితులు యూట్యూబ్‌లో వీడియోలను చూసి తెలుసుకుని కార్లను దొంగలించేవారు. బెంగళూరులో దొంగలించిన కార్లను మంగళూరు, కేరళకు తరలించి అమ్మేవారని పోలీసులు తెలిపారు. వచ్చిన డబ్బులతో విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి ఎక్కువ కార్లను దొంగలించేవారని పోలీసులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement