‘గొలుసు’ దొంగలు దొరికారు...! | Chain Snatchers Arrested In Khammam | Sakshi
Sakshi News home page

‘గొలుసు’ దొంగలు దొరికారు...!

Published Wed, Feb 13 2019 7:06 AM | Last Updated on Wed, Feb 13 2019 7:06 AM

Chain Snatchers Arrested In Khammam - Sakshi

మాట్లాడుతున్న సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌

ఖమ్మంక్రైం: ఒకటి కాదు.. రెండు కాదు.. పది నెలల నుంచి ఖమ్మం జిల్లాలో వరుసగా చైన్‌ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. ఆ ‘గొలుసు’ దొంగలెవరో, ఎక్కడి నుంచి వచ్చారో తెలియకపోవడంతో పోలీసులు తల పట్టుకున్నారు. వీరిని గుర్తించేందుకు, పట్టుకునేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని పోలీస్‌ కమిషనర్‌ ఏర్పాటు చేశారు. వారి సుదీర్ఘ ప్రయత్నం ఫలించింది. ఇద్దరు ‘గొలుసు’ దొంగ సోదరులను ఎట్టకేలకు పట్టుకున్నారు. ఖమ్మంలోని సీపీ కార్యాలయంలో మంగళవారం కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ వెల్లడించిన వివరాలు...  చింతకాని మండలం నాగులవంచ గ్రామస్తుడు మొండితోక వీరయ్య, చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్నాడు.

గేదెల వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఇతడు జల్సాలకు అలవాటు పడ్డాడు. అప్పులపాల య్యాడు. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఉపాయం చెప్పాలని తన తమ్ముడు ఏసోబును అడిగాడు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ఏయే మార్గాలున్నాయో ఇద్దరూ ఆలోచించారు. మహిళల మెడలోని గొలుసులను లాక్కుని తప్పించుకోవచ్చని ఏసోబుకు ఆలోచన వచ్చింది. అన్న య్య వీరయ్యతో చెప్పాడు. గొలుసులు దొంగత నం చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.

  •  హైదరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌ ఘటనలకు సంబంధించిన వీడియోలలోని సీసీ కెమెరాల పుటేజీలను చూశారు. ఖమ్మం నగరంతోపాటు గ్రామాల్లోనూ స్నాచింగ్‌ చేయొచ్చని, తేలిగ్గా తప్పించుకోవచ్చని అన్నయ్యతో తమ్ముడు చెప్పాడు. 
  •  అన్నదమ్ములిద్దరూ రెండు ద్విచక్ర వాహనాలను సిద్ధం చేసుకున్నారు. ప్రతిసారీ ఒకే వాహనం కాకుండా ఒకసారి అది.. ఒకసారి ఇది వాడేవారు. అన్న వీరయ్య నడిపేవాడు. తమ్ముడేమో వెనకాల కూర్చునేవాడు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను గమనించి, వారి మెడలోని పుస్తెల తాళ్లు గుంజుకుని పారిపోయేవారు. 
  •  ఖమ్మం నగరంలో సీసీ కెమెరాలు ఉండటం, పోలీస్‌ నిఘా ఎక్కువవడంతో గ్రామాలపై ఈ అన్నదమ్ములు దృష్టి పెట్టారు. ఊరు అవతల, పొలాలకు వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. వారి మెడలోని తాళిబొట్లను గుంజుకుని తప్పించుకుని పారిపోయేవారు. ఒకసారి చైన్‌ స్నాచింగ్‌ చేసిన తరువాత కొన్ని రోజులపాటు నగరంలోనో, ఇంకొన్ని రోజులపాటు గ్రామీణ ప్రాంతాల్లో గడిపేవారు. మధ్య మధ్యలో ఇతర జిల్లాలకు కూడా వెళ్లేవారు. కృష్ణా జిల్లా వత్సవా యి, చిల్లకల్లులో, సూర్యాపేట జిల్లాలోని కోదాడ రూరల్‌ప్రాంతంలో గొలుసు దొంగతనాలు చేశారు.  
  •  వీళ్లు, కేవలం చైన్‌ స్నాచింగ్‌కు మాత్రమే పరిమితమయ్యారు. ‘‘ఎందుకంటే, దాదాపుగా 90 శాతం మంది మహిళలు బంగారపు తాళిబొట్లనే ధరిస్తారు. వాటిని కాజేయడం, ఆ తరువాత తప్పించుకోవడం... రెండే తేలిక. అందుకే, ఈ పనికి మాత్రమే పరిమితమయ్యాం’’ అని, పోలీసుల విచారణలో ఆ ఇద్దరు చెప్పారు. 

44 గొలుసులు గుంజేశారు.. 
వీరు ఇప్పటివరకు 44 గొలుసులు గుంజారు. ఖమ్మం వన్‌ టౌన్‌ పరిధిలో 10, ఖమ్మం రూరల్‌ పరిధిలో ఏడు, ఖమ్మం అర్బన్‌ పరిధిలో ఒకటి, ముదిగొండ మండలంలో రెండు, తిరుమలాయ పాలెంలో ఒకటి, నేలకొండపల్లిలో నాలుగు, చిం తకానిలో మూడు, వైరాలో రెండు, రఘునాధపా లెంలో ఒకటి, కొణిజర్లలో మూడు, మధిరలో ఒక టి, కృష్ణా జిల్లా వత్సవాయిలో మూడు, ఇదే జిల్లా లోని చిల్లకల్లులో మూడు, సూర్యాపేట జిల్లాలోని కోదాడ రూరల్‌లో మూడు చైన్‌స్నాచింగ్‌లకు పా ల్పడ్డారు. వీరు ఇలా కాజేసిన బంగారం మొత్తం కేజీ 65 గ్రాములు ఉంటుంది. దీని విలువ రూ. 32లక్షలు. ఈ బంగారంతోపాటు రెండు మోటార్‌ సైకిళ్లను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. నగరంలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్డులో వీరిని సీసీఎస్, ఖమ్మం రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు.
 
వెంకన్న, మంగ్త్యాకు సీపీ అభినందన 
ఈ ఇద్దరు చైన్‌ స్నాచర్లను పట్టుకోవడంలో సీసీఎస్‌ కానిస్టేబుళ్లు వెంకన్న, మంగ్త్యా కీలకంగా వ్యవహరించారు. వీరిని సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ప్ర త్యేకంగా అభినందించారు. సొత్తును రాబట్టిన టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ రెహమాన్, ఖమ్మం రూరల్‌ ఏ సీపీ రామోజీ రమేష్, వైరా ఏసీపీ ప్రసన్నకుమార్, సీసీఎస్‌ సీఐలు వేణుమాధవ్, వసంతకుమార్‌ ను అభినందించారు. సీసీఎస్‌ ఏఎస్సై లింగయ్య, సిబ్బంది  వెంకన్న, మంగ్త్యా, సాదిక్, అబ్బాస్, లతీ ఫ్, రాజ్‌కుమార్, బివి.రమణ, వెంకటేశ్వర్లు, కృ ష్ణారావుకు కలిపి రూ.లక్ష రివార్డు అందించారు. అ డిషనల్‌ డీసీపీ మురళీధర్, ట్రైనీ ఐపీఎస్‌ వినీత్, ఏ సీపీలు వెంకట్రావు, రెహమాన్, రామోజీ ర మేష్, ప్రసన్నకుమార్, సత్యనారాయణ, సీఐలు ర మేష్, షుకూర్, రమేష్, మురళి, సాయిరమణ తదితరులుæ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement