రాయ్‌గఢ్: మరుగుదొడ్డి నిర్మించడానికి అనుమతి ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలని ఓ మహిళ(32)ను ప్రభుత్వాధికారి వేధించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో జరిగింది. రాయ్‌గఢ్‌లోని తెందూదిపాలో ‘క్లీన్ ఇండియా’ పథకం కింద బాధితురాలి ఇంట్లో నిర్మిస్తున్న మరుగుదొడ్డి అక్రమమనీ, దాన్ని వెంటనే నిలిపివేయాలని రాయ్‌గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో నోటీసులిచ్చింది. దీంతో బాధితురాలు అన్ని ఆధారాలను సబ్ ఇంజినీర్ ఐపీ సారథికి సమర్పించారు. మరుసటి రోజు బాధితురాలికి ఫోన్‌చేసిన సారథి.. మరుగుదొడ్డి నిర్మాణానికి అనుమతి కావాలంటే తన కోరిక తీర్చాలన్నాడు. ఒప్పుకోకుంటే అక్రమ నిర్మాణం పేరుతో ఇంటినీ కూల్చేస్తానన్నాడు. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సారథిపై కేసు నమోదుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment