
చిన్నారి శ్రావణి మృతదేహం
గుంటూరు రూరల్: కళాశాల బస్సు కింద పడి చిన్నారి మృతి చెందిన ఘటన మండలంలోని నల్లపాడు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. రొంపిచర్ల గ్రామంలోని సుబ్బారెడ్డికాలనీకి చెందిన రావెల గోపి, అంజలి దంపతులకు మూడేళ్ల పాప శ్రావణి ఉంది. గోపి నల్లపాడులోని చెరువు సమీపంలో ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకుని గత నాలుగు నెలలుగా రబ్బర్ బూరలు అమ్ముకుని జీవిస్తున్నాడు. ఈక్రమంలో అదే ఖాళీ స్థలంలో రాత్రి సమయంలో నగర శివారుల్లోని ఓ ఫార్మశీ కళాశాలకు చెందిన బస్సును నిలుపుతారు.
ఇదిలా ఉండగా బుధవారం ఉదయం డ్రైవర్ బస్సును తీస్తుండగా చిన్నారి అక్కడే ఆడుకుంటూ బస్సు కిందకు వచ్చింది. ఇది గమనించని డ్రైవర్ ఆమె పై నుంచి బస్సు పోనించా డు. దీంతో చిన్నారి శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరడంతో డ్రైవర్ పరారయ్యాడు. ఘటనాస్థలాన్ని ఎస్‌ఐలు కృష్ణబాజీ, అమీర్‌లు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment