
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గుంటూరు : ఇంట్లో ఆడుకుంటూ పౌడర్ డబ్బాపై పడడంతో మెడపై తీవ్రంగా గాయమై జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్న తొమ్మిది నెలల చిన్నారి మృతిచెందిన సంఘటన ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. గుంటూరు లాలాపేట ఎస్‌హెచ్‌ఓ ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం బాలాజీనగర్ 6వ లైనుకు చెందిన తురకా ఏసుబాబు కుమార్తె తొమ్మిది నెలల జస్సి శుక్రవారం ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పౌడర్ డబ్బామీద పడడంతో మెడకు తీవ్ర గాయమైంది. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు బాలికను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జి చేశారు. ఏసుబాబు కుమార్తెను ఇంటికి తీసుకువచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం మృతిచెందింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment