Baby died
-
వైద్యుల నిర్లక్ష్యం.. పురిటిలోనే శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన
ఎల్లారెడ్డి: నిండు గర్భిణికి సకాలంలో వైద్యం అందకపోవడంతో పురిటిలోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్ తండాకు చెందిన దేశెట్టి రాజేశ్వరికి శుక్రవారం వేకువజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌లో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయం 10 గంటల వరకు కూడా ఆస్పత్రికి వైద్యులు రాలేదు. ఆ తర్వాత వచ్చిన వైద్యురాలు నిషాత్ బూతుల్ గర్భిణీని పరీక్షించి ఇంకా కొద్దిసేపు వేచి చూద్దామని చెప్పి వెళ్లిపోయింది. మధ్యాహ్నానికి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో గర్భిణిని కామారెడ్డికిగానీ, బాన్సువాడకుగానీ తీసుకునివెళ్లాలని సిబ్బంది సూచించారు. చేసేదేమీ లేక కుటుంబసభ్యులు అత్యవసరంగా స్థానికంగానే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేయగా అప్పటికే గర్భంలోనే మగశిశువు మృతి చెందింది. తల్లి పరిస్థితి సైతం ప్రాణాపాయంలో ఉందని వైద్యులు తెలిపారు. మృత శిశువుతో రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శిశువు మృతి విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రమోహన్‌ను వివరణ కోరగా, పురిటిలోనే శిశువు ఉమ్మనీరు మింగడంతో శ్వాస ఆడక మృతి చెందినట్లు చెప్పారు. ఆస్పత్రిలోని గైనకాలజిస్టు నిషాత్ బూతుల్ సెలవులో ఉన్నా గర్భిణి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి పిలిపించామన్నారు. గర్భిణిని కామారెడ్డికి రిఫర్ చేసినప్పటికీ సకాలంలో తరలించకపోవడంతో శిశువు మృతి చెందిందని తెలిపారు. చదవండి: మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్ఎం పోస్టుల భర్తీ -
పొద్దెక్కినా పావని నిద్ర లేవలేదు.. శరీరం పచ్చగా మారడంతో
సాక్షి, నల్గొండ: విష పురుగు కుట్టి చిన్నారి మృతిచెందిన ఘటన మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్లపాడుతండా సమీపంలో గల జగ్గుతండాలో చోటుచేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం... జగ్గుతండాకు చెందిన భూక్య హరి, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె పావని(11)సంతానం. పావని తండాలోని పాఠశాలలోనే 4వ తరగతి చదువుతుంది. బుధవారం రాత్రి తల్లి సుజాతతో కలిసి పావని ఇంట్లో నేలపై నిద్రించింది. గురువారం తెల్లవారుజామున సుజాత నిద్ర లేచి రోజుమాదిరిగానే ఇంట్లో పనులు చేసుకుంటుంది. కాగా పొద్దెక్కినా కూడా పావని నిద్ర లేవకపోవడంతో పాటు ఎంత పిలిచినా పలకకపోవడంతో దగ్గరికి వెళ్లి చూసింది. పావనిలో ఎటువంటి చలనం లేకపోవడంతో వెంటనే భర్త హరికి విషయం చెప్పింది. అతడు వచ్చి చూడగా పావని శరీరం చల్లబడటంతో పాటు నాడీ స్పందన లేకపోవడంతో తమ కుమార్తె చనిపోయిందని నిర్ధారించుకున్నారు. కాగా పావని శరీరం పచ్చగా మారడంతో ఏదైనా విష పురుగు కుట్టి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. కుమార్తె మృతిని తట్టుకోలేక సుజాత స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే స్థానిక వైద్యుడిని పిలిపించి ఆమెకు సెలైన్ బాటిల్ ఎక్కించారు. -
విషాదం.. అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోయిన సింగర్ దంపతులు
ప్రముఖ సింగర్ బిప్రాక్ ఇంట విషాదం చోటు చేసుకుంది. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని ఎంతో ఆశగా ఎదురు చూసిన ఈ సింగర్ దంపతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పది నెలల క్రితం బిప్రాక్ భార్య మీరా గర్భవతి అయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ పుట్టిన మరుక్షణమే పోత్తిళ్లలోనే కన్నుమూసిన ఘటన ఈ దంపతులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషయాన్ని సింగర్ బిప్రాక్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఈ రోజు మాకు బిడ్డ పుట్టింది. కానీ అంతలోనే ఆ బిడ్డ మమ్మల్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయింది. పుట్టిన సమయంలోనే మా బిడ్డ చనిపోయింది. ఇది తల్లిదండ్రులుగా మేం భరించలేని ఒక దశ. చివరి వరకు మా బిడ్డను కాపాడేందుకు ప్రయత్నించిన వైద్యులకు కృతజ్ఞతలు. ఈ క్లిష్ట పరిస్థితిలో మాకు సపోర్ట్ చేసిన వారికి, అభిమానులకు ధన్యవాదాలు.. ఈ సమయంలో మా గోప్యతను మాకు అందించమని మీ అందరిని అభ్యర్థిస్తున్నాం’ అంటూ బిప్రాక్ రాసుకొచ్చాడు. చదవండి: కమల్ సర్ నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు: అనిరుధ్ ఇక అతడి పోస్ట్‌పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా సింగర్ బిప్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ చిత్రాలకు పాటలు పాడుతూ, స్టేజి షో లలో బిప్రాక్ మంచి సింగర్‌గా గుర్తింపు పొందాయి. అంతేకాదు అతడి పాటలకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగులో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో సూర్యుడివో చంద్రుడివో అనే పాట పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కొన్నేళ్ల క్రితం తన ప్రియురాలు మీరాను వివాహమాడిన ఆయన ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిపాడు. దీంతో అభిమానులు త్వరగా మీరా బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram A post shared by B PRAAK(HIS HIGHNESS) (@bpraak) -
విషాదం: రూ.16 కోట్ల ఇంజక్షన్.. ఆ పాప ఇక లేదు
జైపూర్: రాజస్తాన్ బికనీర్‌కు చెందిన ఏడు నెలల చిన్నపాప నూర్ ఫాతిమా స్పైనల్ మస్కులర్ అట్రోపీ(ఎస్ఎమ్ఏ) వంటి అరుదైన వ్యాధితో బాధపడుతూ మంగళవారం ఉదయం మరణించింది. ఆ చిన్నారిని బతికించడానికి రూ. 16 కోట్ల విలువైన ఇంజక్షన్ మాత్రమే ఆధారం.సాధారణంగా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు చికిత్సల్లో భాగంగా రూ.22 కోట్ల విలువ చేసే ‘జొలెస్మా’ ఇంజెక్షన్ వాడాల్సి వస్తుంది.ఇది అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అయితే కేంద్రం రూ.6 కోట్లు దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. అయితే పాప తండ్రి జిసాన్ అహ్మద్ ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో తమ బిడ్డపై ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన అయాన్ష్ గుప్తా ఇదే వ్యాధితో బాధపడుతున్న వేళ క్రౌడ్ ఫండింగ్ పేరిట ఏడాది పాటు ఇంపాక్ట్ గురు సంస్థ ఆన్లైన్ వేదికగా రూ. 16 కోట్లు విరాళాలు సేకరించి ఆ బాబును బతికించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న జిసాన్ అహ్మద్‌కు మళ్లీ ఆశలు చిగురించాయి. దీంతో పాప ఇంజెక్షన్‌కు విరాళాలు సేకరించేందుకు తన మిత్రులు, సోషల్ మీడియా గ్రూఫ్లను సంప్రదించాడు. అలా ఇప్పటివరకు క్రౌడ్ ఫండింగ్ పేరిట రూ. 40 లక్షలు పోగయ్యాయి. కానీ దురదృష్టంకొద్ది ఆ చిన్నారి మంగళవారం కన్నుమూయడంతో విరాళం అందించిన వారు పాపను బతికించలేకపోయామని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయమై.. పాప తండ్రి జిసాన్ అహ్మద్ స్పందించాడు. '' ఉదయం నాలుగు గంటల సమయంలో పాప బాగానే ఉంది. ఆకలితో ఏడ్వడంతో పాపకు పాలు పట్టిచ్చి మళ్లీ నిద్రపుచ్చాం. కానీ ఉదయం ఏడు గంటల సమయంలో పాపను లేపడానికి ప్రయత్నించగా.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులున్నట్లు గమనించాం. దీంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు దృవీకరించారు. పాప ఇంజెక్షన్ కోసం క్రౌడ్ ఫండింగ్ పేరిట విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇంజెక్షన్‌కు రూ. 16 కోట్లు అవసరం కాగా.. ఇప్పటివరకు రూ. 40లక్షలు సేకరించాం. అయితే పాప చనిపోవడంతో మాకు విరాళం అందించిన వారికి డబ్బు తిరిగిచ్చేస్తాం.'' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. చదవండి: 62,400 మంది దాతలు.. రూ.16 కోట్లు.. బాలుడికి పునర్జన్మ -
అనుమానాస్పదంగా పసికందు మృతి
రేగోడ్(మెదక్): అభం శుభం తెలియని పసికందు అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన రేగోడ్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, అల్లాదుర్గం సీఐ జార్జి తెలిపిన వివరాల ప్రకారం.. రేగోడ్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మన్ పోచమ్మ దంపతులకు ఇది వరకు ఇద్దరు కుమారులు ఉండగా రెండోబాబు ఏడాది క్రితం చనిపోయాడు. తొమ్మిది రోజుల క్రితం పోచమ్మ మరో బాబుకు జన్మనిచ్చింది. మంగళవారం సాయంత్రం ఇంట్లో పసికందు అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఇంట్లో లక్ష్మన్, పోచమ్మలతో పాటు మరో ఐదుగురు ఉంటున్నారు. లక్ష్మన్ పాత సామగ్రి (స్క్రాప్) వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పసికందు మృతిచెందిన ఘటనా స్థలికి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలు చేరుకుని క్లూస్‌కోసం పరిశీలించారు. పసికందు తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో పెద్దశంకరంపేట ఎస్ఐ నరేందర్, స్థానిక హెడ్ కానిస్టేబుల్ పూర్యానాయక్, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి : (బైక్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య) (మంచి నిద్రలో ఉండగా..గొలుసు మాయం!) -
బకెట్లో పడి బాలుడు మృతి
సాక్షి, కుభీర్(ఆదిలాబాద్) : మండలంలోని సాంగ్వి గ్రామానికి చెందిన పొట్టేవార్ ఆదిత్య (2) ఆదివారం మధాహ్నం 3 గంటలకు రెండు రూపాయల బిల్ల కోసం బాత్రూంలోని బకెట్లో పడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టేవార్ రజిత యోగేష్ దంపతులకు ఇద్దరు కుమారులు మధ్యాహ్నం కుటుంబసభ్యులు ఇంట్లో ఉండగా చిన్న కుమారుడు ఆదిత్య ఆడుకుంటూ.. బాత్రూంలోకి వెళ్లాడు. ఆడుకుంటుండగా రెండు రూపాయల బిల్ల బకెట్లో పడింది. దానిని తీయడానికి బకెట్లోకి వంగి తీసుకునే ప్రయత్నంలో అందులో పడిపోయాడు. నీటిలో తల మునగడంతో అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన కుటుంబసభ్యులు భైంసా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. గ్రామంలో విషాదం.. మండలంలోని సాంగ్వి గ్రామంలో ఆదివారం రెండు రూపాయల బిల్ల కోసం బకెట్లో పడి పొట్టేవార్ రజిత యోగేశ్ దంపతుల చిన్న కుమారుడు ఆదిత్య (2)మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వందలాది మంది తరలివచ్చారు. తల్లిదండ్రులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. -
వేధింపుల పర్వం
జైపూర్: ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి, హత్య చేసిన ఓ ట్రక్కు డ్రైవర్‌ను రాజస్తాన్‌లోని టొంక్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్లు ఇస్తానని చెప్పి, స్కూల్ వద్ద నుంచి తీసుకెళ్లిన నిందితుడు మహేంద్ర అలియాస్ ఢోలు చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు చిన్నారికి తెలిసిన వ్యక్తి కావడంతో.. తల్లిదండ్రులకు చెబుతుందేమోనన్న భయంతో పాపను అక్కడే చంపేశాడని ఎస్పీ ఆదర్శ్ తెలిపారు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడ్డ తర్వాత రాజస్తాన్ విడిచి పారిపోవాలని భావించాడని, అయితే అలీగఢ్‌లో పట్టుపడ్డాడని వివరించారు. నిందితుడి వయసు 41 ఏళ్లు ఉంటుందని, ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అతడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని ఎస్పీ తెలిపారు. శనివారం పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమం తర్వాత చిన్నారి కన్పించడం లేదని మొత్తం వెతికారు. మరుసటి రోజు ఉదయం స్కూల్ సమీపంలో పాప శవమై కన్పించింది. స్కూల్ బెల్టుతో మెడకు బిగించి ఊపిరాడకుండా చంపేశాడని పోలీసులు తెలిపారు. కన్న తండ్రే కూతురిపై.. జైపూర్: సొంత తండ్రే కన్న కూతురిని గొలుసులతో కట్టేసి, హింసించి, పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డ హేయమైన ఘటన రాజస్తాన్‌లోని జలోర్ జిల్లాలో జరిగింది. తన తండ్రి వేరే మహిళతో చనువుగా ఉన్న సమయంలో తాను చూశాననే కోపంతో గొలుసులతో తన కాళ్లు, చేతులు కట్టేసి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఇంటి నుంచి బాధితురాలు శుక్రవారం తప్పించుకుని తన మేనమామ పొలం దగ్గరికి వచ్చింది. అప్పటికీ తన చేతులు గొలుసులతో కట్టేసి ఉన్నాయి. జరిగిన విషయాన్ని తన మేనమామతో చెబితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ ఇంట్లో జరిగే హింసను తట్టుకోలేక బాధితురాలి తల్లి ఏడేళ్ల కిందటే నిందితుడిని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఒడిశాలో గ్యాంగ్ రేప్.. నిందితుల్లో కానిస్టేబుల్ పూరి: ఒడిశాలోని పూరీలో సోమవారం ఓ మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగింది. కాకట్‌పర గ్రామానికి చెందిన బాధితురాలు నిమపరలోని బస్టాండ్ వద్ద బస్ కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అక్కడికి కారులో వచ్చిన ఓ వ్యక్తి..కాకట్‌పర తీసుకెళ్తానంటూ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో కారులో మరో ముగ్గురు వ్యక్తులున్నారు. బాధితురాలిని ఝడేశ్వరి క్లబ్ పక్కనున్న పోలీస్ క్వార్టర్ల వద్దకు తీసుకెళ్లి ఇద్దరు రేప్ చేశారు. అక్కడ తనకు దొరికిన పర్స్‌ను బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదుచేసింది. అందులోని ఐడీకార్డుల ద్వారా నిందితుడైన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి, అరెస్ట్‌చేశారు. -
పౌడర్ డబ్బాపై పడి చిన్నారి మృతి
సాక్షి, గుంటూరు : ఇంట్లో ఆడుకుంటూ పౌడర్ డబ్బాపై పడడంతో మెడపై తీవ్రంగా గాయమై జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్న తొమ్మిది నెలల చిన్నారి మృతిచెందిన సంఘటన ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. గుంటూరు లాలాపేట ఎస్హెచ్ఓ ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం బాలాజీనగర్ 6వ లైనుకు చెందిన తురకా ఏసుబాబు కుమార్తె తొమ్మిది నెలల జస్సి శుక్రవారం ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పౌడర్ డబ్బామీద పడడంతో మెడకు తీవ్ర గాయమైంది. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు బాలికను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం గురువారం డిశ్చార్జి చేశారు. ఏసుబాబు కుమార్తెను ఇంటికి తీసుకువచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం మృతిచెందింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కారు చక్రాల కింద చితికిన చిన్నారి ప్రాణం..
న్యూఢిల్లీ: అన్నెం పున్నెం ఎరుగని చిన్నారి కారు చక్రాల కింద నలిగిపోయింది. ఈ దారుణ ఘటన శుక్రవారం ఢిల్లీలోని నేతాజీ సుభాష్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం(ఎన్ఎస్ఐటీ) ఆవరణలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్ఎస్ఐటీ క్యాంపస్ ఆవరణలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ పసిపాపపై కారును పోనిచ్చాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. క్యాంపస్ క్యాంటీన్ ఆవరణలో, ఉదయం 9.30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా మృతురాలి తల్లి పేర్కొన్నారు. నిందితుడిని యూనివర్సిటీకి చెందిన ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం. పాపను ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాధితురాలి తల్లిదండ్రులు, బంధువుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. -
అయ్యో పాపం.. ఆడపిల్ల
నాగరిక ఎంత అభివృద్ధి చెందినా... సాంకేతికంగా ఎంత పురోగమిస్తున్నా ఈ లోకంలో ఆడ జన్మకు కష్టాలు మాత్రం తప్పడం లేదు. నవ మాసాలు కడుపులో మోసి బిడ్డను కనటానికి తల్లి నరక బాధను అనుభవిస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో.. అప్పుడే ఈ లోకంలోకి అడుగుపెట్టిన శిశువును నడిరోడ్డుపైనే వదిలేసి వెళ్లింది. రోడ్డుపై మాంసం ముద్దలా విగత జీవిగా పడి ఉన్న ఆ శిశువును చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి. చందాలు వేసుకుని మరీ ఆ శిశువుకు దహన సంస్కారాలు చేశారు. ఈ హృదయ విదారక ఘటన గురువారం చీరాలలో చోటుచేసుకుంది. సాక్షి, చీరాల రూరల్(ప్రకాశం) : అది చీరాల పట్టణంలోని విఠల్ నగర్ ప్రాంతం. ఊరు పేరు తెలియని నిండు గర్భిణి... ఎవరి చేతిలోనైనా మోసానికి గురైందో లేక ఆ తల్లికి ఏ కష్ట మొచ్చిందో తెలియదు బుధవారం రాత్రి స్థానిక రెడ్డిగారి స్కూలు వద్దకు చేరుకుంది. నా అనేవారు ఎవరూలేని ఆ అభాగ్యురాలు స్కూలు సమీపంలోని రహదారిపై ఏ సమయంలో పురుడు పోసుకుందో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువును అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఉదయాన్నే మృత శిశువును చూసిన స్థానికులు తీవ్ర కలత చెందారు. పేగు కూడా కత్తిరించని స్థితిలో మాతృమూర్తి కడుపులోని అవయవాలు కూడా రోడ్డుపైనే పడివున్నాయి. అప్పటికే ఆ ఆడ శిశువు అచేతనంగా రోడ్డుపై పడి ఉంది. ఈ దృశ్యన్ని చూసిన స్థానికులు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. కొందరు మహిళలు కంటతడి పెట్టారు. తలో కొంత డబ్బులు చందాలు రూపంలో వసూలు చేసుకుని గురువారం ఆ శిశువుకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారం కాకూడదని ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నా మానవత్వాన్ని మరచిన కొందరు కఠిన హృదయులు ఇటువంటి దురాగతాలకు పాల్పడటం శోచనీయం. -
అమ్మతనం ఆవిరైంది.. నాలుగో అంతస్తు పైనుంచి..
లక్నో: అమ్మతనం ఆవిరైంది. అనారోగ్యంతో పుట్టిన పిల్లాన్ని మోయలేక పోయింది. మూడు నెలల చిన్నారి ఉసురు తీసి ‘ఊపిరి’ పీల్చుకుంది. వివరాలు.. మూడు నెలల చిన్నారిని కన్నతల్లే కర్కశంగా హత్య చేసిన అమానవీయ ఘటన లక్నోలో చోటుచేసుకుంది. పుట్టుకతోనే జాండిస్, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కొడుకును అక్కున చేర్చుకోవాల్సింది పోయి ఓ అమ్మ రాక్షసంగా ప్రవర్తించింది. చికిత్స చేయిస్తున్నా పిల్లాడి ఆరోగ్యం కుదటపడక పోవడంతో అతన్ని తుదముట్టించాలనుకుంది. బాలుడికి చికిత్సనందిస్తున్న కింగ్ జార్జ్ మెడికల్ యునివర్శిటీ హస్పిటల్ భవనం నాలుగో అంతస్తు నుంచి కింద పడేసింది. తీవ్ర గాయాలతో చిన్నారి ప్రాణాలు విడిచాడు. తొలుత ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని అందరూ భావించారు. అయితే, భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త నిలదీయడంతో చేసిన నేరం ఒప్పుకుంది. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. -
వైద్యం అందక చిన్నారి మృతి
సాక్షి, మంచిర్యాల : వైద్యుడి నిర్లక్ష్యంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు నెలల చిన్నారి మృతిచెందింది. దీంతో చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ అంబేద్కర్‌కాలనీకి చెందిన ఎల్కపెల్లి మల్లేష్, తరుణి దంపతుల తొలి సంతానం సాయి మనస్విని (నాలుగు నెలలు). పుట్టినప్పటి నుంచి జిల్లాకేంద్రంలోని హర్షిత పిల్లల ఆసుపత్రిలో చూపిస్తున్నారు. మనస్వినికి శ్వాస రాకపోవడంతో మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు పాప ముక్కులో రెండుచుక్కలు మందు వేశారు. మరో ఇద్దరు సీనియర్ వైద్యులు కూడా పరిశీలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో మనస్విని మృతి చెందింది. అయితే చిన్నారి మృతికి ఆసుపత్రి వైద్యుడు గోలి పూర్ణచందర్ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు బంధువులతో కలిసి ఆస్పత్రి ఎందుట ఆందోళన దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. అప్పటికే రాత్రికావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఏసీపీ గౌస్‌బాబ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 20మంది సిబ్బంది బందోబస్తు చేపట్టారు. కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ పాప మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పేర్కొంటూ బంధువులు ఆందోళన కొనసాగించారు. సంఘటన స్థలానికి ఐఎంఏ, ఎమ్మార్పీఎస్ నాయకులు చేరుకొని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. బంధువులు రూ.10 లక్షలు డిమాండ్ చేయగా.. చివరకు రూ.2.50లక్షలు ఇచ్చేందుకు వైద్యుడు అంగీకరించారు. బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. తప్పు లేకున్నా.. ఆందోళన పాపను ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే జలుబు, జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం రాత్రి శ్వాస ఆడడం లేదని మళ్లీ వచ్చారు. అప్పటికే బేబీ కండిషన్ సీరియస్‌గా ఉందని చెప్పిన. అయినా వైద్యం చేయాలన్నారు. ఏర్పాట్లు చేసేలోపే మృతి చెందింది. పిల్లలకు పాలు పట్టిన తరువాత భుజంపై ఎత్తుకోవాలి. లేకుంటే పాలు లంగ్స్‌లోకి వెళ్లి శ్వాస ఆగిపోయే ప్రమాదముంది. మనస్విని విషయంలో ఇదే జరిగింది. – గోలి పూర్ణ చందర్, హర్షిత్ పిల్లల ఆసుపత్రి వైద్యుడు, మంచిర్యాల -
శ్వాస ఆడక రెండు నెలల పసిపాప మృతి
సాక్షి, విజయనగరం : పట్టణంలోని కేఎల్‌పురంలో ఉన్న శిశుగృహాకు చెందిన ఓ ఆడబిడ్డ మంగళవారం మృతి చెందింది. వివారాల్లోకి వెళ్తే...రెండు నెలలు క్రితం ఓ అవివాహిత ఆడబిడ్డకు జన్మనిచ్చి శిశుగృహాకు అప్పగించింది. ఆ బిడ్డకు శిశుగృహా సిబ్బంది దీపిక అని పేరు పెట్టారు. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో శిశుగృహ సిబ్బంది దీపికకు పాలు పట్టడానికి లేచి చూడగా తీవ్ర ఆయాసంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిపడడం గమనించి మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే కేంద్రాస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో పాప మృతి చెందింది. దీపిక మృతిని ఐసీడీఎస్ ఏపీడీ శాంతకుమారి ధ్రువీకరించారు.కారా (సెంట్రల్ ఆడప్సన్ రిసోర్స్ అధార్టీ) నిబంధనలు ప్రకారం శిశుగృహాకు చెందిన పిల్లలు మృతి చెందితే ఆ పిల్లలకు పోస్టుమార్టం చేయాలి. దీంతో దీపికకు కూడా శిశుగృహ సిబ్బంది కేంద్రాస్పత్రి వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే శిశుగృహలో 11 మంది పిల్లలు ఉన్నారు. వారిలో మంగళవారం ఒక పాప మృతి చెందింది. ఆకాష్ అనే ఐదు నెలల బాలుడు కూడా రెండు రోజులుగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో బాలుడిని విశాఖ కేజీహెచ్‌లో శిశుగృహ సిబ్బంది చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వలంటర్ అనే మరో ఐదు నెలల బాలుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
మగబిడ్డ పుట్టాడని ఆనందం..కానీ అంతలోనే
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం) : స్థానిక 50 పడకల ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 15వ తేదీన పుట్టిన బిడ్డ (నవజాత శిశువు) వెంటనే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆపరేషన్ చేయడంలో జాప్యం వల్ల బిడ్డ పుట్టిన వెంటనే మృతి చెందాడని, వెంటనే ఆపరేషన్ చేసుంటే మా బాబు బతికే వాడని కొత్తూరు మండలం గూనబద్రకు చెందిన రుగడ ఏసుబాబు, లక్ష్మి అన్నారు. పుట్టబోయే బిడ్డ కోసం 9 నెలలు ఎంతో ఆతృతగా ఎదురు చూశామని, మగ బిడ్డ పుట్టాడని ఆనందించామని అయితే తమ ఆనందం కొన్ని క్షణాలు కూడా ఉండలేదని ఏసుబాబు చెప్పారు. వైద్యులు వెంటనే స్పందించి ఉంటే తమకు న్యాయం జరిగేదని, బాబు బతికేవాడని ఏసుబాబు అన్నారు. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏడాదిన్నర కిందట ఏసుబాబుతో పోలాకి మండలం ముప్పిడికి చెందిన లక్ష్మితో వివాహమైంది. భార్య లక్ష్మి గర్భం దాల్చిన తరువాత శ్రీకాకుళంలో ఓ వైద్యురాలి వద్ద నిత్యం తనిఖీలు చేయించామని నెలలు నిండి నొప్పులు రావడంతో 14వ తేదీ రాత్రి 8.30 సమయంలో 108లో ఆసుపత్రికి తీసుకువచ్చామని ఏసుబాబు చెప్పారు. అయితే రాత్రంతా తన భార్య నొప్పులతో ఇబ్బంది పడిందని సాధారణ తనిఖీలు చేసిన సిబ్బంది ఉదయం 10 గంటల వరకూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసిన గంట కల్లా మృతి చెందాడని అదే ఆపరేషన్ రాత్రి చేసుంటే తమకు న్యాయం జరిగేదని చెప్పారు. ప్రస్తుతం తన భార్య లక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతుందన్నారు. అయితే ఈ సంఘటనపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. వైద్యపరమైన కారణాలతోనే మృతి ఈ సంఘటనపై ఆస్పత్రి ప్రధాన వైద్యురాలు ఎన్.పద్మావతి మాట్లాడుతూ వైద్యపరమైన కారణాలతో బిడ్డ మృతి చెందినట్టు చెప్పారు. గుండెజబ్బు ఉన్నట్టు గుర్తించామన్నారు. గర్భిణి ప్రసవానికి వచ్చిన వెంటనే ఆపరేషన్ చేయలేమని సాధారణ ప్రసవానికి ప్రయత్నించి అనుకూలంగా లేకపోతే ఆపరేషన్ చేస్తామని, ఇందులో భాగంగానే సాధారణ ప్రసవానికి ప్రయత్నించి చివరి క్షణంలో ఆపరేషన్ చేశామన్నారు. అయితే గుండెకు సంబంధించిన వ్యాధి ఉండడం వల్ల బిడ్డ పుట్టిన వెంటనే ఊపిరి తీసుకోలేక మృతి చెందినట్టు చెప్పారు. చిన్నపిల్లల వైద్యుడు నవీన్ మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పటికి ఊపిరి ఉందని, కొద్ది క్షణాల్లోనే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో తమ ప్రయత్నం చేశామని శ్రీకాకుళం తరలించేందుకు ప్రయత్నించే లోగా మృతి చెందినట్టు తెలిపారు. -
అమ్మ ఒడిలోనే.. ఆఖరి ఊపిరి
సాక్షి, తూర్పు గోదావరి : ఈ చిత్రంలో ఆమెను చూస్తే ఏమనిపిస్తోంది? దూర ప్రయాణంలో భాగంగా బస్టాండులో బస్సు కోసం ఒడిలో చిన్నారితో మండుటెండలో ఎదురుచూస్తున్నట్టుగా ఉంది కదా! కానీ గుండెలు పిండేసే నిజం ఏమిటంటే...ఆ పసిబిడ్డకు అనారోగ్యంగా ఉండడంతో దగ్గర్లోని పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు... పరిస్థితి విషమించడంతో రంపచోడవరం ఆసుపత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. కానీ రాజమహేంద్రవరం పెద్దాసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలోనే ఆ శిశువు తల్లి ఒడిలోనే కన్నుమూసింది. ఎతైన కొండలు... ఆ కొండలతో పోటీ పడుతున్నట్టుగా పొడవాటి చెట్లు ... ఈ రెంటింటి మధ్య గలగలా పారే సెల ఏళ్లు పక్షుల కిలకిలారావాలు, ఎటు చూసినా పచ్చదనమే ... అప్పుడప్పుడు వెళ్లే పర్యాటకులకు కనువిందే..మానసిక ఆనందమే...ఆహ్లాదమే...కానీ.. ఆ గూడెంలో ఉండే గిరిజనుల గుండెల నిండా ఉండే వ్యధ... కన్నతల్లుల కన్నీటి వెత ఎందరికి తెలుసు? వైద్యం అందక కన్నుమూస్తున్న మాతా, శిశు దేహాలను తీసుకువెళ్లేందుకు నానా చావు చావాలి. ఎత్తైన కొండలు, రవాణా సదుపాయాల లేని కుగ్రామాలు, వైద్యం కోసం రోగులను తీసుకుని కాలినడకన ఆస్పత్రులకు వెళ్లడం గిరిజనులకు సర్వసాధారణ అయింది. రెండు నెలల చిన్నారికి అస్వస్థతగా ఉండడంతో తల్లిదండ్రులు పరుగుపరుగున ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. విషమంగా ఉన్న శిశువు ప్రాణాలు దక్కలేదు. పుట్టేడు దుఃఖంతో శిశువు మృతదేహంతో కన్నీరుమున్నీరుగా వారు విలపించారు. అచేతన స్థితిలో ఉన్న వారిద్దరూ.. శిశువు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లేందుకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ అంబులెన్స్ కోసంస్థానిక ఏరియా ఆస్పత్రిలో విలపిస్తూ కూర్చుండిపోయారు. వారి వేదన అందరినీ కంటతడిని పెట్టించింది. వై.రామవరం మండలం పలకజీడి గ్రామానికి చెందిన సాదల అమ్మాజీ, రాంబాబు రెండు నెలల శిశువు అనారోగ్యంతో రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం మృతి చెందాడు. జ్వరం, న్యూమోనియాతో బాధపడుతోన్న శిశువును పలకజీడి నుంచి వై.రామవరం ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్య సిబ్బంది శిశువును రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అతడి పరిస్థితి అలాగే ఉండడంతో రంపచోడవరం ఆస్పత్రి వైద్యులు అత్యవసర వైద్యం రాజమహేంద్రవరం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంతలోనే శిశువు మృతి చెందాడు. అంబులెన్స్ లేక నిరీక్షణ రంపచోడవరం ఏరియా ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ లేక సాయంత్రం ఆరు గంటల వరకు తల్లిదండ్రులు నిరీక్షించారు. ఆస్పత్రి అంబులెన్స్ మోతుగూడెంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి వెళ్లింది. ఐటీడీఏకు చెందిన రెండు అంబులెన్స్‌లు.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులతో రాజమహేంద్రవరం వెళ్లాయి. రక్తదాన శిబిరానికి వెళ్లిన వాహనం తిరిగి రావడంతో సాయంత్రం ఆరు గంటలకు శిశువు మృతదేహాన్ని తరలించారు. -
వైద్యులు లేక డెలివరీ చేసిన నర్సులు శిశువు మృతి
-
పురిటిలోనే పసి ప్రాణం బలి
కమ్మర్పల్లి(బాల్కొండ): వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. కమ్మర్‌పల్లికి చెందిన మల్లగారి రేణుక అనే గర్భిణికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మధ్యాహ్నం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోగా, స్టాఫ్ నర్సు, హెల్త్ సూపర్వైజర్ మాత్రమే ఉన్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న రేణుకను ప్రసూతి గదిలోకి తీసుకెళ్లారు. పేషెంట్ అవసరమైన(పొలీస్ క్యాథటర్) యూరిన్ పైప్ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ప్రిస్కిప్షన్‌పై రాసిచ్చారు. కమ్మర్పల్లి మందుల దుకాణాల్లో లేకపోవడంతో మెట్‌పల్లికి వెళ్లి తీసుకువచ్చారు. ఈ కారణంగా రెండు గంటలు ఆలస్యమైంది. దీంతో వైద్య సిబ్బంది కాన్పు చేశారు. సహజ ప్రసవంతో మగ శిశువుకు జన్మించింది. పుట్టిన శిశువులో కదలికలు లేకపోవడంతో పాటు, నీలిరంగుగా మారడంతో శిశువును మరో ఆస్పత్రికి సిఫారసు చేశారు. కుటుంబ సభ్యులు మెట్‌పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే శిశువు మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. శిశువు మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది కారణంగానే శిశువు మరణించిందని ఆరోపిస్తూ సిబ్బందిని నిలదీశారు. కాన్పు చేసిన హెల్త్ సూపర్వైజర్, స్టాఫ్ నర్స్ శిశువు ఉమ్మ నీరు మింగిందని ఒకసారి, మరోసారి తెమడ తట్టుకుందని పొంతన లేని మాటలు చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. డ్యూటీ డాక్టర్ ఎక్కడ అని నిలదీశారు. వైద్యాధికారి సెలవులో ఉంటే సంబంధిత రిజిస్టర్‌ను చూపించాలని పట్టుపట్టారు. పోలీసుల సమక్షంలో రిజిస్టర్ చూపించడంతో అందులో అటెండ్ బాక్స్ ఖాళీగా ఉంది. అర్హత కలిగిన వైద్యులు లేకపోవడంతో అనర్హత కలిగిన సిబ్బంది కాన్పు చేయడం కారణంగా శిశువు మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులను సముదాయించారు. ఘటనపై అనుమానాలుంటే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో బాధితులు స్థానిక తహసీల్దార్, ఎస్ఐలకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి
సాక్షి, సిద్దిపేటటౌన్: సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పురిట్లోనే పాప మృతిచెందిన ఘటన బుధవారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన లక్ష్మి, లింగయ్యల కుమార్తె రజిత అలియాస్ లక్ష్మిప్రియ (23)కి సికింద్రాబాద్ ఈస్ట్‌మారెడ్‌పల్లికి చెందిన మధుతో ఏడాది క్రితం వివాహం జరిగింది. డెలివరీ కోసం తల్లిగారింటికి వచ్చిన లక్ష్మిప్రియకు మంగళవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు నొప్పులు ఎక్కువ రావడం లేదని అబ్జర్వేషన్లో ఉంచారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కొద్దికొద్దిగా పురిటి నొప్పులు రావడంతో మరోసారి పరీక్షించి సాయంత్రం వరకు చూడాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈలోగా పురిటినొప్పులు తగ్గడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు పరీక్షించి శిశువు ఉమ్మ నీరు తాగిందని, కుటుంబ సభ్యులు సంతకాలు చేస్తేనే ఆపరేషన్ చేస్తామని డ్యూటీ డాక్టర్ స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆపరేషన్ చేసి పాప కడుపులోనే మృతి చెందిందని డాక్టర్ చెప్పినట్లు బంధువులు ఆరోపించారు. పాప మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని, పాప మృతికి కారణమైన డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని పాప తండ్రి మధు డిమాండ్ చేశారు. పాప మృతిచెందిన విషయం డాక్టర్లు చెప్పగానే సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామని, అయినా పోలీసులు డాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మధు ఆరోపించారు. ఈ విషయంపై వన్ టౌన్ ఎస్సై శ్రీనివాస్‌ను వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కూతురు కోసం 36 గంటల పోరాటం
బెంగళూరు: కర్ణాటకలోని ధార్వాడ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతి ఇటీవల కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరుకుంది. ఈ ఘటనలో తన కుమార్తెను కాపాడుకునేందుకు 36 గంటల పాటు ఓ తల్లి చేసిన పోరాటం వెలుగులోకి వచ్చింది. విస్టేజ్ మార్కెటింగ్ సంస్థ ఈ భవంతిలో ఆఫీస్ ఏర్పాటుచేసింది. ఈ సంస్థలో ప్రేమా ఉనకల్(36) మార్కెటింగ్ ప్రతినిధిగా చేస్తోంది. స్కూల్‌కు వేసవి సెలవు కావడంతో ప్రేమాతోపాటు ఆమె కూతురు దివ్య(8) సైతం ఆఫీస్‌కు వచ్చింది. మంగళవారం సాయంత్రం భవంతి కుప్పకూలిపోవడంతో తల్లీకుమార్తెలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కొద్దిసేపటి తర్వాత మేలుకున్న ప్రియ, కుమార్తె కోసం వెతుకులాట ప్రారంభించింది. అక్కడే శిథిలాల కింద చిక్కుకున్న దివ్య చేతులు కనిపించాయి. ఆ చీకటిలోనే 45 నిమిషాల పాటు కష్టపడి దివ్యను బయటకు తీసుకొచ్చింది. అంతలోనే అప్పటివరకూ కదలకుండా ఉన్న మరో పిల్లర్ చిన్నారి దివ్యపై పడిపోయింది. దీంతో బాలిక బాధతో విలవిల్లాడింది. ఈ పిల్లర్ కింద చిక్కుకున్న దివ్యను కాపాడేందుకు ప్రియ మరో 24 గంటల పాటు ప్రయత్నించింది. చిన్నారి స్పృహ కోల్పోకుండా ఉండేందుకు తాను అంతసేపు మెలకువగానే ఉంది. 20న దివ్య ఏడుపు ఆపేసింది. అదేరోజు ఉదయం అధికారులు యంత్రాల ద్వారా శిథిలాల తొలగింపు ప్రారంభించారు. ఆ శబ్దం విన్న ప్రియ ‘మేమిక్కడ చిక్కుకున్నాం’ అని గట్టిగా అరిచింది. దీంతో అధికారులు ప్రియను రక్షించి ఆసుపత్రికి తరలించారు. దివ్యను శిథిలాల కిందనుంచి బయటకు తీసినప్పటికీ ఆమె అప్పటికే చనిపోయింది. ఈ విషయాన్ని ప్రియ కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పలేదు. ఈ విషయమై ప్రియ పిన్ని మాట్లాడుతూ..‘ఎన్డీఆర్ఎఫ్ అధికారులు రాగానే తనను కాకుండా కుమార్తెను రక్షించాలని ప్రియ కోరింది. కానీ ఆమెను తొలుత వెలికితీసిన అధికారులు ఆసుపత్రికి తరలించారు. దివ్య అప్పటికే చనిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రియ చేతులు, కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. మెలకువలోకి వచ్చిన ప్రతీసారి కుమార్తె దివ్య గురించి ప్రియ అడుగుతోంది. ఏడుస్తూ అంతలోనే స్పృహ కోల్పోతోంది. కానీ దివ్య ఇక లేదన్న విషయాన్ని మేం చెప్పలేకపోతున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
డాక్టర్ల నిర్లక్ష్యం..2నెలల చిన్నారి మృతి
-
వైద్యం అందక చిన్నారి మృతి
మంచిర్యాలక్రైం: ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో ఓ చిన్నారికి సకాలంలో వైద్యం అందక మృతిచెందిన సంఘటన మంచిర్యాల పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కాసిపేట మండల కేంద్రానికి చెందిన వైద్యం అందకపోవడంతోదంపతుల కూతురు తనుశ్రీ (2)కి మూడు రోజులుగా జ్వరం వస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకు మంచిర్యాలలోని స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన గంటలోపే చిన్నారి మృతి చెందింది. సకాలంలో వైద్యం అందకపోవడంతోనే చిన్నారి మృతిచెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబసభ్యులతో మాటాడి ఆందోళన విరమింపజేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు. తనుశ్రీ చనిపోయే గంట ముందే ఆస్పతికి తీసుకువచ్చారని, అప్పటికే చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు తెలిపాడు. వైద్యం అందించలోపే మృతిచెందిందన్నారు. ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదన్నారు. కాగా, చిన్నారి మృతితో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
గర్భంలోనే పిండం మృతి
మహబూబాబాద్ రూరల్ : వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా గర్భంలోని పిండం మృతి చెందిందని బాధితురాలి బంధువులు మానుకోట ఏరియా ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితురాలి భర్త పల్ల సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం సూదనపల్లికి చెందిన పల్ల భార్గవి నెలలు నిండి వారం రోజులు పూర్తయ్యాక పురుటి నొప్పులు రావడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏరియా ఆస్పత్రికి వచ్చింది. విధుల్లో ఉన్న గైనకాలజిస్టు ఆశాదేవి భార్గవిని పరీక్షించి ఓ ఇంజక్షన్ తెప్పించి ఇవ్వడంతో కొంత ఉపశమనం లభించింది. డెలివరీ కోసం అక్కడే ఉండిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో స్కానింగ్ తీయించిన డాక్టర్ ఆశాదేవి రిపోర్టు చూసి చిన్న నొప్పులే.. నార్మల్ డెలివరీ అవుతుంది.. గర్భంలో శిశువు హార్ట్‌బీట్ బాగానే ఉందని చెప్పింది. కొంచెం నొప్పులు వస్తున్నాయని భార్గవి చెప్పినా పట్టించుకోలేదని సందీప్ తెలిపాడు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో రౌండ్స్‌కు వచ్చిన సూపరిండెంటెంట్, గైనకాలజిస్టు వెంకట్రాములు భార్గవిని పరీక్షించి స్కానింగ్ చేసి కడుపులో శిశువు మృతి చెందిందని చెప్పారు. రాత్రి డాక్టర్ చెప్పిన విషయం ఆయన దృష్టికి తీసుకురాగా మరో వారం రోజుల వరకు కూడా డెలివరీ చేసేందుకు అవకాశం ఉందని చెప్పి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఒంటి గంట సమయంలో భార్గవిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి అనంతరం మృతి చెందిన ఆడ శిశువును కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారు. దీంతో వారు బోరున విలపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు గర్భంలోనే మృతి చెందిందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. -
కాన్పు చేసిన నర్సులు
కల్వకుర్తి టౌన్ : వైద్యులు లేకుండా నర్సులే ఓ మహిళకు ప్రసవం చేయడంతో చిన్నారికి పేగు చుట్టుకుని మృతి చెందిందింది. ఈ ఘటన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభత్వ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. కల్వకుర్తి ఎస్ఐ రవి, బాధితురాలి భర్త రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండ లం ఫిరోజ్ నగర్ గ్రామపంచాయతీకి చెందిన మంగమ్మ కాన్పు కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి సోమవారం ఉదయం వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు సాయంత్రం సాధారణ కాన్పు చేద్దాం.. అంతా సిద్ధం చేయాలని నర్సులకు సూచించి వెళ్లిపోయారు. అయితే, మంగమ్మ నొప్పులు తీవ్రమవుతున్నా వైద్యులు రాకపోవటంతో నర్సులే కాన్పు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాన్పు చేస్తుండగా.. బిడ్డకు పేగు చుట్టుకుని ఉండడంతో ఆందోళన చెందిన నర్సులు వైద్యుడు శివరాంకు ఫోన్లో సమాచారం ఇవ్వగా ఆయన బయలుదేరగా.. వచ్చేటప్పటికే బాబు చనిపోయాడు. ఈ విషయమై వైద్యుడు శివరాంను అడగగా.. మంగమ్మ పరిస్థితిని నర్సులు తనకు చెప్పగా.. సాధారణ ప్రసవం వీలు కాకపోతే సిజేరియన్ చేద్దామని ప్రయత్నించినా అప్పటికే బిడ్డ బయటకు రావడంతో చనిపోయాడని తెలిపారు. నర్సులు కాన్పులు చేయొచ్చా అని అడిగితే.. సాధారణ కాన్పులు చేయొచ్చు కానీ క్లిష్ట పరిస్ధితి ఎదురైతే వైద్యులకు సమాచారం ఇస్తారని పేర్కొన్నారు. కానీ ఈ విషయమై మంగమ్మ బంధువులు మాట్లాడుతూ కాన్పు పూర్తిగా నర్సులే చేశారని, పూర్తిగా బిడ్డ బయటకు వచ్చాకే వైద్యుడు చేరుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలియగానే కల్వకుర్తి సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై రవి చేరుకుని బాధితులతో మాట్లాడారు. -
తొగర్‌పల్లిలో విషాదఛాయలు
కొండాపూర్(సంగారెడ్డి) : తాను లేని చోట తన పిల్లలకు దిక్కెవరూ అనుకుందో ఏమో గానీ తా నూ విషపు గుళికలు తీసుకొని చిన్నారులకు సైతం ఇచ్చింది. ఈ ఘటనలో 17 నెలల వయసు గల చిన్నారి మృతిచెందగా, మూడు సంవత్సరాలు బాబు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. సమయానికి ఆస్పత్రికి చేరుకోవడంతో తల్లి మాత్రం సురక్షితంగా ఉంది. వివరాల్లోకి వెళితే స్థానిక సీఐ రవి కథనం ప్రకారం.. మండల పరిధిలోని తొగర్పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు ఐదు సంవత్సరాల క్రితం హత్నూర మండలం బడంపేట గ్రామానికి చెందిన లక్ష్మితో వివా హమయింది. శ్రీనివాస్, లక్ష్మి దంపతులకు ప్రణ తి (14 నెలలు), మనోజ్‌కుమార్(4) సంతానం. శ్రీనివా స్ భార్య లక్ష్మి తరచూ అనారోగ్యానికి గురయ్యేది. ఒక్కోసారి వారం రోజులు మంచంపైనే ఉన్నా ఇంట్లో ఎవరూ పలకరించేవారు కారనీ, కనీసం భర్త కూడా పలుకరించేవాడు కాదనీ ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన లక్ష్మి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనీ నిర్ణయించుకొంది. తన మరణానంతరం తన పిల్లల భవిష్యత్ ఆలోచించి, పిల్లలు అనాథలు అవుతారనుకొని ఇంట్లోని యూరియా గుళికలను తీసి వాళ్లకు ఇచ్చి తాను మింగింది. పొలానికి వెళ్లిన భర్త తిరిగొచ్చి ప్రణతిని ఎత్తుకోవడానికి చేతిలోకి తీసుకోగా డీలా పడిపోతుంది. అనుమానం వచ్చిన శ్రీనివాస్ తన భార్యను అడగ్గా విషయం చెప్పినట్లు సీఐ తెలిపారు. వెంటనే చికిత్సకోసం మొదటగా సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రణతి (14 నెలలు) మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. లక్ష్మి, మనోజ్‌కుమార్‌లకు ప్రథమ చికిత్స చేసి న అనంతరం మెరుగైన వైద్యంకోసం హైదరాబా ద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సీఐ వివరించారు. ప్రస్తుతం తల్లి లక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉండగా కుమారుడు మనోజ్‌కుమార్ పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉందనీ, 3రోజుల వరకు ఏ విషయం చెప్పలేమనీ వైద్యులు తెలిపారనీ సీఐ వివరించారు. గ్రామంలో విషాదఛాయలు.. తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు ఆత్మహత్యాయత్నం వార్త దావనంలా వ్యాపించడంతో తొగర్పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 14 నెలల చిన్నారి ప్రణతి మృతి చెందడంతో బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. చిన్నారి ప్రణతి అంత్యక్రియలను సోమవారం నిర్వహించారు. -
ఆస్పత్రుల ఎదుట ఆందోళన
నార్కట్‌పల్లి(నకిరేకల్) : ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ముగ్గురు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందారంటూ వారి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనలు మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, నార్కట్‌పల్లి, చౌటుప్పల్‌లో చోటుచేసుకున్నాయి. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన వర్రె లక్ష్మి పార్వతమ్మ రెండో కాన్పు పురిటినొప్పులు వస్తుండడంతో సోమవారం భర్త వర్రె సత్తీష్, బంధువులు స్థానిక కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ పరీక్షించి ఆపరేషన్ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. కాసేపటికి తల్లికి బ్లీడింగ్ అవుతుందని, అందుకు ఆపరేషన్ చేయాలని చెప్పి రెండుసార్లు ఆపరేషన్ చేశారు. తల్లి కన్నుమూసింది. వైద్యులు సక్రమంగా చికిత్స అందించకపోవడం మూలంగానే తమ భార్య మృత్యువాతపడిందని భర్త ఆరోపించారు. లక్ష్మిపార్వతిని చూసేందుకు వచ్చిన బంధువులు దాదాపు గంట సేపు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకుని ఎస్ఐ గోవర్ధన్, సీఐ క్యాస్ట్రోరెడ్డిలు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపచేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందినట్లు మృతురాలి భర్త ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. నకిరేకల్‌లో చిన్నారి.. నకిరేకల్ : ఆస్పత్రిలోని డాక్టర్ల నిర్లక్ష్యంతో వైద్యం వికటించి మూడు నెలల పసిపాప మృతి చెందిందని నకిరేకల్‌లో మంగళవారం ఆ చిన్నారి తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆస్పత్రి ఎదు ట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌లోని తాటికల్రోడ్డుకు చెందిన చినేని జానయ్య, శైలజకు చెందిన రమ్య(3నెలలు)కు సోమవారం వాంతులు విరేచనాలతో పాటు జ్వరం రావడంతో నకిరేకల్‌లోని సాయి శ్రీనివాస పిల్లల వైద్యశాలకు తీసుకువచ్చారు. సదరు డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు రాసి పంపించారు. చిన్నారి రమ్య మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మంగళవారం ఉదయం అదే ఆస్పత్రికి తీసుకురాగా సదరు వైద్యశాల డాక్టర్ పాప పరిస్థితి విషమంగా ఉందని, పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో కుటుంబీకులు సదరు డాక్టర్‌మీద ఆందోళన వ్యక్తం చేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి రమ్య ప్రాణాలు కోల్పోయింది. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు కూడా మృతి చెందినట్లు చెప్పడంతో రమ్య తల్లిదండ్రులు, కుటుంబీకులు సాయి శ్రీనివాస పిల్లల వైద్యశాల ముందు ఆందోళనకు దిగారు. సదరు డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మా చిన్నారి మృతి చెందిందని వాపోయారు. ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి నకిరేకల్ సీఐ సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీ సులు చేరుకుని చిన్నారి రమ్య తల్లిదండ్రులను, కుటుంబీకులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై సదరు డాక్టర్ నాంపల్లి శ్రీనివాస్‌ను వివరణ కోరగా చిన్నారి మృతికి సంబంధించి వైద్యం విషయంలో తన తప్పేమి లేదన్నారు. మూడు నెలల చిన్నారుల విషయంలో ఒక్కొక్కరికి శ్వాసకు సంబంధించిన ప్రభావాలు రావడంతో చనిపోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. -
ప్రసూతి ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి
నిర్మల్ : జిల్లా కేంద్రంలోని ప్రసూతి ఆస్పత్రిలో ఆడశిశువు మృతి చెందడంతో ఆందోళన నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని బాధితులు ఆరోపిస్తున్నారు. శిశువుకు ఫిట్స్ రావడం వల్లే చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం శివారులోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ భార్య లకితకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రసూతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. శుక్రవారం ఆమెకు వైద్యులు ప్రసవం చేయడంతో పాప పుట్టింది. కొద్దిగా పసిరికలు కనిపించడంతో ఎన్‌బీఎస్‌యూలోని బాక్సులో ఉంచారు. సోమవారం ఉదయం నుంచి ఫిట్స్ రావడంతో పిల్లల వైద్యులు పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని, పాప ఊపిరితిత్తుల్లో కూడా ఇన్ఫెక్షన్ ఉందని తెలిపారు. మధ్యాహ్నం వరకు పరిస్థితి విషమించడంతో శిశువు మృతి చెందింది. ఈక్రమంలో మూడు రోజుల పాటు ఆరోగ్యంగా ఉన్న పాప ఆకస్మాత్తుగా ఎలా చనిపోతుందంటూ బాధిత కుటుంబీకులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రిలో కాసేపులో ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డీసీహెచ్ఎస్ డాక్టర్ బోర్కర్ సురేశ్‌కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రజినీ అక్కడికి చేరుకున్నారు. వారితోనూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డ చనిపోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. తల్లి లకితకు ఇవ్వాల్సిన యాంటీ–డీ ఇంజక్షన్ ఇవ్వకపోవడం వల్లే ఇది జరిగిందని పేర్కొన్నారు. వైద్యులు దీన్ని కొట్టిపారేస్తూ.. ఆ ఇంజక్షన్‌కు శిశువు మృతికి సంబంధం లేదని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఫిట్స్ వచ్చి చనిపోయిందని వివరించారు. అనంతర శిశువు మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. -
స్టాఫ్‌నర్సు కళావతిపై చర్యలు తీసుకోవాలి
తల్లాడ : స్టాఫ్‌నర్సు కళావతిని సస్పెండ్ చేయాలని, శిశువు మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తల్లాడ పీహెచ్సీ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. మార్తిని పద్మ డెలివరీ అయిన తర్వాత శిశువు మృతి చెందటంతో ఆస్పత్రి సిబ్బందిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. వారికి రైతు సంఘం, కుర్నవల్లి గ్రామస్తులు మద్దతు తెలిపారు. శిశువు కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి లేకుండా డెలివరీ చేసిన స్టాఫ్ నర్సు కళావతిని సస్పెండ్ చేయాలన్నారు. 24 గంటలు డాక్టరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే డాక్టరు ఉండి వెళ్లటం వల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. అనంతరం డిప్యూ టీ డీఎంఅండ్‌హెచ్‌ఓ భాస్కర్‌నాయక్, డాక్టర్లు వి. రాజ్‌కుమార్, కె.శ్రీనులతో చర్చించారు. 24 గంటలు ఆస్పత్రిలో వైద్యులు ఉండేలా నివేదిక పంపిస్తామన్నారు. బాధ్యులపై చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో గుంటుపల్లి వెంకటయ్య, తమ్మిశెట్టి శ్రీను, చల్లా నాగేశ్వరరావు, గంటల వెంకటాచారి, ఐనాల రామలింగేశ్వరరావు, కందికొండ నర్సిరెడ్డి, దగ్గుల ముత్తారెడి, జక్కుల రాములు, నెర్సుల తిరుపతిరావు, ఎల్లమ్మ, సావి త్రి పాల్గొన్నారు. -
నీటి గుంతలో పడి ఐదేళ్ల చిన్నారి మృతి
తూర్పుగోదావరి ,వీఆర్‌పురం (రంపచోడవరం): మండలంలోని వలస ఆదివాసీ గ్రామం సున్నం మట్కాలో ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ నీటి గుంతలో పడిన ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం ఈ గ్రామానికి చెందిన మడకం కోసయ్య దేవీ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె జ్యోష్ణ (5) ఉన్నారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ఆమె చదువుకుంటోంది. ఆదివారం సెలవు కావడంతో ఆమెతో పాటు మరికొంతమంది ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో ఆడుకొంటున్నారు. వర్షపు నీటి నిల్వ కోసం అటవీ శాఖ తవ్వించిన ట్రెంచింగ్ (కందం) కాలువ వద్దకు వెళ్లిన వారు కాలువలో తలో రాయ వేస్తుండగా జ్యోష్ణ కాలుజారి నీటిలో పడి మునిగి పోయింది. మిగిలిన పిల్లలు భయంతో పరుగున వెళ్లి పెద్దలకు చెప్పారు. వారు కాలువ వద్దకు వచ్చి ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందింది. బాలిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండులు, కుటుంభ సభ్యులు బోరున విలపించారు. -
జైంట్‌వీల్ విరిగి పడి చిన్నారి మృతి
-
లోకం చూడకుండానే ప్రాణం పోయింది!
నవమాసాలు మోసి.. పండంటి బిడ్డను కళ్లారా చూడాలనుకున్న ఆ తల్లికి గర్భశోకమే మిగిలింది. పురిటిలోనే బిడ్డను కోల్పోవడంతో తల్లడిల్లిపోయింది. శిశువు మరణానికి ఆస్పత్రి వర్గాల నిర్లక్షమే కారణమంటూ బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. నర్సులు సైతం నిరసనకు దిగి ఆశ్చర్య పరిచారు. ఈ సంఘటన రాజాం సామాజిక ఆస్పత్రి వద్ద గురువారం చోటుచేసుకుంది. విజయనగరం, రాజాం సిటీ : రాజాం సామాజిక ఆస్పత్రికి విజయనగరం జిల్లా బలిజిపేట మండలం గళావళ్లి గ్రామానికి చెందిన గర్భిణి కింజంగి కల్యాణి ప్రసవం కోసం వచ్చి చేరింది. ఈమె అత్త వారు వంగర మండలం కొండచాకరాపల్లి కాగా గర్భిణి కావడంతో కన్నవారి ఇంటి వద్ద ఉండేది. నెలలు నిండడంతో కుటుంబీకులు ఆమెను బుధవారం రాజాం సామాజిక ఆస్పత్రికి తీసుకువచ్చారు. వివిధ పరీక్షలు, స్కానింగ్‌లు చేసిన సిబ్బంది డెలివరీకి సమయం ఉందంటూ నచ్చజెప్పి ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. అయితే కల్యాణికి వంట్లో నలతగా ఉండడంతో భయపడిన కుటుంబీకులు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచారు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి కల్యాణికి నొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని చెప్పేందుకు డ్యూటీ డాక్టర్ సునీత కోసం కల్యాణి కుటుంబీకులు ఆరా తీశారు. అయితే ఆమె లేకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేశారు. దీంతో డ్యూటీలో ఉన్న ఇద్దరు నర్సులు మందులు ఇచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే ఆ తరువాత కూడా కల్యాణికి నొప్పులు తగ్గకపోవడంతో ఇబ్బంది పడింది. ఈ విషయాన్ని కూడా నర్సుల దృష్టికి కుటుంబీకులు తీసుకెళ్లారు. ఇదే సమయంలో కల్యాణకి రక్త స్రవం అధికం కావడంతో ఆందోళన చెందారు. వైద్యం అందించాలని నర్సులను వేడుకున్నారు. దీంతో గురువారం తెల్లవారు జామున నర్సులు కలుగజేసుకొని ప్రసవం జరిపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బిడ్డ చనిపోయింది. దీంతో కల్యాణి కుటుంబీకు ఆగ్రహానికి గురయ్యారు. నొప్పులు అధికంగా ఉన్నాయని, బతిమిలాడుకున్నా డ్యూటీ డాక్టర్ రాలేదని, నర్సులే బలవంతంగా వైద్యం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కల్యాణి భర్త తిరుపతిరావు ఆరోపించారు. వేరే ఆస్పత్రికి వెళ్లి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని రోదించాడు. చేతులారా పండంటి బిడ్డను కోల్పోయామని కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆస్పత్రి వద్ద ఆందోళన విషయం తెలుసుకున్న కల్యాణి బంధువులు, కొండచాకరాపల్లి, గళావల్లి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు గురువారం ఉదయం చేరుకున్నారు. కల్యానికి జరిగిన అన్యాయంపై ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రంగంలోకి సూపరింటెండెంట్... ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌నాయుడు బాధితరాలు కల్యాణి కుటుంబీలతో మాట్లాడారు. పూర్తి వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ లేకపోవడం ఏమిటని, నర్సులు వైద్యం చేయడమేమిటని మండిపడ్డారు. గర్భిణులు, శిశువుల ప్రాణాలతో ఆస్పత్రి సిబ్బంది ఆడుకుంటున్నారని బాధిత కుటుంబీకులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని పట్టబట్టారు. ఆస్పత్రి సిబ్బందితో కూడా సూపరింటెండెంట్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్యాణికి వైద్యం చేసిన నర్సులు మాట్లాడుతూ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతోనే తామే వైద్యం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాన్పు కష్టంగా ఉండడంతో తమకు తెలిసిన పద్ధతిలో ప్రయత్నించామని.. అయితే దురదృష్టవశాత్తు బిడ్డ చనిపోయింది పేర్కొన్నారు. సూపరింటెండెంట్ విలేకరులతో మాట్లాడుతూ మృతశిశువే జన్మించిందని..ఇందులో తమ సిబ్బంది తప్పులేదని స్పష్టం చేశారు. డ్యూటీ డాక్టర్ ఎక్కడ? బుధవారం రాత్రి ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తమ బిడ్డకు బాగోలేదని సమాచారం అందించినా డాక్టర్ రాలేదని.. నర్స్‌లే మొత్తం డ్రామాలు ఆడారని బాధితులు వాపోయారు. సకాలంలో మెరుగైన వైద్యం అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదికాదన్నారు. నర్సుల నిరసన డ్రామా ఇదిలా ఉండగా తమపైకి ఆరోపణలు రావడంతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులంతా ఒక్కటయ్యారు. డాక్టర్లు అందుబాటులో ఉండడంలేదని, రాత్రి, పగలు మేమే సేవలందిస్తున్నామని మీడియా ఎదుట చెప్పుకొచ్చారు. కల్యాణకి కష్టపడి వైద్యం అందించామని.. అయితే బిడ్డ చనిపోవడం బాధాకరమన్నారు. తమను ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ నిరసన డ్రామాకు తెరలేపారు. ఈ విషయం చర్చనీయాంశమైంది. భవిష్యత్‌లో డ్యూటీ డాక్టర్లు, సంబంధిత డాక్టర్లు ఉంటేనే రోగులకు సేవలందిస్తామని, లేకుంటే సేవలు చేయలేమని నర్సులంతా స్పష్టం చేశారు.విచారణ..శిశువు మృతిపై పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్యతోపాటు డీసీహెచ్ఎస్ సూర్యారావులు మెజిస్ట్రేటియల్ విచారణ జరిపారు. ముందుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం సీహెచ్ నాయుడును, డ్యూటీ డాక్టర్ సునీతను, నర్సులు పద్మావతి, రమాదేవిలను రెండు గంటలపాటు విచారించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, ఎంతటి వారైనా శిక్షార్హులేనని డీసీహెచ్ఎస్ సూర్యారావు విలేకరులకు తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. ఓ తల్లికి గర్భశోకం
నంద్యాల : స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. కాన్పుకోసం వచ్చిన మహిళకు ప్రసవం చేయకుండా ఈరోజు, రేపు అంటూ నాన్చుడు ధోరణితో వ్యవహరించారు. దీంతో శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధితు లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ప్రభుత్వాసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆదివారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వీసీ కాలనీకి చెందిన హారూన్, సలీమాలకు 11సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. మగసంతానం కోసం ఆపరేషన్ చేయించుకోకుండా ఉన్నారు. సలీమా ఈనెల 7వ తేదీన కాన్పు కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అప్పటి నుంచి వైద్యపరీక్షలు చేస్తున్న వైద్యులు కాన్పు చేయడంలో నాన్చుడు ధోరణి వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం కాన్పు కోసం ఇంజక్షన్ వేసి అనంతరం కాన్పు చేయకుండా థైరాయిడ్ ఉందని, పరీక్షల కోసం పంపారు. పరీక్షల్లో థైరాయిడ్ లేదని వచ్చిందని, ఆపరేషన్ చేయమని కోరినా వైద్యులు రేపు చేస్తామని పేర్కొన్నారని, ఆదివారం కూడా ఉదయం, మధ్యాహ్నం అంటూ నిర్లక్ష్యం వహించారని బాధితులు తెలిపారు. అనంతరం కడుపులో శిశువు మరణించిందని ఒకసారి, గుండెపోటుతో శిశువు మృతి చెందిందని మరోసారి పొంతనలేని జవాబులు చెప్పారని హారూన్ పేర్కొన్నారు. డబ్బులు లేక తాము ప్రభుత్వాసుపత్రికి వచ్చామని, వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పలుకుబడి ఉన్న వారికి మాత్రమే వైద్యం చేస్తున్నారని, పేదవారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. శిశువు మృతితో ఆందోళన... శిశువు మృతి చెందారని తెలుసుకున్న బాధితుల బంధువులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న నంద్యాల టూటౌన్ సీఐ శివభాస్కర్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకొని బాధితులకు సర్దిచెప్పారు. విచారించి బాధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
దుప్పట్లో చుట్టి 30 కి.మీ పరుగు.. ఆశ ఓడింది
సాక్షి, రత్లామ్ (మధ్యప్రదేశ్) : నిమిషం ముందు తీసుకొచ్చినా ప్రాణాలు పోకుండా కాపాడగలిగేవాళ్లం అని వైద్యులు సాధారణంగా చెబుతుంటారు. వాస్తవానికి ఆమాటలు నూటికి నూరుపాళ్లు నిజమే. ప్రమాదకరపరిస్థితుల్లో వైద్యం అందకుంటే ప్రాణాలుపోవడం ఖాయం. ఓ నాలుగేళ్ల బాలిక విషయంలో ఇదే రుజువైంది. తీవ్ర అనారోగ్యానికి గురైన జీజా అనే మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌కు చెందిన బాలికను ఆస్పత్రిని తరలించేందుకు ఆలస్యం కావడంతో ప్రాణంపోయింది. సమయానికి అంబులెన్స్ రాకపోవడం, తల్లిదండ్రులే శ్రమకూర్చి బైక్‌పై తీసుకెళ్లడం, అప్పటికే ఆలస్యం కావడంతో పాప చనిపోయింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తమ కూతురుని తొలుత నర్సింగ్ హోమ్ తీసుకెళ్లగా అక్కడ వైద్యం చేసి రత్లామ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అయితే, వారు అంబులెన్స్ కోరగా ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో వేరే దారి లేక పాపను స్నేహితుడి బైక్‌పై ఓ దుప్పటిలో పెట్టి ఉంచారు. వెనుక కూర్చున్న అతడి భార్య చేతిలో ఫ్లూయిడ్ సెలైన్ పట్టుకుంది. కనీసం 30 కిలో మీటర్లు వారు ప్రయాణించగా అప్పటికే ఆలస్యం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన 15 నిమిషాల్లోనే పాప చనిపోయింది. -
తల్లిపాలే విషమై..
మాడ్గుల: తల్లి పాలు అమృతతుల్యం. ఓ గుక్కెడు తల్లి పాలు చిన్నారి జానెడు పొట్టకు ప్రాణాధారం. కానీ ఆ గుక్కెడు పాలే ఓ పసిమొగ్గ పాలిట విషమయ్యాయి. తనపై పడిన క్రిమిసంహారక మందును గుర్తించని ఆ మాతృమూర్తి.. పాల కోసం అల్లాడుతున్న కుమార్తెకు పాలు పట్టి తన కనుపాపనే కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామంలో చోటు చేసుకుంది. భర్తను కాపాడుకున్నా.. ఇర్విన్ గ్రామానికి చెందిన కడారి మల్లయ్య ఈ నెల 25న రాత్రి మద్యం మత్తులో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఇది గమనించిన మల్లయ్య భార్య లక్ష్మీదేవి భర్త ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుంది. ఆ ప్రయత్నంలో లక్ష్మీదేవి ఛాతీపై క్రిమిసంహారక మందు పడింది. అయితే దీనిని లక్ష్మీదేవి గమనించలేదు. భర్తను ఎలాగైనా రక్షించుకోవాలనే ఆందోళనలో చికిత్స చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఇంటి దీపం ఆరిపోయింది.. అదే సమయంలో తన మూడేళ్ల కూతురు ప్రణీత పాల కోసం గుక్కపట్టి ఏడుస్తుండగా.. లక్ష్మీదేవి తన ఛాతీపై క్రిమిసంహారక మందు పడిన విషయం గమనించకుండా తన కూతురుకు పాలు పట్టింది. ఆ పాలు తాగిన ప్రణీత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను వెంటనే హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణీత బుధవారం కన్నుమూసింది. తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి
-
పసిపాపను బలిగొన్న ఇంజెక్షన్
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇంజెక్షన్ వికటించి 45 రోజుల చిన్నారి బుధవారం మృతి చెందింది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో నివాసముంటున్న అప్పాల విజయ్–హారిక దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు రియా. చిన్నమ్మాయి 45 రోజుల పసికందు. రోజూ అంగన్వాడీ సెంటర్లో సరుకులు తీసుకునేందుకు తల్లి హారిక వెళ్తుంది. ఈ క్రమంలో బుధవారం ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఆశ కార్యకర్త చిన్నారికి ఇంజెక్షన్ ఇవ్వాలని, తీసుకురావాలని తెలిపింది. దీంతో తల్లి హారిక పాపను ఆస్పత్రికి వెళ్లింది. మొదట సులోచన అనే ఆశ కార్యకర్త పోలియో చుక్కలను వేసింది. తర్వాత రెండో ఏఎన్ఎంలు సునీత, అరుణ పెంటావ్యాక్సినేషన్ చేశారు. అప్పటికి పాప ఏడుస్తుండటంతో ఏమీ కాదంటూ ఇంజెక్షన్ చేశారు. ఇంటికి తీసుకొచ్చాక కొద్దిసేపటికి∙పాపలో చలనం లేకపోవడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసు కెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. తన పాప మృతికి కారణం వైద్య సిబ్బందే అంటూ కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సిబ్బంది అక్కడి నుంచి పరారయ్యారు. చిన్నారి మృతికి కారణమైన వైద్య సిబ్బందిని తొలగించాలంటూ ఇల్లందకుంట ప్రధాన దారిపై గ్రామస్తులు 2 గంటలపాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జమ్మికుంట సీఐ ప్రశాంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, మూడేళ్ల క్రితం తన పెద్ద కూతురు లక్కీ(రియా)కి కూడా ఇదే ఆస్పత్రిలో ఇంజెక్షన్ వికటించిందని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపా యం తప్పిందని తండ్రి విజయ్ తెలిపారు. -
తల్లిపాలు విషమయ్యాయి..
-
తల్లిపాలు విషమయ్యాయి..
నిర్మల్/కడెం: ఆ చిన్నారి వయస్సు 11 నెలలు... ఆకలికి తట్టుకోలేకపోయింది. అప్పుల బాధతో తండ్రితో పాటు తల్లి కూడా పురుగుల మందు తాగి ఆస్పత్రిలో ఉందన్న జ్ఞానం ఆమెకు లేదు. ఆకలికి తాళలేక తల్లిపాలు తాగగా.. అవికాస్తా విషపూరితమై చిన్నారి మృత్యువాత పడింది. ఈ ఘటనలో రైతు కుటుంబంలో భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. హృదయ విదారకమైన ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేటలో శనివారం జరిగింది. ధర్మాజీపేటకు చెందిన కసునూరి భీమేశ్(36) తండ్రి పదేళ్ల క్రితమే మరణించాడు. అతడికి నలుగురు అక్కాచెల్లెళ్లు. ఎకరం సాగు భూమి ఉండగా, సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉండగా.. ఓ కుమారుడు కాల్వలో పడి చనిపోయాడు. భార్యకు విడాకులిచ్చిన భీమేశ్ రెండేళ్ల క్రితమే శైలజ(31)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 11 నెలల కూతురు మహేశ్వరి ఉంది. అయితే, కుటుంబ అవసరాల కోసం రూ. 3 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పు తీరకపోగా.. వడ్డీ పెరుగుతుండటంతో రుణభారం రోజురోజుకూ పెరుగుతోంది. మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మంది తాగారు. స్థానికులు నిర్మల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ భీమేశ్ చనిపోయాడు. ఆస్పత్రిలో ఉన్న శైలజ పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఇవేవీ తెలియని చిన్నారి మహేశ్వరి తల్లిపాలను తాగింది. అప్పటికే తల్లిపాలు విషపూరితం కాగా, చిన్నారి అస్వస్థతకు గురైంది. నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. చిన్నారి చనిపోయింది. -
వీధికుక్కలు ఉసురు తీశాయి
-
వీధికుక్కలు ఉసురు తీశాయి
శునకాల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి గుంటూరు : అభం శుభం తెలియని చిన్నారి జీవితాన్ని కుక్కలు చిదిమేశాయి. నిండా నాలుగేళ్లు కూడా నిండని ఆ పసివాడి ప్రాణాలు తోడేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన గుంటూరు నగర పరిధిలోని అడవితక్కెళ్లపాడు రాజీవ్‌గృహకల్ప సముదాయంలో గురువారం జరిగింది. రాజీవ్ గృహకల్ప మూడో బ్లాక్‌లో దూపాటి ఏసుబాబు, మల్లేశ్వరి నివసిస్తున్నారు. మల్లేశ్వరి నగరంలోని ఓ హోటల్లో పనిచేస్తుండగా.. ఏసుబాబు కూలి పనులకు వెళ్తుంటాడు. వారికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు ప్రేమ్‌కుమార్(4) అడవితక్కెళ్లపాడులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. గురువారం నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో బాబు ఇంట్లోనే ఉన్నాడు. తల్లిదండ్రులు రోజూ లాగానే పనులకు వెళ్లారు. కొనుక్కుందామని వెళ్లి మ«ధ్యాహ్నాం రెండుగంటల ప్రాంతంలో చిన్నారి ప్రేమ్‌కుమార్ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. రోడ్డుపక్కనే ఉన్న బడ్డీ కొట్లో ఏదో కొనుక్కుందామని అటుగా వెళ్తున్నాడు. అంతలోనే మూడు కుక్కలు వచ్చిపడ్డాయి. వాటిని చూసి చిన్నారి భయపడి పరిగెత్తేలోపే మీదికి దూకాయి. గొంతుభాగాన్ని పట్టుకుని ఈడ్చుకెళ్లాయి. బాలుడి ఏడ్పులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి కుక్కలను తరిమేందుకు ప్రయత్నించినా అవి వదల్లేదు. రాళ్లతో కొట్టినా బాలుడి గొంతు విడిచిపెట్టలేదు. చివరికి తీవ్రంగా గాయపరిచి వదిలేశాయి. అప్పటికే బాలుడు స్పృహలో లేడు.. బాలుడు చనిపోయాడని భావించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని రక్తంముద్దగా మారిన బిడ్డను చూసి గుండెలు బాదుకుంటూ విలపించారు. ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ అనూరాధ ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. నల్లపాడు పోలీసులు పంచనామా నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం
– తల్లికి తీవ్ర గాయాలు కర్నూలు: వెంకటేశ్వర నగర్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు..హైదరాబాద్–బెంగుళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న కృష్ణాభవన్ సమీపంలోని వెంకటేశ్వర నగర్లో సుగాలి వెంకటనాయక్ నివాసముంటున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో వెంకటనాయక్ భార్య సుబ్బులుబాయి చిన్న కూతురు మధుర మీనాక్షితో కలసి (రెండున్నరేళ్లు) ఇంటి ముందు నిలబడి పక్కింటి వారితో మాట్లాడుతోంది. అదే కాలనీలో నివాసముంటున్న మిన్నల్ల కుమారుడు మైనర్ బాలుడు సయ్యద్ మహబూబ్ బాషా(14) (ఏపీ20ఏ 2593) మారుతీ కారును వేగంగా మలుపు తీసుకుని అదుపు చేసుకోలేక తల్లి, కూతుళ్లను ఢీకొట్టాడు. ఇద్దరికీ బలమైన రక్తగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మధుర మీనాక్షి మృతి చెందింది. తల్లి సుబ్బులుబాయికి కాలు విరిగింది. నాలుగో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మైనర్ బాలుడు వాహనాన్ని వదిలేసి పారిపోవడంతో పోలీసులు ఆధారాలను సేకరించారు. వెంకటనాయక్కు నలుగురు సంతానం కాగా ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి చివరి కూతురు. విషయం తెలిసిన వెంటనే బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. వెంకటనాయక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగో పట్టణ సీఐ నాగరాజరావు తెలిపారు. -
తల్లీ.. వెళ్లిపోయావా..
బోరుబావిలో పడిన చిన్నారి మృతి ►కడసారి చూపునకూ నోచని తల్లిదండ్రులు ►పాప డ్రెస్, శరీర భాగాలే లభ్యం ►ఫలితమివ్వని 60గంటల రెస్క్యూ ఆపరేషన్ ►స్వగ్రామం గోరెపల్లిలో అంత్యక్రియలు ►అన్ని ప్రయత్నాలు చేసినా కాపాడుకోలేక పోయాం : మంత్రి, జిల్లా కలెక్టర్ చిట్టి తల్లీ వెళ్లిపోయావా.. కడసారి చూపుకూ నోచుకోలేక పోయాం తల్లీ.. ఏ దేవుడూ మా ప్రార్థనలు ఆలకించలేదు చిన్నారీ. నిన్ను కాపాడకోలేక పోయాం.. మమ్మల్ని మన్నించు తల్లీ.. నీ ముద్దు ముద్దు మాటలు వినే భాగ్యం మాకు లేకుండా పోయాయి. నిన్ను ఎలా మరిచిపోగలం అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వేలాది మంది చేసిన ప్రార్థనలు.. అధికార యంత్రాంగం ప్రయత్నాలు ఆ చిన్నారిని కాపాడలేక పోయాయి. పాప చనిపోయిందన్న వార్త విన్న ప్రజలు బోరుమన్నారు. – చేవెళ్ల/మొయినాబాద్: చేవెళ్ల/మొయినాబాద్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి ఘటన విషాదాంతంగా ము గిసింది. పాపను రక్షించాలని 60 గంటలపాటు నిర్విరామంగా సాగిన ఆపరేషన్.. సఫలీకృతం కాలేదు. ఏడాదిన్నరకే.. ఆ పాలబుగ్గల పాపకు నూరేళ్లు నిండడం ప్రతిఒక్కరినీ కలచివేసింది. పాప ఇక లేదన్న వార్తతో అందరి హృదయాలు ద్రవించిపోయాయి. బిడ్డ ఎలాగైనా సురక్షితంగా బయటకు రావాలని నిండు మనసుతో దేవుళ్లకు ప్రార్థించినా.. అది నెరవేరలేదు. పాప అందరినీ విడిచి పోయిందని, ఇక లేదని.. ఆదివారం ఉదయం 6.20 గంటల సమయంలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ప్రకటించారు. జిల్లా, రాష్ట్ర యంత్రాంగాలు సర్వశుక్తులు ఒడ్డి రెండున్నర రోజులపాటు శ్రమించినా.. ఫలితం లేకపోయింది. కడసారి చూపునకు కన్నతల్లిదండ్రులు నోచుకోలేదు. పాప బోరుబావిలో పడినప్పటి నుంచి పాపను క్షేమంగా మీకు అప్పగిస్తామని యంత్రాంగం ధైర్యం చెబుతూ వచ్చినా.. సాధ్యపడలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఓఎన్జీసీ, సింగరేణి తదితర బృందాలు చేసిన విశ్వప్రయత్నాలు ఫలించలేదు. బోర్‌బావుల తవ్వకాల్లో అనుభవం ఉన్న వ్యక్తుల సహాయమూ నష్టాన్ని నివారించలేకపోయింది. అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులను అమలు చేసినా.. కడుపుకోతే మిగిలింది. బోరుబావుల ప్రమాద సంఘటనల్లో కెల్లా అత్యంత కఠినమైన రెస్క్యూ అపరేషన్‌గా దీన్ని భావిస్తున్నారు. ముందు ఫ్లషింగ్‌కు అంగీకరించని తల్లిదండ్రులు.. సాంకేతికను ఉపయోగించినా బోరుబావిలో పాప జాడ కనిపించలేదు. శుక్రవారం మధ్యాహ్నం చిన్నారి మరింత లోతుకు జారినప్పటి నుంచి.. అత్యాధునిక సీసీ కెమెరాలను ఉపయోగించారు. 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను చిత్రీకరించే కెమెరా సేవల్ని వినియోగించినా ఫలి తం లేకపోయింది. పాప 400 అడుగుల్లోతు ఉండొచ్చని.. అప్పటికే 60 గడవడంతో చనిపోయి ఉండవచ్చన్న ప్రాథమిక నిర్దరణకు అధికారులు వచ్చారు. దీంతో చివరకు ఫ్లషింగ్ ఒక్కటే మార్గమని యంత్రాంగం భావించింది. ఈ విధానాన్ని అవలంబిస్తామని అధికారులు.. మొదట పాప తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. తమ బిడ్డ మృతదేహానైనా కడసారి చూసే భాగ్యం కల్పించాలని కన్నీరుమున్నీరవుతూ అధికారులను వేడుకున్నారు. చివరకు కుటుంబ సభ్యుల సహకారంతో వారిని ఒప్పించగలిగారు. ఆ తర్వాత ఫ్లషింగ్ ప్రక్రియను చేపట్టారు. బోర్ రిగ్ ద్వారా బోరుబావిలోకి అధిక ఒత్తి డిని గొట్టం ద్వారా పంపడంతో.. ఒక్క ఉదుటున లోపల ఉన్న మట్టితోపాటు నీళ్లు బయటికి ఎగిరి పడ్డాయి. ఆతర్వాత పాప ధరించిన ఫ్రాక్ .. ఆ వెంటనే దుర్వాసన వెదజల్లుతూ చిన్నారి శరీర భాగాలు కొన్ని ఎగిరిపడ్డాయి. వెంటనే పాప వస్త్రాన్ని, శరీర అవశేషాలను సేకరించిన సహాయక బృందాలు.. మరో వస్త్రంలో మూటకట్టి శవపరీక్ష నిమిత్తం చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వలస కూలీగా వచ్చి.. బిడ్డను పోగొట్టుకుని వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోరెపల్లికి చెందిన యాదయ్య, రేణుకలు తమ ఇద్దరు పాపలతో కలిసి ఏడాది కిత్రం చనువెళ్లి గ్రామానికి వలస వచ్చారు. స్థానిక రైతు మల్లారెడ్డికి చెందిన పాలీహౌస్లో పనికి కుదిరిన ఆ కుటుంబం.. పొలం వద్దనే ఉన్న చిన్న గదిలో నివాసం ఉంటూ వ్యవసాయ పనులు చేసేవారు. బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకుని వచ్చినా.. ఇద్దరి బిడ్డలే తమ ప్రాణాలు భావించారు. వారి కళ్ల ముందు ఆడుతూ పాడుతూ చిన్న పాప చిన్నారి గురువారం సాయంత్రం ఇంటికి సమీపంలోని బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. దీన్ని చూసిన పెద్ద పాప హర్షిత.. పక్కనే పాకలో ఆవులకు పాలు పితుకుతున్న తండ్రి యాదయ్యకు విషయాన్ని చెప్పింది. హుటాహుటిన వచ్చిన తండ్రి పాప ఏడుపులను గమనించి క్షణాల్లో అప్రమత్తమై స్థానికలతో కలిసి పాపను కాపాడేందుకు ప్రయత్నించారు. బోరుబావిలో ఉన్న బోరుమోటారును పైకి లాగేందుకు యత్నించారు. కాని పాప పైకి రాకపోగా 10 అడుగుల లోతులో నుంచి 40 అడుగుల లోతుకి వెళ్లింది. అక్కడ మోటర్, బోరుబావి అంచుకు మధ్య చిక్కుకుంది. పై నుంచి మట్టి పడడంతో పైకి లాగినా సాధ్యపడలేదు. అప్పటి నుంచి ఆదివారం ఉదయం వరకు పాపకోసం పలు విధాలుగా చేసిన రెస్క్యూ అపరేషన్లు ఫలించకపోగా.. కడచూపుకూ దూరమైంది. ఘటన రోజు.. గురువారం సాయత్రం 6–45 గంటలకు బోరుబావిలో చిన్నారి పడినట్లు తెలిసిన మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి చనువెళ్లికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి కలెక్టర్‌కు సమాచా రం అందించారు. అప్పటికే స్థానిక పోలీసులు, 108 అబులెన్స్‌లు వచ్చి సహయక చర్యలల్లో భాగంగా చిన్నారికి ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేశారు. అప్పటికే స్థాని కుల సహాయంతో అధికారులు బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తీసే పనులు ప్రారంభించారు. రాత్రి 10 గంటలకు కలెక్టర్ రఘునందన్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. షేక్‌పేట నంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం ఒక్కటి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంది. అప్పటికే సమాచారం అం దుకున్న నల్లగొండ జిల్లాకు చెందిన పుట్టం కరుణాకర్ అక్కడికి చేరుకున్నాడు. అతడు సీసీ కెమెరాలను లోపలికి పంపించి.. 40అడుగుల లోతులో పాప ఉందని, ప్రాణా లతో ఉన్నట్లు గుర్తించాడు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు అన్ని విధాలుగా ప్రయత్నించాడు. రాడ్ల సహయంతో పాప చేతికి తాడు బిగించి బయటకు తీసేందుకు శ్రమించినా.. ఫలితం లేకపోయింది. దీంతో తెల్లవారుజామున మంగళగిరి నుంచి వచ్చిన మరో ఎన్డీఆర్ఎఫ్ బృందం పాపను బయటకు తీసేందుకు అటోమెటిక్, మాన్యువల్ రోబో పరికరాలను ఉపయోగించారు. శుక్రవారం రాత్రి వరకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగినా సఫలం కాలేదు. సాంకేతికతకూ లభించని జాడ శుక్రవారం రాత్రి మొత్తం తవ్వకాలు కొనసాగించారు. పాప పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అక్సిజన్ను నిరంతరాయంగా అందించారు. పాప ఆరోగ్య పరిస్థితిని సైతం తెలుసుకునేందుకు నిపుణులు డీఆర్డీఓ అధికారి, నిమ్స్ మాజీ డైరెక్టర్ బృందాన్ని రప్పించి పరిస్థితిని సమీక్షించింది. 24 గంటలు దాటిన తర్వాత ఎన్డీఆర్ఎప్ బృందం చర్యలు çఫలించకపోవటంతో బోరుమోటర్‌ను బయటకు తీస్తే పాపకూడా బయటకు వస్తుందని బోరుమోటర్‌ను తీశారు. అయితే పాప బయటకు రాకపోగా 40 అడుగుల నుంచి మరింత లోతులోకి వెళ్లిపోయింది. దీంతో పాపను గుర్తించటం కష్టంగా మారింది. సీసీ కెమెరాలకూ జాడ కనిపించలేదు. దీంతో సింగరేణి, ఓఎన్జీసీ బృందాలను రంగంలోకి దించారు. శనివారం వచ్చిన ఈ ప్రత్యేక బృందాలు సైతం పరిస్థితి చేయి దాటిపోయిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక అత్యాధునిక సీసీ కెమెరాలను సైతం తెప్పించారు. సముద్ర గర్భంలో సైతం ఉన్నవాటిని స్పష్టంగా గుర్తించడం దీని ప్రత్యేకత. ఈ మ్యాట్రిక్స్ కెమెరాతో పరిశీలించినా 110 నుంచి 210 అడుగుల వరకు పాప జాడ కనిపించలేదు. గుంతలను పూడ్చివేసిన అధికారులు చనువెళ్లిలో రైతు రాంరెడ్డి పొలంలో వేసిన బోరుబావిలో పడిన చిన్నారి కోసం ఎకరం విస్తీర్ణంలో దాదాపు 32 అడుగల మేర గొయ్యి తీశారు. చివరకు పాప చనిపోయిందని ఖరారు కావడంతో ఆ గొయ్యిని పూడ్చేశారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి రేయింబవళ్లు జిల్లా, రాష్ట్ర యంత్రాంగం శాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయింది. రెస్క్యూ ఆపరేషన్ ముగియడంతో అక్కడే ఉన్న ఇటాచీలతో గుంతలను పూడ్చేశారు. నిరాశే మిగిలింది క్షణక్షణం ఉత్కంఠను తలపించిన చిన్నారి ఆపరేషన్‌కు తెరపడింది. బోరుబావిలో పడిన చిన్నారిని కడసారైనా చూద్దామని తరలివచ్చిన ప్రజలకు చివరకు నిరాశే మిగిలింది. మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు మూడు రోజులపాటు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి వరుస కట్టారు. పరిసర ప్రాంత గ్రామాల ప్రజలంతా చేరుకున్నారు. చిన్నారి క్షేమంగా బయటకు వస్తుందని ఉత్కంఠగా ఎదురుచూశారు. శుక్రవారం, శనివారం రోజంతా వేల సంఖ్యలో జనం వచ్చి చిన్నారిని ఎలా బయటకు తీస్తున్నారని ఆసక్తిగా చూశారు. బోరు మోటారును బయటకు లాగడంతో చిన్నారి ప్రాణాలపై ఆధికారుల్లో ఆశలు సన్నిగిల్లాయి. అదే సమయంలో ప్రజల్లో సైతం చిన్నారి ప్రాణాలతో బయటకు వస్తుందనే ఆశ తగ్గింది. అయినా ఎక్కడో చిన్న ఆశ. ఎలాగైనా ప్రాణాలతో బయట పడుతుందన్న నమ్మకంతో.. రేయింబవళ్లు నిద్రాహారాలు మానేసి అక్కడే వేచి చూశారు. చివరకు ఫ్లషింగ్ ద్వారా చిన్నారి బట్టలు, అవశేషాలు మాత్రమే బయటకు రావడంతో.. అందరి కళ్లలో కన్నీళ్లు కనిపించాయి. 60 గంటలపాటు అక్కడే.. చిన్నారిని రక్షించాలని యంత్రాంగం సవాలుగా తీసుకుంది. ఈ మేరకు శక్తివంచన లేకుండా శ్రమించింది. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు రెస్క్యూ బృందం, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంధంగా వచ్చిన బోర్‌వెల్స్ యజమానులు ఎంతో కృషి చేశారు. 60 గంటలపాటు సాగిన ఆ ఆపరేషన్.. అత్యంత క్లిష్టమైనదిగా యంత్రాంగం భావించింది. గతంలో బోరుబావిలో పడిన చిన్నారులను ఒక్కటి రోజుల్లో రెస్క్యూ బృందాలు రక్షించాయి. కొన్ని ఘటనల్లో ప్రాణాలు పోయినా.. చివరకు మృతదేహాలనైనా బయటకు తీసేవి. కానీ చిన్నారి విషయంలో ఆ రెండూ సాధ్యపడలేదు. రేయింబవళ్లు పర్యవేక్షణ బోరుబావిలో చిన్నారి పడిన అరగంటకే.. ఘటనా స్థలానికి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి చేరుకున్నారు. ఆదివారం ఉదయం వరకు అక్కడే ఉండి యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడంతోపాటు సహాయక చర్యలు చురుగ్గా జరిగేలా చూశారు. సైబరాబాద్ సీపీ సందీశాండిల్యా, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్లాఆర్, మాజీ మంత్రి సబితారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, డీసీపీ పద్మాజారెడ్డి, ఏసీపీలు గంగిరెడ్డి, శృతకీర్తి, ఫైర్ అధికారి హరినాథ్‌రెడ్డి, ఎన్ఆర్డీఎఫ్ కమాండర్ డీఎన్ సింగ్ తదితరులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎన్నడూ ఊహించలేదు.. బోరుబావి యజమాని రాంరెడ్డి పశ్చాత్తాపం చెందారు. తన బోరు చిన్నారిని బలితీసుకుంటుందని ఎన్నడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం బోరుబావిని మూసే ఉంచానని చెప్పారు. ఇటీవల వర్షాలు కురవడంతో.. నీటి ఊట వచ్చి ఉంటుందని మోటారు బిగించామని పేర్కొన్నారు. చిన్నారి తండ్రి సహకారంతోనే ఈ పనులు పూర్తి చేశామన్నారు. శతవిధాలా ప్రయత్నాలు.. శనివారం సాయంత్రం కెఎల్లార్ ఇండస్ట్రీస్ యజమాని, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వచ్చి పరిశీలించారు. ఆయన బోరుబావులు వేయటంలో నిపుణులు కావటంతో అధికారులతో చర్చించారు. పాప 40 అడుగుల లోతు నుంచి లోపలికి వెళ్లే అవకాశం ఉండదని, బోరుమోటర్‌ను పైకి లాగే ప్రయత్నంలో పాప ఇదే లోతులో ఎక్కడో ఒక చోట పక్కకు చిక్కుకుని ఉండొచ్చని అధికారులకు చెప్పారు. 40 అడుగుల తర్వాత రైతు వేసే బోరుబావిలో పాప పట్టదని స్పష్టం చేశారు. దీంతో కేఎల్లార్ ప్రయత్నాలకు యంత్రాంగం అవకాశమిచ్చింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పాపను గుర్తించే వరకు కేఎల్లార్ అధీనంలో అపరేషన్ కొనసాగింది. అప్పటికే పాప బతికే అవకాశాలు లేవని యంత్రాంగం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. వెంటనే బోరుబావిలోకి ఆక్సిజన్ అందించే పనులను నిలిపివేశారు. కేఎల్లార్ తన కంపెనీ నుంచి ప్రత్యేక వాహనాలను రప్పించారు. ముందుగా సమాంతరంగా బోరు వేసి ఫ్లషింగ్ ద్వారా పాప మృతదేహాన్ని బయటకు తీయాలని భావించారు. కానీ తల్లిదండ్రులు పాప దేహాన్ని ఛిద్రం చేయవద్దని కోరారు. అయితే మొదటగా 40 అడుగుల లోతులో పాప చిక్కుకుని ఉండొచ్చని భావించి¯ గొయ్యి తీయాలని నిశ్చయించారు. అప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో.. ఫ్లషింగ్ చేయక తప్పదని నిర్ణయానికి వచ్చారు. దాదాపు 260 అడుగుల లోతు వరకు హై ఫ్లషింగ్ చేయటంతో లోపల నుంచి నీటితోపాటు చిన్నారి డ్రెస్ రెండు ముక్కలుగా బయటకు వచ్చింది. ఆ తర్వాత పాప శరీర అవయవాలు కొన్ని బయటపడ్డాయి. కూతురు మృతి చెందిందన్న వార్త విని రోదిస్తున్న చిన్నారి తల్లిదండ్రులు యాలాల మండలం గోరెపల్లిలో అంత్య్రక్రియలు నిర్వహిస్తున్న బంధువులు -
పాముకాటుతో చిన్నారి మృతి
కౌతాళం: పాముకాటుతో చిన్నారి మృతి చెందిన ఘటన కామవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి లక్ష్మి, బసవరాజు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో చివరి సంతానం మల్లేష్ అలియాస్ మల్లికార్జున(4) బుధవారం రాత్రి ఆరుబయట ఆడుకుంటుండగా ఏదో కరిచిందని ఏడవటంతో ఇంట్లో నుంచి తల్లి లక్ష్మి బయటకు వచ్చి చూసింది. విషయం తెలుసుకుని చుట్టుపక్కల చూడగా పామును చేసి కేకలు వేసింది. తండ్రి బసవరాజు వచ్చి పామును చంపేందుకు ప్రయత్నించగా తప్పించుకుంది. అస్వస్థతకు గురైన మల్లేష్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గురువారం బాలుడికి గ్రామంలో అంత్యక్రియలను నిర్వహించారు. బుధవారం రాత్రి అదే గ్రామంలో బోయ పక్కిరయ్య భార్య పద్మావతికి, హరిజన జాన్ పెద్దకుమారుడు పెద్దరంగడుకు కూడా పాముకాటు వేయగా వారు చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
పురుడుకని వెళ్తే.. ప్రాణం తీశారు!
డాక్టర్‌కు బదులు కాన్పు చేసిన నర్సులు.. - పురుడు పోసిన వెంటనే శిశువు మృతి - సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు - తల్లి పరిస్థితి విషమం చిన్నచింతకుంట: స్థానిక ప్రాథమిక వైద్యశాలలో నర్సులే డాక్టర్ అవతారమెత్తారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ గర్భిణికి ప్రసవం చేయగా.. శిశువు చనిపోవడంతోపాటు తల్లి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఉమారాణి మొదటి కాన్పు కోసం ఉదయం ఆస్పత్రికి వచ్చింది. ఓ సీనియర్ నర్సు ఉమారాణికి కాన్పు చేసింది. మధ్యాహ్నం 2గంటల తరువాత మగ శిశువు జన్మిం చాడు. వెంటనే శిశువు మృతి చెందాడు. ఈ విషయం ఉమారాణికి తెలియకుండా చూశారు. కాన్పు చేసిన నర్సు ఇంటికి వెళ్లిపోయింది. శిశువు మృతిని ఆలస్యంగా గమనించిన బంధువులు లబోదిబోమన్నారు. ఇంతలోనే బాలింత ఆరోగ్యం కూడా బాగలేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు. విషయం గ్రామస్తులకు తెలియడంతో రాత్రి 8 గంటలకు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఆస్పత్రికి డాక్టర్ లేడు చిన్నచింతకుంట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్లు ఉండేవారు. నెల క్రితం డాక్టర్ సంధ్యారాణిని బాదేపల్లికి బదిలీ చేశారు. మరో డాక్టర్ రాఘవేంద్రను ఆత్మకూర్‌కు బదిలీ చేశారు. అప్పటినుంచి కొత్త డాక్టర్‌ను ఎవరినీ నియమించలేదు. నర్సులే ఆస్పత్రికి వచ్చిన రోగులకు తెలిసిన వైద్యం చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇలాంటి ఆస్పత్రి మాకొద్దు డాక్టర్ లేని ఆస్పత్రి మాకొద్దంటూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. కొత్తగా డాక్టర్లని నియమించకపోవడంతోనే ఘటన జరిగిందన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగింద న్నారు. ఉన్నతాధికారులనుంచి హామీ వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. స్థానిక ఎస్ఐ ఆస్పత్రికి చేరుకుని బాధితులకు సర్దిచెప్పారు. -
కృష్ణాజిల్లాలో దారుణం
వీరులపాడు: కృష్ణాజిల్లాలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును విసిరికొట్టడంతో రాళ్లపై పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన వీరులపాడులో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక మగశిశువును స్థానికంగా ఉన్న ఓ ఇంటి ఆవరణలో విసిరేసి వెళ్లిపోయారు. అక్కడ ఉన్న రాళ్లు తగలడంతో శిశువు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇంటి యజమాని కుటుంబసభ్యులతో కలసి వేరేచోటికి ఉపాధి కోసం వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సూదిమందు వికటించి శిశువు మృతి
కొల్చారం మండలం కొంగోడ్‌లో విషాదం కొల్చారం: ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ (పీఎంపీ) ఇచ్చిన సూదిమందు వికటించడంతో ఏడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన కొంగోడ్‌లో శుక్రవారం వెలుగుచూసింది. కొల్చారం ఎస్ఐ విద్యాసాగర్‌రెడ్డి కథనం ప్రకారం... కొంగోడ్కు చెందిన వంజరి ఏగోండ, లింగమ్మ దంపతుల కుమారుడు తేజ (ఏడు నెలలు) నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాలుడికి వైద్యం చేయించారు. అక్కడి డాక్టర్ మూడు రోజుల క్రితం బాలుడికి సూదిమందులు రాసి ఇచ్చారు. వాటిని రోజూ బాలుడికి ఇప్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. దీంతో వారు గ్రామంలోని పీఎంపీ వద్ద మూడు రోజులుగా బాలుడికి సూదిమందు ఇప్పించారు. గురువారం రాత్రి ఎప్పటిలాగే బాలుడికి సూదిమందు ఇచ్చిన వెంటనే ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. ఫిర్యాదు మేరకు బాలుడి శవాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. -
కొండను తవ్వి ‘ఎలుక’ను పట్టి..
ఎలుకలు కొరకడంతో శిశువు మృతి చెందిన ఘటనలో పెద్దల పేర్లు మాయం చేసి, కింది స్థాయి ఉద్యోగులను బలిపశువులు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు నెలలపాటు సుదీర్ఘ విచారణ జరిపిన పోలీసులు ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ కిందిస్థాయి సిబ్బందినే బాధ్యులను చేశారనే విమర్శలు వస్తున్నాయి. * శిశువు మృతి కేసులో పెద్దల పేర్లు మాయం * చిరు ఉద్యోగులను బలిచేస్తున్నారని జీజీహెచ్ స్టాఫ్ నర్సుల ఆందోళన సాక్షి, గుంటూరు : గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లోని శిశు శస్త్రచికిత్సా విభాగంలో గత ఏడాది ఆగస్టు 26న ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఆర్ఎంఓ శ్రీనివాసులు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇద్దరు స్టాఫ్‌నర్సులను సస్పెండ్ చేసి ఆ విభాగం వైద్యులు డాక్టర్ భాస్కరరావు , సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావులను బదిలీ చేసింది. అయితే డాక్టర్ భాస్కరరావు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించారు. దీంతో ఆయన ఇక్కడే పని చేస్తున్నారు. పసికందు కేవలం ఆసుపత్రి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లి చావలి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుం టామని గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అప్పట్లో ప్రకటించారు. ఇదిలావుండగా, తాజాగా సోమవారం రాత్రి జీజీహెచ్‌కు చెందిన ఏడుగురు నిందితులు కోర్టు ముందు హాజరై బెయిల్ పొందారు. ఈ కేసులో సూపరింటెండెంట్ పేరు, శిశువు మృతిచెందిన వైద్య విభాగం వైద్యుడి పేరు ఎక్కడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలుకలు ఆసుపత్రిలోకి రావడానికి ప్రధాన కారణం పారిశుద్ధ్య కాంట్రాక్టరేనని అప్పట్లో ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి కొత్తవారిని నియమించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన ఆర్ఎంఓ , నర్సింగ్ సూపరింటెండెంట్లు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉండాల్సి ఉండగా, వీరి పేర్లను ఏ-5, ఏ-7లుగా చూపారని నర్సింగ్ సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో తమ నిర్లక్ష్యం ఏమీ లేనప్పటికీ తమపై సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా కేసులో ప్రధాన నిందితులుగా నమోదుచేయడం దారుణమని స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో పసికందు తల్లి చావలి లక్ష్మి సైతం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ బిడ్డను ఎలుకలు కరిచిన విషయాన్ని వైద్యుడికి, సూపరింటెండెంట్‌కు తెలిపామని చెప్పిన విషయం విధితమే. పోలీసులు వీరిద్దరి పేర్లను కేసులో చేర్చకపోవడంపై ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది తీవ్రంగా మండిపడుతున్నారు. -
చిన్నారి మృతి: ఆస్పత్రి వద్ద ఆందోళన
-
చిన్నారి మృతి: ఆస్పత్రి వద్ద ఆందోళన
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలోని ఓ ఆస్పత్రిలో న్యుమోనియాతో ఆరు నెలల పసికందు చనిపోయాడు. అయితే, వైద్యుని నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి మృతి చెందాడంటూ బంధువులు ఆందోళన చేశారు. బాధితుని కథనం ప్రకారం... పోరుమామిళ్ల మండలం టేకులపేటకు చెందిన ప్రసన్నకుమార్, మరియమ్మ దంపతులకు తమ ఆరునెలల కుమారుడు ఉన్నాడు. న్యుమోనియా సోకటంతో ఈ నెల 27వ తేదీన కడపలోని శివయోగి చిన్న పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ నాగేంద్రప్రసాద్ పర్యవేక్షణలో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. చిన్నారి కోలుకోకపోవటంతో బుధవారం రాత్రి డాక్టర్‌ను సంప్రదించారు. అయితే, బాబు బాగానే ఉన్నాడని, మీకేమైనా అయితే పరీక్షలు చేయించుకోండంటూ ఆయన నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చాడు. ఇంతలోనే తెల్లవారు జామున మూడు గంటలకు పరిస్థితి విషమించి చిన్నారి మృతి చెందాడు. దీనిపై తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను, అద్దాలను ధ్వంసం చేశారు. తాము ఆస్పత్రికి వచ్చిన నాటి నుంచి సిబ్బంది సరిగా స్పందించటం లేదని ఆరోపించారు. తమ చిన్నారి మృతికి వైద్యుడే కారణమని పేర్కొన్నారు. ఈ విషయమై గురువారం ఉదయం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నర్సుల కర్కశత్వం
♦ కాన్పు సమయంలో గర్భిణిని తిట్టిన వైనం ♦ వైద్యం అందక శిశువు మృతి..బంధువుల ఆందోళన మహబూబ్‌నగర్ క్రైం: ఆస్పత్రుల్లో నర్సులంటే మానవీయతకు చిహ్నం. అందుకే వారిని ఆప్యాయంగా, గౌరవంగా సిస్టర్ అని సంబోధిస్తారు. అలాంటి సిస్టర్లు తామూ మహిళలమే అన్న విషయం మరిచి పోయి మరో మహిళతో కర్కశంగా ప్రవర్తించారు. నిండుగర్భిణిని దుర్భాషలాడి, ఆమెను మానసిక వేదనకు గురిచేశారు. సకాలంలో వైద్యం అందక ఆది వారం శిశువు మృతి చెందాడు. బాధితుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ మండలం తిమ్మాసనిపల్లికి చెందిన స్వప్న శనివారం సాయంత్రం ప్రసవం కోసం జిల్లాసుపత్రికి వచ్చింది. ఆమెను ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోలేదు. స్వప్నకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో ప్రసూతి గదిలోకి వెళ్లింది. ‘నొప్పులు వస్తున్నాయి.. ప్రసవం చేయండి’ అని సిస్టర్లకు విన్నవించినా స్పందించకుండా గదిలో ఉన్న టీవీ చూస్తూ కూర్చున్నారు. నొప్పులు ఎక్కువ కావడంతో స్వప్న అక్కడే ఉన్న బెంచ్‌పై పడుకుంది. డెలివరీ అవుతున్న సమయంలో దర్భాషలాడడం మొదలుపెట్టారు. చేయి కూడా చేసుకున్నారు. వారు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో.. పుట్టిన మగ శిశువు మృతి చెందింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబసభ్యులు ప్రసూతి గది ఎదుట ఆందోళన చేశారు. సిస్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని ఆర్ఎంవో రాంబాబు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. బాధ్యులపై చర్యలు ఆస్పత్రిలో సిస్టర్ల చర్యలు బాధాకరం. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇక్కడి ఆస్పత్రిలో ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురావాలి. ఇకముందు ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదు. - రాంబాబు, ఆర్ఎంఓ, మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి -
మరో శిశువును మింగేసిన నిర్లక్ష్యం
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఊడలు దిగిన నిర్లక్ష్య వటవృక్షపు వేళ్లు మరో శిశువు మెడకు ఉరితాడయ్యాయి. ప్రక్షాళన అంటే గోడలకు సున్నాలు వేయడం, చీపుళ్లు పట్టి ఊడవడం కాదు... ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల మనసుల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని ఊడ్చిపారేయాలి... వారి మనసు తలుపులు తెరిచి సేవాదృక్పథాన్ని తట్టి లేపాలి. అప్పుడు గానీ జీజీహెచ్‌లో మృత్యుహేల అంతం కాదు... • జీజీహెచ్‌లో కొనసాగుతున్న మృత్యుహేల • బంధువుల ఆందోళన • సిబ్బంది వైఖరిలో మార్పు రావాలి • ప్రజాసంఘాల ఉద్ఘాటన గుంటూరు రూరల్: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల ఎలుకలు కొరికి చిన్నారి మృతి చెందిన సంఘటన రాష్ట్ర ప్రజలు మరువక ముందే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సోమవారం మరో ముక్కు పచ్చలారని శిశువు కన్నుమూసింది. చిలకలూరిపేట మండలం తాతపూడికి చెందిన నూతలపాటి అనూష ఏడవ నెల గర్భిణి. స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యులు బిడ్డ పరిస్థితి బాగాలేదని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌చేశారు. దీంతో ఉదయం 12 గంటలకు అనూష భర్త జాన్‌తో కలిసి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఓపీ రాసిన వైద్యులు స్కానింగ్ తీయించుకోవాలని చెప్పగా, అక్కడినుంచి స్కానింగ్‌కు వెళ్లారు. స్కానింగ్ వద్ద సిబ్బంది లేకపోవటంతో మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే వేచి ఉన్నారు. స్కానింగ్ పూర్తయిన వెంటనే వైద్యుని వద్దకు వెళ్లగా అప్పటికే క్యూలో మరో 10 మంది ఉండటంతో కాన్పుల వార్డులో వేచి ఉండాలని సిబ్బంది సూచించారు. క్యూలో నిలబడిన అనూష సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిలబడలేక కూలబడటంతో అనూష బంధువులు సిబ్బందిని నిలదీశారు. దీంతో సిబ్బంది వీల్ చైర్‌ను ఇవ్వగా, వీల్ చైర్లో కూర్చున్న అనూషకు ఉమ్మనీరు పూర్తిగా పోయింది.నొప్పులు తీవ్రమవడంతో సిబ్బంది అనూషను నడిపించుకుంటూ వార్డుకు తీసుకెళ్లారని ఈ క్రమంలో కాన్పు పూర్తవుతుండగా మంచంపై పడుకోబెట్టగానే ప్రసవించిందని బంధువులు తెలిపారు. ప్రసవం జరిగిన 10 నిమిషాలకు బిడ్డ మృతి చెందాడని వాపోయారు. సిబ్బంది సరైన సమయానికి స్పందించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆరోపించారు. జీజీహెచ్‌లో ఇలాంటివి నిత్యకృత్యమయ్యాయి... జీజీహెచ్‌లో ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయని, కేవలం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్ వద్ద బాధితులతో కలిసి వారు ఆందోళన నిర్వహించారు. రెండు నెలల క్రితం ఇదేవిధంగా స్కానింగ్ రూం వద్ద వేచిచూస్తూ ఓ గర్భిణి ప్రసవించిందని, అయితే అప్పుడు అదృష్టవశాత్తూ చిన్నారి బతికిందన్నారు. వార్డులో వైద్యుల కోసం ఎదురుచూస్తూ వరండాలో సైతం అనేక కాన్పులు జరిగిన సంఘటనలు కోకొల్లలన్నారు. సిబ్బందిలో కొరవడిన సేవాదృక్పథం ప్రక్షాళన పేరుతో జిల్లా స్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకూ వారం రోజులుగా సమావేశాలతో ఊదరగొడుతూనే ఉన్నా సిబ్బంది వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. ప్రక్షాళన అంటే గోడలకు సున్నాలు వేయటం, రోడ్లు రంగులు వేయటం కాదని ముందుగా సిబ్బంది, వైద్యులలో మార్పు వచ్చి సేవా దృక్పథంతో పనిచేసే రోజులు వచ్చేవరకూ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని ప్రజా సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. అధికారులు ఇకనైనా స్పందించి సిబ్బంది, వైద్యులలో మార్పుకోసం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
గుంటూరు జీజీహెచ్‌లో మరో శిశువు మృతి
7 నెలల గర్భంతో 2 గంటలు క్యూలో నిలబడిన గర్భిణి నడిపిస్తుండగానే ప్రసవం.. బిడ్డ మృతి గుంటూరు : గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)లో సోమవారం మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఏడు నెలల గర్భస్థ శిశువు మృతి చెందటంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. బాధిత తల్లిదండ్రులు, బంధువుల కథనం మేరకు.. చిలకలూరిపేట తాతపూడికి చెందిన నూతలపాటి అనూష ఏడో నెల గర్భిణి. ఆదివారం నొప్పులు రావడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆరోజు అక్కడే ఉండిపోయారు. సోమవారం ఉదయం మళ్లీ నొప్పులు ఎక్కువవడంతో వైద్యులు సెలవులో ఉన్నారని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో అనూష భర్త జాన్, తల్లి మేరి ఆమెను జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓపీ రాయించుకుని వైద్యుని వద్దకు వెళ్లగా స్కానింగ్ పరీక్షలు రాశారు. 3 గంటలకు రిపోర్టు తీసుకుని వైద్యుని వద్దకు వెళ్లగా.. ‘నీ కంటే ముందుగా వచ్చిన రోగులు ఉన్నారు. లైనులో నిలబడాలి’ అని సిబ్బంది ఆమెకు సూచించారు. దీంతో రెండు గంటల పాటు లైనులో నిలబడిన అనూష 5 గంటల సమయంలో అక్కడే కుప్ప కూలిపోయింది. దీంతో సిబ్బంది హటాహుటిన వార్డులోనికి నడిపించుకుంటూ వెళుతుండగా అనూషకు డెలివరీ అయి, బిడ్డ మృతి చెందింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బిడ్డ తల్లితండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బిడ్డ కేవలం 1.5 కిలోల బరువుతో జన్మించడం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. -
బొడ్డుతాడు కోయబోతే పీక తెగింది!
పసికందు ప్రాణాలు బలిగొన్న వైద్యుల నిర్లక్ష్యం కర్నూలు పెద్దాసుపత్రిలో ఘటన కర్నూలు (జిల్లా పరిషత్) : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యుల నిర్లక్ష్యం మరో పసికందు ప్రాణం బలిగొంది. బొడ్డుతాడు కోయబోయి ఏకంగా పీక కోసి పసికందు మృతికి వైద్యులు కారణమయ్యారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల పనితీరును దుయ్యబట్టారు. వెల్దుర్తికి చెందిన నబీరసూల్ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య షబానా, నలుగురు సంతానం. ఐదో కాన్పు కోసం షబానా ఈ నెల 16న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగంలో చేరింది. శనివారం ఆమె ఐదో సంతానంగా మగబిడ్డను ప్రసవించింది. అయితే ఆ బిడ్డ బొడ్డుతాడు మెడలో మూడు చుట్లు చుట్టుకుని ఉండటంతో దానిని తొలగించేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలో కత్తిగాటు కాస్తా పీకపై పడటంతో ఆ శిశువుకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే వైద్యులు చిన్నపిల్లల విభాగానికి తీసుకెళ్లి చికిత్స చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ శిశువు కన్నుమూసింది. శిశువు గొంతుపై కత్తి గాటు ఉండటం చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ కన్నుమూసిందని ఆరోపించారు. ఇదిలాఉంటే ఇలాంటి కష్టతరమైన కేసుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గరుండి పీజీలచేత చికిత్స చేయిం చాలి. కానీ పీజీ వైద్యులే స్వయంగా బొడ్డుతాడు తొలగించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. -
ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో ఎలుకలు దాడి చేయగా శిశువు మృతిచెందిన ఘటనపై విపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందించాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల నేతలు ఆస్పత్రికి చేరుకుని జరిగిన ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీశారు. శిశువు మృతిపై కలత చెందిన స్థానికులు కూడా గురువారం వేలాదిగా జీజీహెచ్‌కు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ నేతలు, కార్యకర్తలు జీజీహెచ్ మిలీనియం బ్లాక్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఆస్పత్రిని సందర్శించిన మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ, హెల్త్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, కలెక్టర్ కాంతిలాల్ దండే ఆసుపత్రి అధికారులతో గంటపాటు సమావేశమయ్యారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధ శిశువు.. తల్లిదండ్రులు చావలి లక్ష్మి, నాగలను వారి వెంట తీసుకొచ్చారు. బాధితులకు న్యాయం చేయాలంటూ మంత్రులను డిమాండ్ చేశారు. మంత్రుల ఘెరావ్.. అనంతరం జీజీహెచ్ మిలీనియం బ్లాక్ ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆసుపత్రిలో సమావేశం ముగించుకుని బయటకు వస్తున్న మంత్రులను కదలనీయకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారు. పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను బలవంతంగా పక్కకునెట్టి మంత్రుల వాహనాలను పంపివేశారు. అనంతరం మంత్రి కామినేని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రి పరిస్థితి తనకు తెలుసుననీ, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా పసికందులో మృతి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసలు దోషులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారికి అధికార టీడీపీ నేతలు అండగా ఉంటున్నారు. -
ముళ్ల పొదల్లో ఆడశిశువు మృతదేహం
ముగ్గురిపై కేసు నమోదు పరకాల : అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు ముళ్ల పొదల్లో ప్రత్యక్షమైంది. ఎస్సై దీపక్ కథనం.. మండలంలోని పెద్ద రాజిపేటకు చెందిన గువ్వ రజిత-రాజు దంపతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. మరో సంతానం కోసం ఎదిరి చూస్తున్నారు. రజిత ప్రస్తుతం 22 వారాల గర్భవతి (ఐదు నెలలు). పట్టణంలోని లలితా నర్సింగ్ హోమ్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైద్యులు గతనెల 30న వైద్యపరీక్షలు చేసి గర్భంలో శిశువు చనిపోయిందని తెలిపారు. ఆదివారం ఆపరేషన్ చేసి శిశువును తొలగించారు. తొలగించిన శిశువును గుడ్డలో ఉంచి ప్లాస్టిక్ కవర్లో పెట్టి పరకాల-హుజురాబాద్ రోడ్డులోని ఆస్పత్రి ఎదుట ముళ్లపొదల్లో పారేశారు. గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్లు ఎస్సై తెలిపారు. పసికందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. శిశువు తొలగించిన ఆస్పత్రిలో విచారణ చేపట్టి గువ్వ రజిత-రాజు, మృతదేహాన్ని పారేసిన పల్లెబోయిన నిర్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. సంఘటనపై పలు అనుమానాలు.. ఆడశిశువు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రజిత-రాజు దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు. మూడో సంతానం కూడా ఆడపిల్ల కావడంతోనే ఆబార్షన్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆబార్షన్ చేసినా.. పట్టపగలు నిత్యం ప్రజలు నడిచే దారిలోనే ఎందుకు వేశారనేది అంతుచిక్కడం లేదు. భయంతో దూరం పోలేక ఇలా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. -
పసికందు మృతి.. ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆరోపణ సిద్దిపేట జోన్: సిద్దిపేట మాతా శిశు సంక్షేమ కేంద్రంలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపించారు. మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్‌కు చెం దిన పావని బుధవారం పురిటి నొప్పులతో ఎంసీహెచ్‌లో చేరారు. పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ కోసం పర్యవేక్షణలో పెట్టారు. కాగా, గురువారం ఉదయం మరోసారి పావనికి నొప్పులు రావడం... గర్భంలో శిశువు కదలికల్లో తేడాలు గమనించిన వైద్యులు వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే గర్భంలోనే శిశువు మృతిచెంది ఉంది. విషయాన్ని సిబ్బంది బంధువులకు తెలపడంతో వారు భోరుమన్నారు. వైద్యులు సకాలంలో వైద్యం అందించకపోవడంవల్లే పసికందు ప్రాణాలు వదిలిందని బంధువులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఇంత విషమంగా ఉంటే చెప్పకపోవడంమేమిటని సిబ్బందిని నిలదీశారు. అయితే... పసికందు మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రఘురాం తెలిపారు. -
నా బిడ్డను చంపేశారు
ప్రాణముండగానే చనిపోయిందన్న వైద్యులు శ్మశాన వాటికలో నోరు తెరిసిన శిశువు తిరిగి వైద్యం అందిస్తుండగా కన్నుమూత డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ తణుకు అర్బన్ : మృతిచెందిందని వైద్యులు నిర్ధారించిన శిశువు శ్మశాన వాటికలో నోరు తెరవడంతో సంబరపడిన తండ్రి ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. బతికున్న శిశువును చనిపోయిందని చెప్పడంతో పూడ్చిపెట్టేందుకు శ్మశాన వాటికకు తీసుకువెళ్లిన తండ్రికి శిశువు బతికే ఉందని తెలుసుకుని తిరిగి ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన తణుకులో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల తెలిపిన వివరాలు ప్రకా రం.. పట్టణంలోని కొండాలమ్మ పుంతలో నివసిస్తున్న సదాశివుని రేణుక గర్భిణి అరుున తన కుమార్తె వేణు నాగలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. మంగళవారం ఉదయం 6 గంటలకు నాగలక్ష్మికి సిజేరియన్ చేసిన డాక్టర్ శ్రీలక్ష్మి ఆడ శిశువును బయటకు తీశారు. డాక్టర్ వెంటనే శిశువును పిల్లల వైద్యులకు చూపించమని చెప్పడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు శిశువు చనిపోరుుందన్నారు. దీంతో శిశువు తండ్రి వేణు నాగ జగదీష్‌కుమార్ బిడ్డను శ్మశాన వాటికకు తీసుకువెళ్లి పూడ్చేందుకు గొరుు్య తవ్వించారు. ఆ సమయంలో బిడ్డను ముద్దాడగా శిశువు పెదాలు కదలడంతో పాటు మూలుగు విని పించింది. దీంతో శిశువు బతికే ఉందని గ్రహించిన నాగ జగదీష్‌కుమార్ బిడ్డకు ఊపిరి అందిస్తూ తిరిగి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు హడావిడిగా శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచి వైద్యం అందించారు. సుమారు గంటసేపు మృత్యువుతో పోరాడిన శిశువు చివరకు ప్రాణాలు విడిచింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతిచెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఏఎంసీ చైర్మన్ బసవ రామకృష్ణ, కౌన్సిలర్లు పరిమి వెంకన్నబాబు, కలగర వెంకటకృష్ణ తదితరులు వచ్చి బాధితులను శాంతింపజేసి వైద్యులతో చర్చించారు. ఆపరేషన్ ఆలస్యంగా చేశారు వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతిచెందిందంటూ బాధితులు ఆరోపించారు. పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన రోజే సిజేరియన్ చేసి ఉంటే తమ బిడ్డ బతికే ఉండేదని కన్నీరుమున్నీరయ్యూరు. 24 గంటలపాటు గర్భిణి నొప్పులతో అల్లాడుతున్నా డాక్టర్లు పట్టించుకోలేదని ఆరోపించారు. బిడ్డకు ప్రాణం ఉందని ముందే గమనించి వైద్యం అందిస్తే బతికేదని రోదించారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు కొందరు మాత్రం శిశువు చనిపోరుుందని ప్రభుత్వాసుపత్రి డాక్టర్ శ్రీలక్ష్మి చెప్పారని అంటున్నారు. ఏరియూ ఆసుపత్రిలో చంటి పిల్లల వైద్యనిపుణులు ఉన్నా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లమని చెప్పడం కూడా వివాదానికి తావిస్తోంది. ప్రాణం ఉన్న శిశువునే ఇచ్చాం : సిజేరియన్ చేసి తీసిన శిశువు ఉమ్మనీరు తాగిందని గమనించి ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించమని సూచించినట్టు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు శ్రీలక్ష్మి వివరణ ఇచ్చారు. ఉదయం 4.30 గంటలకు గర్భిణికి ఉమ్మనీరు పోతుందని గమనించి మత్తు వైద్యుడిని పిలిపించామని, 6 గంటలకు మత్తు వైద్యుడు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశామని చెప్పారు. పురిటి కేసులన్నీ ఆపరేషన్ లు చేయవద్దనే నిబంధన కారణంగా నొప్పులు వస్తున్నాయి కదా బిడ్డ పరిస్థితి కూడా బాగానే ఉంది కదా కొంతసేపు చూద్దాం అని వేచి చూశామన్నారు. -
రాడ్లు, కర్రలతో వైద్యుడిపై దాడి
మాల్దా: అప్పుడే పుట్టిన పసికందు చనిపోయిందని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ గ్రామస్థులు వైద్యుడిని చితక్కొట్టారు. ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని మాల్దాలో చోటుచేసుకుంది. జయదీప్ మజుందార్ అనే వైద్యుడు మాల్దాలోని మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో బ్లాక్ మెడికల్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనవద్దకు ఓ మహిళ పురిటి నొప్పులతో రాగా ఆమెను మానిక్ చౌక్ అనే రూరల్ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా మజుందార్ చెప్పారు. దీంతో ఆయన సూచనమేరకు వారు మానిక్ చౌక్ ఆస్పత్రికి ఆస్పత్రిలో వెళుతుండగా మార్గం మధ్యంలో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన వెంటనే ఆ పసిపాప ప్రాణాలు విడిచింది. దీంతో తీవ్ర కోపానికి లోనైన సదరు కుటుంబీకులు కొందరు గ్రామస్తులు కలిసి రాడ్లు కర్రలతో చితక్కొట్టారు. -
సమాచారమిచ్చినా రాని 108
- కడుపులోనే శిశువు మృతి - తల్లి క్షేమం - ఆస్పత్రిలో సేవలపై ఆరోపణలు పెదబయలు: ఫోన్‌చేసి రెండు గంటలయినా 108 అంబులెన్స్ రాకపోవడంతో ఆదివాసీ మహిళ మృతశిశువుకు జన్మనిచ్చింది. పెదబయలు పీహెచ్సీ పరిధి సీకరి గ్రామానికి చెందిన సీకరి తౌడమ్మకు మంగళవారం ఉదయం నుంచి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఉదయం 8.15గంటలకు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల నుంచి అంబులెన్స్‌ను పంపుతున్నట్టు కాల్‌సెంటర్ నుంచి సమాధానమొచ్చింది. 9 గంటలకు మళ్లీ ఫోన్ చేశారు. ఎంతకి రాకపోవడంతో 10 గంటలకు ఆటోలో పెదబయలు పీహెచ్‌సీకి తౌడమ్మను తరలించారు. అప్పటికి అందుబాటులో ఉన్న ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్ పరిశీలించారు. తౌడమ్మ మృతశిశువుకు జన్మనిచ్చింది. స్టాఫ్‌నర్స్ లేదని, 108 వాహనం సకాలంలో వస్తే మెరుగైన వైద్యం అంది శిశువు బతికి ఉండేదని భర్త మత్యలింగం వాపోయారు. కాన్పు తేదీకి వారం రోజుల ముందుగానే పీహెచ్‌సీకి ఆమెను తరలించకపోవడం ఇక్కడ శోచనీయం. శిశువు కడుపులోనే చనిపోయింది: కడుపులోనే శిశువు చనిపోయిందని, ఇలా తక్కువ మందిలో మాత్రమే చనిపోయిన శిశువు ప్రసవం అవుతుందని, తల్లిని మాత్రం కాపాడగలిగామని ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్ తెలిపారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. -
మద్యం మత్తు.. ప్రాణం తీసింది
అచేతనంగా పడి ఉన్న ఈ చిన్నారి పేరు ప్రసన్న(4). అమ్మానాన్నలతో కలిసి గంగమ్మ జాత రకు వెళ్లింది. నాన్న ట్రాక్టర్ నడుపుతుంటే నాన్నా.. నీ పక్కన కూర్చుంటానంటూ వెళ్లి కూర్చుంది. ట్రాక్టర్ అటూ ఇటూ కదులుతుంటే ఉయ్యాల ఊగినట్లుందని సంబరపడింది. కానీ నాన్న మద్యం మత్తులో ఉన్నాడని.. ట్రాక్టర్ అదుపు తప్పుతోందని తెలుసుకోలేకపోయింది. క్షణాల్లో ట్రాక్టర్ పంటపొలాల్లోకి దూసుకెళ్లడంతో ఆ చిన్నారి ట్రాక్టర్ టైర్ల కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. లక్కిరెడ్డిపల్లె : లక్కిరెడ్డిపల్లె మండలంలోని బి.యర్రగుడి పంచాయతీ చెంచెర్లపల్లెకు చెందిన పూలుకుంట సుబ్బరాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం అనంతపురం గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరకు బయలుదేరాడు. అక్కడ మధ్యాహ్నం విందు భోజనం ఉండటంతో మద్యం సేవించాడు. మద్యం మత్తులోనే భార్యా, బిడ్డల్ని ట్రాక్టర్లో కూర్చోబెట్టుకున్నాడు. గద్దగుండ్లరాచపల్లె సమీపంలోని మలుపు వద్దకు చేరుకోగానే ట్రాక్టర్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. రెండవ కుమార్తె అయిన ప్రసన్న(4) ట్రాక్టర్‌పై నుంచి కిందపడటంతో టైర్లు ఎక్కాయి. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆ దారిలో వెళ్లే ప్రయాణికులు వారి బంధువులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తండ్రి సుబ్బరాయుడుకి దేహశుద్ధి చేశారు. ట్రాక్టర్లోనే ఉన్న భార్య లక్ష్మీదేవి, మొదటి కుమార్తెకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వారి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు ఎంతగా చెబుతున్నా పట్టించుకోకపోవడంతో చివరకు తండ్రి చేసిన తప్పిదానికి చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. -
వైద్యురాలి నిర్లక్ష్యంతో శిశువు మృతి
భీమవరం అర్బన్ : వైద్యురాలు నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత బంధువులు భీమవరంలో ప్రభుత్వాసుపత్రి వద్ద ఆదివారం ఆందోళనకు దిగారు. శిశువు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన డాక్టర్ పట్టించుకోకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన పాస్టర్ వానపల్లి పౌలురాజు కుమారుడు సత్యం భార్య లిఖితను రెండో కాన్పు నిమిత్తం ఈనెల 6న భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రసవంలో ఆమెకు కుమార్తె జన్మించింది. అయితే ఆరోజు ప్రసవం చేయడంలో వైద్యురాలు నవీన నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అరోజు ఉదయం 10 గంటలకు నొప్పులు వస్తే సాయంత్రం 6 గంటలకు ఆపరేషన్ చేశారని శిశువు తండ్రి సత్యం ఆరోపించాడు. అప్పటి నుంచి శిశువును ఏ డాక్టర్ వచ్చి పరీక్షించలేదని తెలిపాడు. అసలు ఆసుపత్రిలో పిల్లల వైద్యుడు ఉన్నాడనే విషయాన్ని వారు చెప్పలేదన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో శిశువు ముక్కు నుంచి రక్తం రావడంతో కంగారు పడి నర్సులకు తెలియజేయగా, వారు పరీక్షించి ఆక్సిజన్ పెట్టారన్నారు. అయితే శిశువులో ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారన్నారు. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి శిశువును తీసుకెళ్లగా, అప్పటికే శిశువు మృతి చెందిందని, నాలుగు గంటల ముందు తీసుకొచ్చి ఉంటే బతికేదని అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో ప్రభుత్వాసుపత్రికి వచ్చి డాక్టర్ నవీనను తమ శిశువు మరణించిందని, దీనికి సమాధానం చెప్పమని నిలదీశారు. అయితే దీనికి ఆమె ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ వస్తారని, ఆయన్ను అడగాలంటూ నిర్లక్ష్యంగా వెళ్లిపోయారన్నారు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమేకాక, బాధితులకు సరైన సమాధానం కూడా చెప్పని వైద్యురాలి తీరును నిరసిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యురాలు వచ్చి సమాధానం చెప్పాలని భీష్మించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం ఆస్పత్రికి చేరుకుని వైద్యురాలిని నిలదీశారు. శిశువుకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం తగదన్నారు. దీంతో వైద్యురాలు పాస్టర్ పౌల్‌రాజు, శిశువు తండ్రి సత్యానికి క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
సిద్ధిపేటలో వైద్యం వికటించి పసికందు మృతి
వైద్యుని నిర్లక్ష్యానికి ఓ పసికందు ప్రాణం కోల్పోయింది. నాలుగు నెల బాబు వైద్యం వికటించి మృతిచెందాడు. చికిత్స నిమిత్తం అమ్హత చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చేర్పించినట్టు బంధువులు తెలిపారు. వైద్యం వికటించడంతో తమ బాబు మృతిచెందినట్టు వారు ఆరోపిస్తున్నారు. బాబు మృతికి వైద్యుని నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగినట్టు సమాచారం. -
శిశువు మృతితో బంధువులు ఆందోళన
మధిర, న్యూస్‌లైన్: సరైన వైద్యం అందక శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. మధిర పట్టణంలో సోమవారం చోటు చేసుక ున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన మెరుగు సంపత్, సౌజన్యలకు మూడు నెలల శిశువు ఉన్నాడు. అతనికి అనారోగ్యంగా ఉండడంతో ఆదివారం మధిరలోని ఓ ప్రైవేట్ పిల్లల ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స చేయించిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో శిశువు శ్వాస అందకపోవడంతో రాత్రి 12 గంటల సమయంలో తిరిగి ఆస్పత్రికి తీసుకువచ్చారు. కానీ అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కాంపౌండర్లే వైద్య సేవలు అందించారు. సోమవారం ఉదయం 10.30 నిమిషాల సమయంలో డాక్టర్ వచ్చే సరికి శిశువు పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్ వైద్యం ప్రారంభించేలోగానే మృతి చెందాడు. దీంతో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వచ్చీరాని వైద్యం చేయడం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని ఆరోపించారు. ఈ విషయంపై వైద్యుడిని వివరణ కోరగా తాము సక్రమంగానే వైద్యం అందించామని, వైద్యం చేస్తున్న సమయంలో శిశువుకు తల్లి పాలు ఇచ్చిందని, దీంతో అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస అందక మృతి చెందాడని పేర్కొన్నారు. -
బైక్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి
తుమ్మపూడి(దుగ్గిరాల),న్యూస్‌లైన్: ఇంటి ముందు రోడ్డుపై నిలబడిన మూడేళ్ల చిన్నారి బైక్ ఢీకొట్టడంతో మృతిచెందింది. ఈ ఘటన శుక్రవారం మండలంలోని తుమ్మపూడి గ్రామంలో విషాదం నింపింది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరంకి శివరామకృష్ణ ఆటో నడుపుకుంటూ జీవిస్తాడు. అతనికి భార్య తిరుపతమ్మ, కుమార్తె జ్యోతీమహాలక్ష్మి(3), మరో బాబు ఉన్నారు. శుక్రవారం ఇంటి ముందు రోడ్డుపై నిలిపిన ఆటోను శుభ్రం చేస్తున్న తండ్రి పక్కన మహాలక్ష్మీ నిలబడి ఉంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు షేక్ బర్కత్ బైక్‌పై వేగంగా వెళ్తూ చిన్నారిని ఢీకొట్టాడు. 30 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లగా చిన్నారి మట్టిగుట్టపై పడింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆటోలో తెనాలి ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. ఎస్ఐ చరణ్ వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం కుటుంభ సభ్యులకు అందజేశారు. చిన్నారి మృతితో శివరామకృష్ణ కుటుంబం సోకసంద్రంలో మునిగిపోయింది. సర్పంచ్ రాయపూడి ప్రభావతి, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.