చావుబతుకుల మధ్య ఉన్న తమ కూతురుని దుప్పట్లో చుట్టుకొని బైక్‌పై ఆస్పత్రికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు
సాక్షి, రత్లామ్ (మధ్యప్రదేశ్) : నిమిషం ముందు తీసుకొచ్చినా ప్రాణాలు పోకుండా కాపాడగలిగేవాళ్లం అని వైద్యులు సాధారణంగా చెబుతుంటారు. వాస్తవానికి ఆమాటలు నూటికి నూరుపాళ్లు నిజమే. ప్రమాదకరపరిస్థితుల్లో వైద్యం అందకుంటే ప్రాణాలుపోవడం ఖాయం. ఓ నాలుగేళ్ల బాలిక విషయంలో ఇదే రుజువైంది. తీవ్ర అనారోగ్యానికి గురైన జీజా అనే మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌కు చెందిన బాలికను ఆస్పత్రిని తరలించేందుకు ఆలస్యం కావడంతో ప్రాణంపోయింది. సమయానికి అంబులెన్స్ రాకపోవడం, తల్లిదండ్రులే శ్రమకూర్చి బైక్‌పై తీసుకెళ్లడం, అప్పటికే ఆలస్యం కావడంతో పాప చనిపోయింది.
తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తమ కూతురుని తొలుత నర్సింగ్ హోమ్ తీసుకెళ్లగా అక్కడ వైద్యం చేసి రత్లామ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అయితే, వారు అంబులెన్స్ కోరగా ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో వేరే దారి లేక పాపను స్నేహితుడి బైక్‌పై ఓ దుప్పటిలో పెట్టి ఉంచారు. వెనుక కూర్చున్న అతడి భార్య చేతిలో ఫ్లూయిడ్ సెలైన్ పట్టుకుంది. కనీసం 30 కిలో మీటర్లు వారు ప్రయాణించగా అప్పటికే ఆలస్యం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన 15 నిమిషాల్లోనే పాప చనిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment