ratlam
-
వీళ్లా డాక్టర్లయ్యేది? ర్యాగింగ్ చేసినందుకు కెరీర్ నాశనం
భోపాల్: ర్యాగింగ్ నెపంతో జూనియర్లను లైన్లో నిల్చోబెట్టి చెంపదెబ్బలు కొట్టిన సీనియర్ వైద్య విద్యార్థులపై కేసు నమోదైంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది కాలేజీ యాజమాన్యం. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జులై 28న మధ్యప్రదేశ్ రత్లాంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన జరిగింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను వరుసగా నిల్చోబెట్టి చెంపదెబ్బలు కొట్టారు. వారితో దారుణంగా ప్రవర్తించారు. వద్దని చెప్పేందుకు వెళ్లిన హాస్టల్ వార్డెన్‌పైకి వాటర్ బాటిల్స్ విసిసారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇలాంటి విద్యార్థులా డాక్టర్లయ్యేది అని విమర్శలు వెల్లువెత్తాయి. How these idiots are going to become doctors? Who gave rights to these seniors to slap their Junior's ? & we are saying #ragging in banned? These so called seniors immediately needs to be put behind the bars😡 Video: #Ratlam #Medical #Collage of #MP#MBBS #MedTwitter #NEETUG2022 pic.twitter.com/Z3KNRxmn0u — Vivek pandey (@Vivekpandey21) July 30, 2022 ర్యాగింగ్ ఘటనపై హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు ఏడుగురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం వీరందరినీ ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కాలేజ్ డీన్ ప్రకటించారు. అంతకుముందు ఇండోర్‌లోని మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీలో దారుణమైన ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది. సీనియర్ విద్యార్థులు తమపై వికృత చర్యలకు పాల్పడ్డారని జూనియర్ విద్యార్థులు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఘటనపై సీరియస్ అయిన యూజీసీ.. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చదవండి: ‘హ్యాపీడేస్’ మూవీని మించిన ర్యాగింగ్.. జూనియర్ అమ్మాయిలతో ఇంత దారుణమా.. -
పెళ్లి కావడం లేదని మహిళా ఎస్సై ఆత్మహత్య
అమ్మాయికి 20 ఏళ్లు వచ్చాయంటే చాలు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనే చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బునంతా కూతురు చదువుకు పెట్టి అప్పటి వరకు ఏ లోటు లేకుండా చూసుకున్న పేరేంట్స్ ఆమె మంచి స్థాయిలో స్థిరపడ్డాక పెళ్లి పేరుతో తన జీవితానికి సంకేళ్లు వేస్తుంటారు. దీనికి తోడు మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదా అంటూ చుట్టుపక్కల వాళ్లు, బంధువుల సూటిపోటి మాటలు ఒకటి. దీంతో తన ఆశలను అటు తల్లిదండ్రులకు చెప్పలేక, ఇటు తనలో తాను కుమిలిపోయి చివరికి ఆత్మహత్య శరణమనుకునే యువతులు కోకొల్లలు. ఈ కోవలోకి అందరూ రాకపోయినా ఎక్కడో ఒక్కచోట నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. చూస్తూనే ఉన్నాం. తాజాగా పెళ్లి కావడం లేదన్న బాధను తట్టుకోలేక ఎస్సైగా పని చేసే యువతి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్లో కవితా సోలంకి అనే మహిళ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ఒక బాధ్యతాయుతమైన పోలీసు ఆఫీసర్. ఎంతో కష్టపడితే గానీ ఆ కొలువును సాధించలేము. ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఆమెకు 35 సంవత్సరాలు. సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఆమెకు ఓ ఘటన ఎదురైంది. పెళ్లి ఎప్పుడంటూ ఇంటి దగ్గర ఉన వాళ్లంతా ప్రశ్నించడం మెదలు పెట్టారు..ఇప్పుడే కాదు ఇంటికి వెళ్లిన ప్రతీ సారి ఇదే అడగుతుండటంతో ఆవేదన చెందింది. దీంతో ఇంటి నుంచి బయలుదేరి తిరిగి డ్యూటీలో జాయిన్ అయింది. బుధవారం రాత్రి అధికార నివాసంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత తన స్నేహితురాలికి ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పడంతో ఆమె హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు గురువారం ఆమె మరణించింది. మృతురాలి ఇంట వద్ద నుంచి సుసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో.. తనకు పెళ్లి కావడం లేదని ఆందోళన చెందుతున్నట్లు, వివాహంపై ఇరుగుపొరుగు వారి మాటలకు సమాధాన చెప్పలేక అలసి పోయానని రాసుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
దుప్పట్లో చుట్టి 30 కి.మీ పరుగు.. ఆశ ఓడింది
సాక్షి, రత్లామ్ (మధ్యప్రదేశ్) : నిమిషం ముందు తీసుకొచ్చినా ప్రాణాలు పోకుండా కాపాడగలిగేవాళ్లం అని వైద్యులు సాధారణంగా చెబుతుంటారు. వాస్తవానికి ఆమాటలు నూటికి నూరుపాళ్లు నిజమే. ప్రమాదకరపరిస్థితుల్లో వైద్యం అందకుంటే ప్రాణాలుపోవడం ఖాయం. ఓ నాలుగేళ్ల బాలిక విషయంలో ఇదే రుజువైంది. తీవ్ర అనారోగ్యానికి గురైన జీజా అనే మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌కు చెందిన బాలికను ఆస్పత్రిని తరలించేందుకు ఆలస్యం కావడంతో ప్రాణంపోయింది. సమయానికి అంబులెన్స్ రాకపోవడం, తల్లిదండ్రులే శ్రమకూర్చి బైక్‌పై తీసుకెళ్లడం, అప్పటికే ఆలస్యం కావడంతో పాప చనిపోయింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తమ కూతురుని తొలుత నర్సింగ్ హోమ్ తీసుకెళ్లగా అక్కడ వైద్యం చేసి రత్లామ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అయితే, వారు అంబులెన్స్ కోరగా ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో వేరే దారి లేక పాపను స్నేహితుడి బైక్‌పై ఓ దుప్పటిలో పెట్టి ఉంచారు. వెనుక కూర్చున్న అతడి భార్య చేతిలో ఫ్లూయిడ్ సెలైన్ పట్టుకుంది. కనీసం 30 కిలో మీటర్లు వారు ప్రయాణించగా అప్పటికే ఆలస్యం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన 15 నిమిషాల్లోనే పాప చనిపోయింది. -
రూ.100 కోట్లు అలంకరణ.. కోరిన కోర్కెలు తీరునట
సాక్షి, రత్లామ్ : మానవసేవే మాధవ సేవ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పడం, ఆ మాటలనే ప్రతి చోటా మనం వింటుండటం జరుగుతోంది. ఈ రోజుల్లో సేవ చేయాలంటే డబ్బుతో ముడిపడి ఉన్న అంశం. అయితే, ఆ డబ్బు ఉపయోగించి మనుషులకు సేవలు చేయడాన్ని పక్కకుపెట్టి మన దేశంలోదేవుళ్ల సేవలకు మాత్రం భారీ క్యూలు కడతారని మరోసారి నిరూపితమైంది. మధ్యప్రదేశ్‌లో ఓ మహాలక్ష్మీ ఆలయాన్ని డబ్బులతో నింపేశారు. దీపావళి సందర్భంగా ఆలయంలోని గర్భగుడిలో అడుగుడగున డబ్బు, ఆభరణాలు ఇతర విలువైన వస్తువులతో అలంకరించారు. వీటి విలువ అక్షరాల రూ.100కోట్లు ఉంటుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఒక రూపాయి నుంచి మొదలుకొని రూ.2000 నోట్ల వరకు ప్రతీది ఉపయోగించి ఆలయాన్ని అలంకరించారు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులు దేవీని చూసే ఆసక్తికంటే ఆలయంలో అన్ని చోట్ల అలంకరించిన డబ్బును చూసేందుకు కుప్పలుగా తరలి వస్తారట. అంతేకాదు, కోరిన వారి కోరికలు తీర్చే కొంగుబంగారం ఆ మహాలక్ష్మీదేవీ అని అక్కడి భక్తులు చెబుతున్నారు. అయితే, ఇదేదో ఈఏడాది జరిగిన విషయం కాదు.. ప్రతిసంవత్సరం ఇలాగే చేస్తుంటారట. భక్తులే కానుకల రూపంలో తీసుకొచ్చిన ఈ మొత్తం సొమ్మును ఇలా అలంకరించడం పరిపాటి అని చెబుతున్నారు. 'మహాలక్ష్మీ ఆలయాన్ని నేను ఆరేళ్లుగా సందర్శిస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆలయానికి వచ్చి నేను ఏం కోరుకున్నా జరిగి తీరుతుంది' అని మమతా పోర్వాల్ అనే భక్తురాలు తెలిపారు. 'కానుకల రూపంలో ఈ ఏడాది వచ్చినవి డబ్బు, ఆభరణాలు ఇతర వస్తువులు కలిపి మొత్తం రూ.100కోట్ల వరకు ఉంటుంది. చాలా దూరం నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి దీపావళికి ఇలాగే ఉంటుంది. గర్భగుడిలో ఎప్పుడూ పోలీసులను తిప్పుతుంటాం' అని ఆలయ ప్రధాన అర్చకుండా సంజయ్ తెలిపారు. -
లోయలోకి దూసుకెళ్లిన బస్సు: 17 మంది మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. రత్లం నుంచి మాంద్సౌర్ వెళ్తున్న ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా... 10 మందికి గాయాలయ్యాయి. గాయాలు పాలైన వారిని, రత్లంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మొత్తం 40మందితో ప్రయాణిస్తున్న ఈ బస్సు శుక్రవారం ఉదయం 10.30 నిమిషాలకు రత్లం జిల్లా నామ్లి పట్టణంలోని బారా పత్తర్ ప్రాంతాల్లోకి రాగానే లోయలోకి పడిపోయింది. లోయలో నీరు ఉండటంతో బస్సు పూర్తిగా మునిగిపోయింది. ప్రమాదాన్ని గమనించిన అక్కడి స్థానికులు వెంటనే సహాయక చర్యలు అందించారు. సంఘటనా స్థలంలో ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ మితిమీరిన వేగమేనని గాయాలు పాలైన వారు పేర్కొంటున్నారు. దీంతో బస్సు లోయలోకి దూసుకెళ్లినట్టు వారు చెబుతున్నారు. డ్రైవర్ మితిమీరిన వేగంతో టైర్లు కూడా పేలిపోయినట్టు తెలిపారు. వేగంగా నడుపవద్దని అప్పటికే పలుమార్లు తాము హెచ్చరించామని, అయినా డ్రైవర్ వినలేదని చెప్పారు. ఈ బస్సు మమతా బస్సు సర్వీసుకు చెందిందని అధికారులు పేర్కొన్నారు. -
లోయలోకి దూసుకెళ్లిన బస్సు: 17 మంది మృతి
-
బంగారు కొండతో స్పెషల్ చిట్ చాట్
-
ఏకంగా 52 బంగారు ఉంగరాలు తొడిగారు
బంగారు ఆభరణాలపై అతివలకే కాదు...పురుషులకూ మోజు పెరుగుతోంది. నగలు ధరించి ధగధగలాడి పోవాలనుకుంటున్న పురుష పుంగవులు పెరుగుతున్నారు. మన సాంప్రదాయాన్ని తీసుకుంటే వేద,ఇతిహాన కాలాల్లో కూడా స్త్రీ, పురుషులు వారి వారి హోదాను, అభిరుచిని బట్టి ఆభరణాలు ధరించేవారు. కాలక్రమేణా పురుషులు ఆభరణాలు ధరించటం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఆ టేస్టు మారుతోంది. మెడలో సింపుల్‌గా చైన్‌తో కాకుండా... ఒంటి నిండా బంగారం దిగేసుకుని మరీ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన పంకజ్ పరాఖ్ అనే వ్యాపారి అలా ఇలా కాదు...ఏకంగా బంగారం పూతతో ఉన్న చొక్కాను ధరించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఆ బంగారు చొక్కా బరువు నాలుగు కిలోలు. ముంబై సమీపంలోని యోలా వీధిలో ఇతగాడు పసిడి చొక్కాతో పాటు ఒంటిపై మూడు కిలోల నగలు ధరించి మహిళలకు పోటీ ఇవ్వటం విశేషం. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రత్లా పట్టణానికి చెందిన మహేశ్ సోనీ చేతినిండా ఉంగరాలు.. ధగధగ మెరిసే బంగారు బ్రెస్లెట్తో ఉంగరాల బంగార్రాజుగా గుర్తింపు పొందారు. బంగారం వ్యాపారం చేసే మహేశ్ తన చేతివేళ్లు అన్నింటికీ కలిపి ఏకంగా 52 బంగారు ఉంగరాలు తొడిగారు. నవరత్నాలు, వజ్రాలు పొదిగిన ఈ ఉంగరాలతో పాటు ఒక పెద్ద బ్రేస్లెట్, బంగారు గొలుసును ఆయన గత పుష్కరకాలంగా ధరిస్తూ వస్తున్నారు. వాటి ఖరీదు అక్షరాల కోటి రూపాయలు. -
దొంగలను పట్టించి.. గుంజిళ్లు తీయించిన బామ్మ
ఆమె వయసు 85 ఏళ్లు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేసి రిటైరయ్యారు. ఆ వయసులో మామూలుగా ఎవరైనా అయితే కృష్ణా రామా అనుకుంటూ కూర్చుంటారు. కానీ ఆమె అలా ఊరుకోలేదు. తన ఇంట్లో చొరబడేందుకు వచ్చిన ఇద్దరు దొంగలను చితకబాడి, పట్టించడమే కాదు.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి, వాళ్లతోటి గుంజిళ్లు తీయించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగింది. ప్రేమలత (85)కు నలుగురు కొడుకులు. వాళ్లంతా ముంబైలో ఉద్యోగాలు చేసుకుంటారు. ఆమె మాత్రం మధ్యప్రదేశ్‌లోని రత్లాం బ్యాంకు కాలనీలో ఒక్కరే ఉంటారు. మొన్న ఒక రోజు రాత్రి ఆమె ఇంట్లో పడుకుని ఉండగా ఇద్దరు దొంగలు ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఇంటి ముందున్న గ్రిల్‌ను కోస్తుండగా ఆ శబ్దానికి ఆమెకు మెలకువ వచ్చింది. వెంటనే లేచి ఆమె వాళ్ల మీద ఓ బక్కెట్టుడు నీళ్లు పోశారు. దొంగల్లో ఒకరు ప్రేమలత చెయ్యి పట్టుకోగా, ఆమె పక్కనే ఉన్న కర్ర తీసుకుని వాళ్లిద్దరినీ చితకబాదేస్తూ, చుట్టుపక్కల వాళ్లను తన అరుపులతో లేపారు. దాంతో ఇరుగుపొరుగులు నిద్రలేని, వెంటనే పోలీసులకు తెలిపారు. పది నిమిషాల్లో వాళ్లు వచ్చి దొంగలను పట్టుకున్నారు. దొంగలను గుర్తించడానికి ప్రేమలతను పోలీసు స్టేషన్‌కు పిలిచినప్పుడు ఆమె వాళ్లను గుర్తించడమే కాదు.. వాళ్లతో గుంజిళ్లు కూడా తీయించారు. ఆమె ధైర్యానికి మెచ్చుకున్న పోలీసులు బామ్మగారికి 5వేల రూపాయల రివార్డు, ఒక మొబైల్ ఫోన్ బహుమతిగా ఇచ్చారు.