వైద్యం అందక చిన్నారి మృతి | Doctor Negligence Baby Died In Mancherial | Sakshi
Sakshi News home page

వైద్యం అందక చిన్నారి మృతి

Sep 4 2018 7:05 AM | Updated on Sep 4 2018 7:05 AM

Doctor Negligence Baby Died In Mancherial - Sakshi

తనుశ్రీ మృత దేహం మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడుతున్న ఎస్సై వెంకటేశ్వర్లు, తనుశ్రీ మృత దేహం

మంచిర్యాలక్రైం: ప్రైవేట్‌ పిల్లల ఆసుపత్రిలో ఓ చిన్నారికి సకాలంలో వైద్యం అందక మృతిచెందిన సంఘటన మంచిర్యాల పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కాసిపేట మండల కేంద్రానికి చెందిన వైద్యం అందకపోవడంతోదంపతుల కూతురు తనుశ్రీ (2)కి మూడు రోజులుగా జ్వరం వస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకు మంచిర్యాలలోని స్థానిక ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన గంటలోపే చిన్నారి మృతి చెందింది. సకాలంలో వైద్యం అందకపోవడంతోనే చిన్నారి మృతిచెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబసభ్యులతో మాటాడి ఆందోళన విరమింపజేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు. తనుశ్రీ చనిపోయే గంట ముందే ఆస్పతికి తీసుకువచ్చారని, అప్పటికే చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు తెలిపాడు. వైద్యం అందించలోపే మృతిచెందిందన్నారు. ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదన్నారు. కాగా, చిన్నారి మృతితో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement