ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మి, మనోజ్‌కుమార్
కొండాపూర్(సంగారెడ్డి) : తాను లేని చోట తన పిల్లలకు దిక్కెవరూ అనుకుందో ఏమో గానీ తా నూ విషపు గుళికలు తీసుకొని చిన్నారులకు సైతం ఇచ్చింది. ఈ ఘటనలో 17 నెలల వయసు గల చిన్నారి మృతిచెందగా, మూడు సంవత్సరాలు బాబు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. సమయానికి ఆస్పత్రికి చేరుకోవడంతో తల్లి మాత్రం సురక్షితంగా ఉంది. వివరాల్లోకి వెళితే స్థానిక సీఐ రవి కథనం ప్రకారం.. మండల పరిధిలోని తొగర్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు ఐదు సంవత్సరాల క్రితం హత్నూర మండలం బడంపేట గ్రామానికి చెందిన లక్ష్మితో వివా హమయింది.
శ్రీనివాస్, లక్ష్మి దంపతులకు ప్రణ తి (14 నెలలు), మనోజ్‌కుమార్(4) సంతానం. శ్రీనివా స్ భార్య లక్ష్మి తరచూ అనారోగ్యానికి గురయ్యేది. ఒక్కోసారి వారం రోజులు మంచంపైనే ఉన్నా ఇంట్లో ఎవరూ పలకరించేవారు కారనీ, కనీసం భర్త కూడా పలుకరించేవాడు కాదనీ ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన లక్ష్మి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనీ నిర్ణయించుకొంది.
తన మరణానంతరం తన పిల్లల భవిష్యత్ ఆలోచించి, పిల్లలు అనాథలు అవుతారనుకొని ఇంట్లోని యూరియా గుళికలను తీసి వాళ్లకు ఇచ్చి తాను మింగింది. పొలానికి వెళ్లిన భర్త తిరిగొచ్చి ప్రణతిని ఎత్తుకోవడానికి చేతిలోకి తీసుకోగా డీలా పడిపోతుంది. అనుమానం వచ్చిన శ్రీనివాస్ తన భార్యను అడగ్గా విషయం చెప్పినట్లు సీఐ తెలిపారు. వెంటనే చికిత్సకోసం మొదటగా సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రణతి (14 నెలలు) మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
లక్ష్మి, మనోజ్‌కుమార్‌లకు ప్రథమ చికిత్స చేసి న అనంతరం మెరుగైన వైద్యంకోసం హైదరాబా ద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సీఐ వివరించారు. ప్రస్తుతం తల్లి లక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉండగా కుమారుడు మనోజ్‌కుమార్ పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉందనీ, 3రోజుల వరకు ఏ విషయం చెప్పలేమనీ వైద్యులు తెలిపారనీ సీఐ వివరించారు.
గ్రామంలో విషాదఛాయలు..
తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు ఆత్మహత్యాయత్నం వార్త దావనంలా వ్యాపించడంతో తొగర్‌పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 14 నెలల చిన్నారి ప్రణతి మృతి చెందడంతో బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. చిన్నారి ప్రణతి అంత్యక్రియలను సోమవారం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment