వీరులపాడు: కృష్ణాజిల్లాలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును విసిరికొట్టడంతో రాళ్లపై పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన వీరులపాడులో చోటుచేసుకుంది.
మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక మగశిశువును స్థానికంగా ఉన్న ఓ ఇంటి ఆవరణలో విసిరేసి వెళ్లిపోయారు. అక్కడ ఉన్న రాళ్లు తగలడంతో శిశువు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇంటి యజమాని కుటుంబసభ్యులతో కలసి వేరేచోటికి ఉపాధి కోసం వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణాజిల్లాలో దారుణం
Published Wed, Jun 22 2016 11:57 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM
Advertisement
Advertisement