పసికందు మృతి.. ఆందోళన | Child died | Sakshi
Sakshi News home page

పసికందు మృతి.. ఆందోళన

Published Thu, Jul 30 2015 11:27 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

Child died

 వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆరోపణ
 
 సిద్దిపేట జోన్: సిద్దిపేట మాతా శిశు సంక్షేమ కేంద్రంలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపించారు.

 మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్‌కు చెం దిన పావని బుధవారం పురిటి నొప్పులతో ఎంసీహెచ్‌లో చేరారు. పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ కోసం పర్యవేక్షణలో పెట్టారు. కాగా, గురువారం ఉదయం మరోసారి పావనికి నొప్పులు రావడం... గర్భంలో శిశువు కదలికల్లో తేడాలు గమనించిన వైద్యులు వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే గర్భంలోనే శిశువు మృతిచెంది ఉంది. విషయాన్ని సిబ్బంది బంధువులకు తెలపడంతో వారు భోరుమన్నారు. వైద్యులు సకాలంలో వైద్యం అందించకపోవడంవల్లే పసికందు ప్రాణాలు వదిలిందని బంధువులు ఆందోళనకు దిగారు.

 పరిస్థితి ఇంత విషమంగా ఉంటే చెప్పకపోవడంమేమిటని సిబ్బందిని నిలదీశారు. అయితే... పసికందు మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రఘురాం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement