ప్రాణముండగానే
చనిపోయిందన్న వైద్యులు
శ్మశాన వాటికలో
నోరు తెరిసిన శిశువు
తిరిగి వైద్యం అందిస్తుండగా
కన్నుమూత
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ
తణుకు అర్బన్ : మృతిచెందిందని వైద్యులు నిర్ధారించిన శిశువు శ్మశాన వాటికలో నోరు తెరవడంతో సంబరపడిన తండ్రి ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. బతికున్న శిశువును చనిపోయిందని చెప్పడంతో పూడ్చిపెట్టేందుకు శ్మశాన వాటికకు తీసుకువెళ్లిన తండ్రికి శిశువు బతికే ఉందని తెలుసుకుని తిరిగి ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన తణుకులో మంగళవారం చోటుచేసుకుంది.
బాధితుల తెలిపిన వివరాలు ప్రకా రం.. పట్టణంలోని కొండాలమ్మ పుంతలో నివసిస్తున్న సదాశివుని రేణుక గర్భిణి అరుున తన కుమార్తె వేణు నాగలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. మంగళవారం ఉదయం 6 గంటలకు నాగలక్ష్మికి సిజేరియన్ చేసిన డాక్టర్ శ్రీలక్ష్మి ఆడ శిశువును బయటకు తీశారు. డాక్టర్ వెంటనే శిశువును పిల్లల వైద్యులకు చూపించమని చెప్పడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు శిశువు చనిపోరుుందన్నారు. దీంతో శిశువు తండ్రి వేణు నాగ జగదీష్‌కుమార్ బిడ్డను శ్మశాన వాటికకు తీసుకువెళ్లి పూడ్చేందుకు గొరుు్య తవ్వించారు.
ఆ సమయంలో బిడ్డను ముద్దాడగా శిశువు పెదాలు కదలడంతో పాటు మూలుగు విని పించింది. దీంతో శిశువు బతికే ఉందని గ్రహించిన నాగ జగదీష్‌కుమార్ బిడ్డకు ఊపిరి అందిస్తూ తిరిగి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు హడావిడిగా శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచి వైద్యం అందించారు. సుమారు గంటసేపు మృత్యువుతో పోరాడిన శిశువు చివరకు ప్రాణాలు విడిచింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతిచెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఏఎంసీ చైర్మన్ బసవ రామకృష్ణ, కౌన్సిలర్లు పరిమి వెంకన్నబాబు, కలగర వెంకటకృష్ణ తదితరులు వచ్చి బాధితులను శాంతింపజేసి వైద్యులతో చర్చించారు.
ఆపరేషన్ ఆలస్యంగా చేశారు
వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతిచెందిందంటూ బాధితులు ఆరోపించారు. పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన రోజే సిజేరియన్ చేసి ఉంటే తమ బిడ్డ బతికే ఉండేదని కన్నీరుమున్నీరయ్యూరు. 24 గంటలపాటు గర్భిణి నొప్పులతో అల్లాడుతున్నా డాక్టర్లు పట్టించుకోలేదని ఆరోపించారు. బిడ్డకు ప్రాణం ఉందని ముందే గమనించి వైద్యం అందిస్తే బతికేదని రోదించారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు కొందరు మాత్రం శిశువు చనిపోరుుందని ప్రభుత్వాసుపత్రి డాక్టర్ శ్రీలక్ష్మి చెప్పారని అంటున్నారు. ఏరియూ ఆసుపత్రిలో చంటి పిల్లల వైద్యనిపుణులు ఉన్నా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లమని చెప్పడం కూడా వివాదానికి తావిస్తోంది.
ప్రాణం ఉన్న శిశువునే ఇచ్చాం : సిజేరియన్ చేసి తీసిన శిశువు ఉమ్మనీరు తాగిందని గమనించి ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించమని సూచించినట్టు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు శ్రీలక్ష్మి వివరణ ఇచ్చారు. ఉదయం 4.30 గంటలకు గర్భిణికి ఉమ్మనీరు పోతుందని గమనించి మత్తు వైద్యుడిని పిలిపించామని, 6 గంటలకు మత్తు వైద్యుడు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశామని చెప్పారు. పురిటి కేసులన్నీ ఆపరేషన్ లు చేయవద్దనే నిబంధన కారణంగా నొప్పులు వస్తున్నాయి కదా బిడ్డ పరిస్థితి కూడా బాగానే ఉంది కదా కొంతసేపు చూద్దాం అని వేచి చూశామన్నారు.
నా బిడ్డను చంపేశారు
Published Wed, Jul 22 2015 2:01 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement
Advertisement