
బాగేపల్లి : మైనర్ బాలికను వివాహం చేసుకున్న యువకుడిని సోమవారం బాగేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బాగేపల్లి పట్టణంలోని ఐదవ వార్డుకు చెందిన యువకుడు యాదగిరి (23)కి అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (14)తో ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో కొద్ది బాలిక గర్భం దాల్చడంతో సోమవారం వైద్యపరీక్షల కోసం బాలిక భర్త, కుటుంబ సభ్యులు చిక్కబళ్లాపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే బాలిక వయసుపై అనుమానం కలిగిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న బాగేపల్లి పట్టణ పోలీసులు యాదగిరిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో యువకుడు యాదగిరితో పాటు బాల్య వివాహానికి సహకరించిన యువకుడి చిన్నాన్న, పిన్నిలైన వెంకటేశ్, మునియమ్మ, కుమారుడు మణితో పాటు మైనర్ బాలిక తల్లితండ్రులు ప్రసాద్, మంజులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment