రూ.3 అడిగినందుకు ప్రయాణికుడిపై కండక్టర్‌ దౌర్జన్యం | The conductor attacked the passenger | Sakshi
Sakshi News home page

వనపర్తి బస్టాండ్‌లో ‘చిల్లర పంచాయితీ’

Published Fri, Jun 15 2018 1:25 PM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM

The conductor attacked the passenger - Sakshi

ప్రయాణికుడిపై నెట్టివేస్తున్న కండక్టర్‌   

వనపర్తి టౌన్‌: బస్సు దిగాక తనకు ఇవ్వాల్సిన రూ.3 అడిగిన ప్రయాణికుడిపై.. అసభ్యంగా మాట్లాడడంతో పాటు కండక్టర్‌ దాడి చేసిన ఘటన ఇది. ఈ ఘటనకు సంబంధించి కొందరు ప్రయాణికులు తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వనపర్తి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో వనపర్తికి వచ్చేందుకు గురువారం ఓ యువకుడు పెబ్బేర్‌లో ఎక్కాడు. వనపర్తిలో బస్‌ దిగిన తర్వాత తనకు రూ.3 చిల్లర ఇవ్వాల్సి ఉందని కండక్టర్‌ ముజీబ్‌ను అడిగాడు. అయితే, దీనిని పట్టించుకోకుండగా కండక్టర్‌ టికెట్‌ చింపివేయగా మాటామాట పెరిగింది.

ఆ తర్వాత కండక్టర్‌ సదరు యువకుడి చొక్కా పట్టుకుని అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. అలాగే, కంట్రోలర్‌ గది వద్దకు తీసుకువెళ్లి గొంతు పట్టుకుని దాడికి యత్నించాడు. అక్కడ ఆర్టీసీ సిబ్బంది అధికంగా ఉండటం, పక్కన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా ప్రయాణికుడి గోడు ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత యువకుడితో పాటు కండక్టర్‌ పరస్పరం వనపర్తి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆర్టీసీకి నష్టాలు వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులను గౌరవించి వారు బస్సులు ఎక్కేలా చూడాలని అధికారులు, ప్రభుత్వం ఆదేశిస్తున్నా కొందరు సిబ్బంది తీరు, ఇలాంటి ఘటనలతో ప్రయాణికులు సంస్థకు దూరమయ్యే ప్రమాదముందని పలువురు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటన మొత్తాన్ని కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు పలువురు కండక్టర్‌ తీరును తప్పుపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement