
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ
పెద్దదోర్నాల: విధుల నుంచి తప్పించడంతో పాటు కొత్త వారిని విధుల్లోకి తీసుకోవడంతో తీవ్రం మనస్తాపం చెందిన కాంట్రాక్ట్ కుకింగ్ సిబ్బంది ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన వై.చెర్లోపల్లి మోడల్ పాఠశాలలో సోమవారం జరిగింది. ఈ సంఘటనతో మండల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫినాయిల్ తాగినట్లుగా అనుమానిస్తున్న కుకింగ్ సిబ్బందిని మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ హనుమంతురావు, ఎస్‌ఐ అబ్దుల్ రహిమాన్ వైధ్యశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో ఫినాయిల్ తాగినట్లుగా భావిస్తున్న రాజేశ్వరి, విశ్రాంతమ్మ, మల్లేశ్వరి, శ్రీలక్ష్మిలకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి చికిత్స చేశారు. ప్రిన్సిపాల్ నయోమి ఫి«ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అబ్దుల్ రహిమాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment