రోడ్డుపై కట్టల కట్టల డబ్బు! | Currency Bundles Found On Road In Kotturpuram | Sakshi
Sakshi News home page

రోడ్డుపై కట్టల కట్టల డబ్బు!

Published Mon, May 27 2019 10:00 AM | Last Updated on Mon, May 27 2019 3:57 PM

Currency Bundles Found On Road In Kotturpuram - Sakshi

సాక్షి, చెన్నై: పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు దుండగులు నోట్ల కట్టలను రోడ్డుపై విసిరేసిన అనూహ్య ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నై మహానగరానికి పొరుగున ఉన్న కోట్టూరుపురంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వాహన సోదాలు చేస్తుండగా భయంతో డబ్బు కట్టలను రోడ్డుపై విసిరి దుండగులు పరిపోయారు.

ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1.56 కోట్ల రూపాయల నగదు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో ఎక్కువగా కొత్త 500 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డబ్బు ఎవరిది, ఎందుకోసం తీసుకెళుతున్నారనే దానిపై విచారణ చేపట్టారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
నోట్ల కట్టలను రోడ్డుపై విసిరేసిన దుండగులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement