
బోయినపల్లి(చొప్పదండి): ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబంలో తండ్రికి భారం కావొద్దని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.. మండలకేంద్రం బోయినపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థి బొడ్డు పూజ (20) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డినట్లు ఎస్సై జి. శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఆయన వివరాల మేరకు.. పూజ డిగ్రీ రెండోసంవత్సరం చదువుతోంది. తండ్రి దుర్గేశ్ దివ్యాంగుడు. సోదరి కూడా చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆర్థికఇబ్బందులు పెరిగాయి. వీరి తల్లి మృతిచెందగా పూజకు బెంగతో తరచూ ‘నేను అమ్మ వద్దకు పోతా’ అని అంటూ ఉండేది. శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతిచెందింది. మృతుడి తండ్రి బొడ్డు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment