
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ముంబై: ప్రాణాంతకమైక కరోనా బారిన పడ్డ పేషెంట్‌కు సేవలందించాల్సింది పోయి ఓ డాక్టర్ అనుచితంగా ప్రవర్తించాడు. అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ముంబైలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నవీ ముంబై మెడికల్ కాలేజ్‌లో విద్యనభ్యసించిన ఓ యువకుడు వోక్‌హార్డ్ హాస్పిటల్‌లో ఏప్రిల్ 30న వైద్యుడిగా నియమితుడయ్యాడు. ఆ తర్వాతి రోజున ఓ కోవిడ్ పేషెంట్ ఆసుపత్రిలోని ఐసీయూలో జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలో అతడికి చికిత్స చేయాల్సింది పోయిన వైద్యుడు లైంగిక వేధింపులకు దిగాడు. అతడు ఉండే ఐసీయూ గదిలోకి వెళ్లి పేషెంట్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు పేషెంట్ అతడి చర్యలను ప్రతిఘటించి అక్కడ ఉన్న అలారమ్ బటన్‌ను నొక్కడంతో అప్రమత్తమైన మిగతా సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. (ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులకు కరోనా)
బాధితుడు తెలిపిన వివరాల మేరకు ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కరోనా వైరస్ సోకిన రోగికి సమీపంగా వెళ్లినందున వైరస్ సోకే అవకాశాలు ఉండవచ్చన్న అనుమానంతో అతడిని అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతం అతడిని థానేలోని స్వగృహంలో క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు అతడిని విధుల నుంచి తొలగించినట్లు వోక్‌హార్డ్ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. కాగా వైద్యులతో సహా 80 మంది కరోనా బారిన పడటంతో సుమారు నెల రోజుల వరకు ఆసుపత్రిని మూసివేశారు. అనంతరం ఏప్రిల్ 23న హాస్పిటల్‌ను తిరిగి ప‌్రారంభించారు. (కరోనా: గాంధీకి బయల్దేరుతుండగా దారుణం!)
Comments
Please login to add a commentAdd a comment