నిందితుడు కేశవులు శేఖర్ (ఫైల్) లక్ష్మీపతి (ఫైల్)
ఆయనకు 54 ఏళ్లు. తన కుమార్తెను ఇద్దరు తరచూ వేధిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుని జీర్ణించుకోలేకపోయాడు. ఓపిక పట్టాడు. ఆవేశాన్ని దిగమింగుకోలేకపోయాడు. విచక్షణ మరచిపోయి ఇద్దరిని మట్టుబెట్టాడు. పంటకోసే కొడవలితో ఇద్దరి గొంతు కోసి, మర్మాంగాలను వేరుచేసి దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. చిత్తూరు మండలంలోని చెన్నసముద్రంలో ఆదివారం ఈ జంట హత్యలు వెలుగుచూశాయి.
చిత్తూరు రూరల్:చిత్తూరు మండలం చెన్నసముద్రం గ్రామంలో జంట హత్యలు కలకలం సృష్టిం చాయి. గ్రామ సమీపంలో ఉన్న చెరుకు తోటలో శనివారం అర్ధరాత్రి లక్ష్మీపతి (55), శేఖర్ (40) హత్యకు గురయ్యారు. ఈ హత్యల ప్రధాన నిం దితుడు కేశవులు (54) ఆదివారం పోలీసు ఎదుట లొంగిపోయాడు. డీఎస్పీ సుబ్బారావు, సీఐలు శ్రీనివాసరావు, ఆదినారాయణ, ఎస్‌ఐలు భాస్కర్, రాజశేఖర్ తాలూకా పోలీస్ స్టేషన్‌లో నిం దితుడి అరెస్టు చూపించారు. అనంతరం హత్యకు గల కారణాలను వివరించారు. చిత్తూరు మండలం చెన్నసముద్రం గ్రామానికి చెందిన గంగమందడి కుమారుడు లక్ష్మీపతి(55) పంచాయతీలో పారిశద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు.
ఇతనికి పెళ్లయినా పిల్లలు లేరు. అదే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు శేఖర్ ఆర్టీసీ డ్రైవర్‌గా కుప్పం డిపోలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శేఖర్ శనివారం ఉదయం డ్యూటీ ముగించుకుని చెన్నసముద్రంకు చేరుకున్నాడు. రాత్రి 7.30 గంటల సమయంలో తన సన్నిహితులైన లక్ష్మీపతి, కేశవులుతో కలిసి సారా తాగేందుకు గ్రామ సమీపంలో ఉన్న చెరుకు తోట కు వెళ్లారు. అక్కడ పూటుగా సారా తాగారు. రాత్రి 10 గంటలు దాటినా వీరు ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతి కారు. ఫలి తం లేదు. పది గంటల తరువాత కేశవులు ఒక్కడే ఊర్లో కనిపించాడు. మిగిలిన ఇద్దరు ఎక్కడని గ్రా మస్తులు ప్రశ్నిస్తే తనకు తెలియదని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి చెరుకు తోటలో శేఖర్, లక్ష్మీపతి విగతజీవులుగా కనిపించారు.
కిరాతంగా హతమార్చాడు
చెరుకుతోటలో ముగ్గురూ కలిసి పూటుగా మద్యం తాగారు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య మాటామాటా పెరిగింది. కుమార్తెను శేఖర్ లైంగికంగా వేధిస్తున్నాడన్న కోపంతో కేశవులు ఊగిపోయాడు. పచ్చగడ్డి కోసే కొడవలితో గొంతుకోసి హత్య చేశాడు. విషయాన్ని బయటకు చెబుతాడని భావించి లక్ష్మీపతిని కూడా హత్య చేశాడు. అంతటితో ఆగక వారి మర్మాంగాలను వేరు చేశాడు. మృతదేహాలను చెరుకుతోటలోనే పడేసి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి నేరుగా పోలీసు స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని ఎస్పీ, ఏఎస్పీ పరిశీలించారు. అలాగే వేలిముద్రల నిపుణులు కొడవలి, సారా బాటిల్, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా మృతుడు శేఖర్‌పై 2014లో చిత్తూరు తాలూకా పోలీసు స్టేషన్‌లో మహిళలను అవమానించిన కేసు నమోదైనట్లు దర్యాప్తులో తేలింది. పైగా మద్యం తాగి విధులకు హాజరుకావడంతో అధికారులు గతంలో సస్పెండ్ కూడా చేసినట్లు గుర్తించారు. డ్యూటీలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని తెసుకున్నారు. లక్ష్మీపతి, శేఖర్ మృతదేహాలకు ఆదివారం సాయంత్రానికి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. కేశవులును సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. ఈ కేసులో అతని కుమార్తెను కూడా విచారిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment