‘టానిక్‌’లో బాహాబాహీ | Drunked Man Fighting With Tonique Bar Staff in Hyderabad | Sakshi
Sakshi News home page

‘టానిక్‌’లో బాహాబాహీ

Published Mon, Dec 23 2019 9:10 AM | Last Updated on Mon, Dec 23 2019 11:39 AM

Drunked Man Fighting With Tonique Bar Staff in Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం:36లోని టానిక్‌ మద్యం దుకాణంలో శనివారం అర్ధరాత్రి కొందరు యువకులు, మద్యం షాపు బౌన్సర్లకు మధ్య తీవ్ర గొడవ జరిగింది. మద్యం కోసం వచ్చిన ఐదుమంది యువకులు నిబంధనలకు విరుద్ధంగా ఖరీదైన మద్యం సీసా మూతతీసి తాగేందుకు యత్నించారంటూ ఈ గొడవ జరిగింది. పొలీసులు తెలిపిన మేరకు.. నగరంలోనే ఖరీదైన మద్యం షాపు టానిక్‌ పేరుతో నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్న శ్రీకాంత్, రేవంత్‌తో సహా ఐదుగురు స్నేహితులు శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌పక్కన ఉన్న ఎయిర్‌ లైవ్‌ పబ్‌లో మద్యం సేవించి స్నేహితుడి బర్త్‌డే విందును ఘనంగా చేసుకున్నారు. రాత్రి 11.40 గంటల ప్రాంతలో మద్యం మత్తులోనే ఈ ఐదుగురు స్నేహితులు టానిక్‌ మద్యం షాపుకు వెళ్లారు.

శ్రీకాంత్‌ అక్కడున్న జానీవాకర్‌ మద్యం సీసా మూత తీసి తాగేందుకు యత్నిస్తుండగా బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో మాటామాటా పెరిగింది. బౌన్సర్లు శ్రీకాంత్‌ ముఖంపై కొట్టడంతో కళ్లద్దాలు పగిలిపోయాయి. ఆపడానికి యత్నించిన మిగతా నలుగురు స్నేహితులు కూడా ఈ గొడవలో పాల్గొన్నారు. షాపులో న్యూసెన్స్‌ చేశారంటూ మేనేజర్‌ సుధాకర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement