రోదిస్తున కుటుంబ సభ్యులు
ఖమ్మంరూరల్: మండలంలోని వెంకటగిరి క్రాస్‌రోడ్ సమీపంలో శనివారం సాగర్ కాలువల మమ్మతుల కోసం సర్వే చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన గోదా స్వామి (40) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ కన్‌స్ట్రక్షన్ సంస్థ కాలువ మరమ్మతులకు సర్వే చేపట్టింది. ఆ పనులకు కూలీగా వచ్చిన స్వామి ఇనుపకడ్డీ తీసుకుని కొలతలు వేస్తుండగా కాలువ పైనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. ఒక్కసారిగా షాక్‌కు గురై స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు.
పరిహారం కోసం రాస్తారోకో: కూలి నాలి చేసుకుని కుటుం బాన్ని పోషించుకుంటున్న స్వామి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని బంధువులు మృతదేహాంతో రహదారిపై రాస్తారోకో చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో ఎస్సై చిరంజీవి ఆందోళనకారులకు నచ్చచెప్పి పక్కకు పంపించారు. అనంతరం మృతదేహాన్ని తీసుకొని సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతసేపు రాస్తారోకో చేశారు. చివర కు సంస్థ వారు ఇచ్చిన హామీతో రాస్తారోకో విరమించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment