
నర్సంపేట రూరల్: ఫ్యూజ్ వేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కిన విద్యుత్‌శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని వల్లభ్‌నగర్‌కు చెందిన మణికుమార్(22) విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్ పనిచేయకపోవడంతో ఓ రైతు లైన్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారమిచ్చాడు.
ఆయన సూచన మేరకు మణికుమార్ 11 కేవీ పాకాల ఫీడర్‌కు ఎల్‌సీ (విద్యుత్ సరఫరా నిలిపివేత) తీసుకొని ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కాడు. అప్పటికే రాజుపేట ఫీడర్ ఛానల్ ఎల్‌టీ లైన్ సర్వాపురం శ్మశాన వాటిక వద్ద పాకాల ఫీడర్ విద్యుత్ వైర్లకు తాకడంతో విద్యుత్ ప్రసారం అవుతోంది. ఈ క్రమంలో ఫ్యూజ్ సరిచేస్తుండగా అతడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment