వీరభద్రుడి విగ్రహాన్ని పక్కకు జరిపి తవ్విన దృశ్యం
వైఎస్‌ఆర్ జిల్లా,ఒంటిమిట్ట : గంగపేరూరులోని వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు. ఈ సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర కల్గిన వీరభద్రస్వామి ఆలయం శిథిలమైంది. ఆఖరికి వీరభద్రుడి శిల్పం, ఆనాటి శాసనాలు మాత్రమే మిగిలాయి. పురాతన ఆలయం కాబట్టి గుప్త నిధులు ఉంటాయనే ఆలోచనతో కొంత మంది 5 బైక్‌ల్లో వచ్చారు. అక్కడ ఉన్న వీరభద్రుడి శిల్పాన్ని తొలగించారు. శిల్పం ఉన్న చోట తవ్వకాలు జరిపారు. ఎంత తవ్వినా ఏమీ కనిపించక పోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన రాత్రి 11 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోందని అక్కడి గ్రామ ప్రజలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment