యశవంతపుర: ఫేస్‌బుక్‌లో పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమ్మాయిని మోసం చేసిన యువకుణ్ని యశవంతపుర పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన నరేశ్‌ను నిందితునిగా గుర్తించారు. వివరాలు... యశవంతపుర ప్రాంతానికి చెందిన అమ్మాయికి– నరేశ్‌కు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నరేశ్ కర్నూలు నుంచి యశవంతపురకు వచ్చాడు. అమ్మాయితో కలిసి అనేకసార్లు నగరంలో షికార్లు చేశాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకొంటానని నమ్మిం చాడు. ఇద్దరూ మైసూరు, విజయవాడ, వైజాగ్, అనంతపురం, అదోని ప్రాంతాలలో విహారయాత్రలు చేశారు. శారీరకంగా కూడా ఒక్కటయ్యారు.
ప్లేటు ఫిరాయింపు : అమ్మాయినే పెళ్లి చేసుకొంటానంటూ కర్నూలుకు తీసుకెళ్లి అతడు తన కుటుంబసభ్యులకు కూడా పరిచయం చేశాడు. తరువాత కొద్దిరోజులకే ప్లేటు ఫిరాయించాడు. ఇద్దరివీ వేరువేరు కులాలు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోలేనంటూ నరేశ్ మొండికేశాడు. అతని తల్లిదండ్రులు కూడా మరో అమ్మాయితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. బాధిత యువతి తనకు జరిగిన అన్యాయంపై యశవంతపుర పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నరేశ్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment