‘ఫేక్‌’బుక్‌ ప్రేమ | Facebook Lover Cheat Girlfriend in Tamil nadu | Sakshi
Sakshi News home page

‘ఫేక్‌’బుక్‌ ప్రేమ

Published Sat, Nov 16 2019 6:55 AM | Last Updated on Sat, Nov 16 2019 6:55 AM

Facebook Lover Cheat Girlfriend in Tamil nadu - Sakshi

అన్నానగర్‌: ఫేస్‌బుక్‌లో పరిచమైన అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పి నగలు, నగదు తీసుకుని మోసం చేసిన వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై మయిలాపూర్‌ సెయింట్‌ మేరీస్‌ రోడ్డుకి చెందిన శ్యామల (31) తేనామ్‌పేటలోని ఓ క్లీనిక్‌లో ఫిసియోథెరపిస్టుగా పని చేస్తోంది. భర్తతో అభిప్రాయ భేదాలు రావడంతో విడిగా ఉంటోంది.  ఈమెకి ఫేస్‌బుక్‌ ద్వారా మీంజూరు వీఆర్‌డీకి చెందిన జయచంద్రన్‌ (40) పరిచయమయ్యాడు. ఇతను ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. భార్యతో మనస్పర్థలు వచ్చి విడిగా ఉంటున్నట్లు శ్యామలను నమ్మించాడు. ఏడాదిన్నరగా ఫేస్‌బుక్‌లో స్నేహితులుగా ఉన్నారు. క్రమంగా అది ప్రేమగా మారింది. జయచంద్రన్‌ కొన్ని నెలలుగా శ్యామలని వివాహం చేసుకుంటాననిక చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి రూ. 1.5 లక్షల నగదు, వజ్రపు దిద్దులు, ల్యాప్‌టాప్‌ తీసుకున్నట్లుగా తెలిసింది. అసలు విషయం తెలియడంతో పోలీసులన ఆశ్రయించింది. దీంతో శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement