
నిందితుడు డేవిడ్‌బిల్లా(ఫైల్)
శామీర్‌పేట్: హిందూ దేవుళ్లను కించపరుస్తూ సోషల్ మీడియా(ఫేస్‌బుక్)లో పోస్టులు పెట్టిన వ్యక్తిని శామీర్‌పేట పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ అబ్దుల్ రజాక్ వివరాల ప్రకారం... శామీర్‌పేటకు చెందిన వర్గంటి శ్రీనివాస్ అలియాస్ డేవిడ్ బిల్లా ఫేస్‌బుక్‌లో హిందూ దేవుళ్లను కించపరిచేలా పోస్టులు పెట్టాడని బజ్‌రంగ్‌దళ్ కార్యకర్త రవీందర్‌గౌడ్ గురువారం రాత్రి శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బజ్‌రంగ్‌దళ్, బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్–కరీంనగర్ జాతీయ రహదారిపై రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment