ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : స్పెషల్ పూజలు చేస్తే అదృష్టం కలిసొస్తుందని నమ్మించి అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడో! నకలీ జ్యోతిష్యుడు. ఇంటర్‌నెట్ ద్వారా కష్టాల్లో ఉన్న వారికి ఎరవేసి వారినుంచి లక్షల రూపాయలు స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఆకాష్ భార్గవ్ అనే ఓ నకిలీ జ్యోతిష్యుడు ఆన్‌లైన్ ద్వారా జ్యోతిష్యం చెబుతానంటూ రామాంతపూర్‌కు చెందిన ఓ వ్యక్తి వద్దనుంచి రూ.13లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో.. మీ పేరుపై స్పెషల్ పూజలు చేస్తే అదృష్టం కలిసొస్తుందని ప్రజలను నమ్మించాడు. మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తిని పూజలు చేస్తే వ్యాధి నయం అవుతుందని నమ్మబలికాడు.
దీంతో బాధితుడు ఆకాష్ అకౌంట్‌లో 13లక్షలు డిపాజిట్ చేశాడు. వచ్చీరాని విధంగా పూజలను నిర్వహించి చేతులు దులుపుకున్నాడు ఆకాష్. ఓ వ్యక్తి జ్యోతిష్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు పంజాబ్‌లోని జలందర్ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న ఆకాష్ భార్గవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుంచి 13లక్షల రూపాయలను రికవర్ చేశారు. నకిలీ జ్యోతిష్యుల మాటలు నమ్మి మోసపోకండని రాచకొండ జాయింట్ సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment