
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నెల్లూరు : నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటిపెద్ద గుండెపోటుతో మరణించాడన్న వార్త విని తట్టుకోలేకపోయిన ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం నెల్లూరు నగరంలోని రంగానాయకులపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు రంగనాయకకులపేటకు చెందిన కొండలరావు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. ఈ ఆదివారం వ్యాపారానికి సంబంధించిన పనిపై హైదరాబాద్ వెళ్లాడు. హైదరాబాద్‌లో ఉండగానే గుండెపోటుతో అక్కడిక్కడే మృతి చెందాడు.
ఈ విషయం నెల్లూరులో ఉన్న అతని కుటుంబసభ్యులకు తెలిసింది. కొండలరావు మరణవార్త విని తట్టుకోలేకపోయిన భార్య సుజాత, కూతర్లు దివ్య, విష్ణువర్థినిలు ఇంట్లోనే ఉరిపోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో కొండలరావు చిన్న కుమార్తె విష్ణువర్ధిని మరణించగా భార్య, పెద్ద కూతురు పరిస్థితి విషమంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment