
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. సంపన్నులు నివసించే వసంత్ కుంజ్ ప్రాంతంలో ఫ్యాషన్ డిజైనర్ మలా లఖాని ఆమె ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. లఖాని, ఆమె సెక్యూరిటీ గార్డు బహుదూర్ సింగ్‌ల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 53 సంవత్సరాల లఖానీ తమ ఇంటి సమీపంలోని గ్రీన్‌పార్క్ ప్రాంతంలో బొటిక్ నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
వీరిద్దరిని పలుమార్లు కత్తితో పొడిచి చంపారని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబందించి స్ధానికులు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నామని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని డీసీపీ దేవేందర్ ఆర్య చెప్పారు.
కాగా, ముగ్గురు నిందితులు నేరాన్ని అంగీకరించారని పోలీస్ కమిషనర్ అజయ్ చౌదరి వెల్లడించారు. ఫ్యాషన్ డిజైనర్ వర్క్‌షాప్‌లో పనిచేసే రాహుల్ అన్వర్ అనే టైలర్ దోపిడీకి పాల్పడే ఉద్దేశంతోనే ఈ హత్యలకు పాల్పడ్డాడు. అన్వర్‌కు సహకరించిన ఇద్దరు బంధువులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment