న్యూఢిల్లీ : అతి వేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. వీకెండ్ కావడంతో ముగ్గురు స్నేహితులు కలిసి హోండా సిటీ కారులో సరదాగా చక్కర్లు కొట్టాలనుకున్నారు. అయితే కారును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి పోల్‌ను ఢీకొట్టి, రెండు ముక్కలై నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఢిల్లీలోని జ్వాలా హేరీ మార్కెట్ దగ్గర శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడి సీసీ కెమెరాలో వీడియో రికార్డు అయింది.
కారులో ప్రయాణించిన ముగ్గురు యువకులను హిమాన్షు, జయంత్, సాహెబ్‌గా పోలీసులు గుర్తించారు. ముగ్గురిలో సాహేబ్ కారు నడపగా, ముందు సీటులో హిమాన్షు, జయంత్ కారు వెనుక సీటులో కూర్చొన్నట్టు పోలీసులు చెప్పారు. హిమాన్షు ప్రాణాలు కోల్పోగా, గాయపడ్డ సాహెబ్, జయంత్‌ను సమీప ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణించిన ముగ్గురిలో ఎవరికీ డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment