కనురెప్పే కాటేస్తోంది... | Father Molestation On Daghter From one Year In Hyderabad | Sakshi
Sakshi News home page

కనురెప్పే కాటేస్తోంది...

Published Fri, Sep 28 2018 9:38 AM | Last Updated on Fri, Sep 28 2018 9:38 AM

Father Molestation On Daghter From one Year In Hyderabad - Sakshi

పోలీసుల అదుపులో హనీజ్‌

అల్వాల్‌: చిన్నారులపై లైంగిక వేధింపులను నియంత్రించేందుకు అధికారులు ‘గుడ్‌ టచ్‌–బ్యాడ్‌ టచ్‌’ పేరిట ఓ పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో చిన్నారిపై ఓ కామాంధుడి దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఐదో తరగతి చదువుతున్న కుమార్తెపై(11) పై ఓ తండ్రి ఏడాదిగా లైంగికదాడికి పాల్పడుతున్నట్లు తెలియడంతో చైల్డ్‌ వెల్పేర్‌ సిబ్బంది అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..అల్వాల్‌ పుడమి పాఠశాలలో చైల్డ్‌ వెల్పేర్‌ విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌’ అంశంపై విద్యార్ధినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని గత ఏడాదిగా తన తండ్రి తనపై లైంగికదాడికి పాల్పడుతున్నట్లు సీడబ్ల్యూడీ చైర్‌ పర్సన్‌ పద్మావతికి తీసుకు వచ్చింది.

దీంతో ఆమె స్థానిక శిశు సంరక్షణ సభ్యులతో కలిసి బాధితురాలి తండ్రి హనిజ్‌ (36)పై అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైదాబాద్‌లోని భరోసా సెంటర్‌లో బాలిక స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన అధికారులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హనీజ్‌ కార్పెం టర్‌గా పని చేసేవాడు. 12 ఏళ్ల క్రితంఅల్వాల్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అతని భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో అతను పెద్ద కూతురిపై లైంగికదాడికి పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement