కుమార్తెను చంపి తండ్రి ఆత్మహత్య | Father Suicide After Killed Daughter | Sakshi
Sakshi News home page

కుమార్తెను చంపి తండ్రి ఆత్మహత్య

Published Sat, Dec 9 2017 8:26 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Father Suicide After Killed Daughter - Sakshi

నజీర్‌ మృతదేహం వద్ద విచారణ చేస్తున్న పోలీసులు

వేలూరు: కుమార్తె గొంతు కోసి హత్య చేసి అనంతరం తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. ఈ ఘటన వేలూరు సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే వేలూరు సమీపం అరపాక్కం మసీదు వీధికి చెందిన నజీర్‌(50) బీడి కార్మికుడు. ఇతని భార్య కొద్ది రోజుల కిందట మృతి చెందింది. వీరికి యాస్మిన్‌(25)తో పాటు ముగ్గురు కుమార్తెలున్నారు. ఒక కుమార్తె కొద్ది సంవత్సరాల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. మరో కుమార్తె అనారోగ్యంతో రెండేళ్ల కిందట మృతి చెందింది. దీంతో ఇంట్లో నజీర్, యాస్మిన్‌ మాత్రమే నివశిస్తున్నారు. యాస్మిన్‌కు వివాహం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లలో నజీర్‌ ఉండేవాడు.

ఈ స్థితిలో శుక్రవారం ఉదయం ఆయన ఇళ్లు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు లోనికి వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో యాస్మిన్‌ గొంతు కోసిన స్థితిలో రక్తపు మడుగులో శవంగా పడిఉంది. అనుమానం కలిగిన స్థానికులు నజీర్‌ కోసం గాలించారు. సమీపంలోని బావిలో నజీర్‌ మృతదేహం తేలుతూ కనిపించింది. దీనిపై వెంటనే రత్నగిరి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. కుమార్తెను హత్య చేసిన అనంతరం నజీర్‌ బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బావిలో ఉన్న నజీర్‌ మృతదేహాన్ని బయటకు తీయగా ఆయన లుంగీపై రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement