బీజింగ్ : చైనాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో చెలరేగిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించటంతో 19 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ బిజీంగ్‌లోని దాక్సింగ్ జిల్లా.. జిన్‌జియాన్ గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
సాయంత్రం 6 గంటల సమయంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగి చుట్టుపక్కల వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు మూడు గంటలపాలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఘటనలో మొత్తం 19 మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు.. జిన్‌హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
కాగా, ప్రమాదం వెనుక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు.. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment