స్పిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం | Fires Break Out In Spinning Mill In Guntur | Sakshi
Sakshi News home page

స్పిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

Published Thu, Oct 31 2019 8:57 AM | Last Updated on Thu, Oct 31 2019 8:57 AM

Fires Break Out In Spinning Mill In Guntur - Sakshi

మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న కార్మికులు

సాక్షి, మేడికొండూరు : విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో స్పిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన మండలంలోని భీమినేనివారిపాలెం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. భవనం స్పిన్నింగ్‌ మిల్లు ఫ్రీ ఓపెనర్‌ ప్లాంట్‌లో బుధవారం పత్తి వేస్తున్న మిషనరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులు దీనిని గమనించి వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అదుపు కాకపోవటంతో ఫైరింజన్‌ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కార్మికులు మిషనరీలో పత్తి వేస్తుండగా విద్యుత్‌ షార్ట్‌ సర్యూట్‌తో ప్రమాదం జరిగిందని కంపెనీ సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదం జరిగిన కాసేపటి వరకు ఎవరికి తెలియక పోవటంతో లోలోపల పత్తి బేళ్లు తగలబడి పోయాయి. సుమారు రూ.40 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని మేడికొండూరు ఎస్సై వినోద్‌కుమార్‌ పోలీస్‌ సిబ్బంది పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement