మత్స్య శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర రావు
సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్ కలెక్టరేట్ ‘బి’ బ్లాకులోని జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో మంగళవారం సబ్సిడీ నిధుల కోసం ఒక లబ్ధిదారురాలి నుంచి రూ.10 వేలు తీసుకుంటున్న సంబంధిత జిల్లా అధికారి వెంకటేశ్వర రావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని శివపూర మహిళా మత్స్య సహకార సంఘం సభ్యురాలు అనురాధ తమ సంఘానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3 లక్షల సబ్సిడీ నిధులను విడుదల చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా జిల్లా మత్స్యశాఖ కార్యాలయం చుట్టు తిరుగుతోంది. ఆ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్‌రావు రూ.10 వేలు ఇస్తేనే సబ్సిడీ నిధులు విడుదల చేస్తానని చెప్పడంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఏసీబీ అధికారుల సూచనమేరకు మంగళవారం జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో వెంకటేశ్వర్‌రావుకు ఆమె రూ.10 వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంకటేశ్వర్‌రావును అదుపులోకి అదుపులోకి తీసుకున్నామని, బుధవారం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment