
ప్రతీకాత్మం
కరెంటు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో ప్రజలు అందకారంలో మునిగిపోయారు.
బీజింగ్: చైనాలో సంభవించిన అకస్మాత్తు వరదలకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది అదృశ్యమయ్యారు. చైనాలోని యున్నాన్ ప్రావిన్స్‌లో ఈ వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో మెంగ్‌డాంగ్ టౌన్‌షిప్ అతలాకుతలం అయింది. వరదల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. కరెంటు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో ప్రజలు అందకారంలో మునిగిపోయారు. మెటియోరాజికల్ అధికారులు ఎమెర్జిన్సీ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే భద్రతా బలగాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.