చిన్నారి జెనిషియా (ఫైల్)
బొమ్మనహళ్లి: ఎనిమిదవ అంతస్తు నుంచి జారిపడి చిన్నారి పాప మరణించిన ఘటన మంగళూరు నగరంలోఉన్న శక్తి నగరలో గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి విల్సన్, ఆలిత దంపతుల కుమార్తె శానెల్ జెనిషియా డిసౌజా (5)గా గుర్తించారు. దంపతులు తమ ఐదు సంవత్సరాల కుమార్తెతో కలిసి అపార్టుమెంటులో ఉన్న 8వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. గురువారం ఇంట్లో ఆటలాడుతున్న చిన్నారి డిసౌజా ఇంటిలో ఉన్న స్లైడర్ కిటికి వద్ద ఆడుకుంటూ పైకి ఎక్కి కిందికి జారిపడడంతో తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయింది.
స్లైడర్ కిటికి ఏర్పాటు చేసినా దానికి మధ్యలో ఇనుప కడ్డీలు ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కంకనాడి పోలీసులు పరిశీలన జరిపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కుమార్తె ఈ ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరు మున్నీరుఅవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment