సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం. కృష్ణ సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ ఎస్.ఎం. శంకర్ (82) అనారోగ్యంతో మరణించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. మండ్య జిల్లాలోని సొంతగ్రామం సోమనహళ్లిలో అంత్యక్రియలు నిర్వహించడానికి శంకర్ కుటుంబ సభ్యులు పార్థివదేహాన్ని అక్కడికి తరలించారు. అనంతరం రెండు గంటల పాటు గ్రామంలోని మల్లయ్య విద్యాసంస్థ ఆవరణలో శంకర్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు మండ్య ఎంపీ సుమలత పార్థివదేహం వద్ద నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment