SM Krishna
-
ఒకప్పుడు భర్త, ఇప్పుడు తండ్రి మరణం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన ఎస్ఎం కృష్ణ ఇటీవల కన్నుముశారు. ఆయన కుమార్తె మాళవిక హెగ్డే ప్రముఖ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(సీసీడీ) వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ సతీమణి. మంగళూరు కాఫీ ఘుమ ఘుమల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వీజీ సిద్ధార్ధ మరణంతో సీసీడీ సీఈవోగా మాళవిక హెగ్డే బాధ్యతల్ని చేపట్టిన విషయం తెలిసిందే.భర్త మరణం.. చెదరని విశ్వాసం2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇలాంటి సందర్భంలో మనకు ఏమనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా! ఈ రెండు కోణాలు మాళవికకు ఎదురయ్యాయి. కేఫ్ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, ఉద్యోగులకు అండగా ఉంటూ సంస్థనూ ముందుకు నడుపుతున్నారు.సగానికిపైగా అప్పులు క్లియర్కేఫ్ కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు అనే దానికి ఈ విషయం ఒక ఉదాహరణ. కేఫ్ కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. అలాగే, తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు.ఇదీ చదవండి: బిగ్‌బీను వెనక్కి నెట్టిన కెప్టెన్ కూల్భర్త, తండ్రిని కోల్పోయిన మాళవిక అధైర్య పడకుండా రెట్టించిన ఉత్సాహాంతో పని చేసి కంపెనీని అప్పుల ఊబిలో నుంచి బయటపడేసి లాభాల్లోకి తీసుకురావాలని శ్రేయోభిలాషులు ఆశిస్తున్నారు. -
ఆయనదే విజన్.. ఇతరులది భజన్ భజన్!
ఫలానా అభివృద్ధికి మేమే కారణం అంటూ అరిగిపోయిన రికార్డులాగా.. ఏళ్లు గడుస్తున్నా గప్పాలు కొట్టుకుంటూ తిరిగే నేతల్ని ఇంకా మనం చూస్తున్నాం. అయితే చర్చల ద్వారా మేధావులు అందులో ఎంత వాస్తవం ఉందనేది వెలికి తీసే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారు. అయినా అలాంటి నేతల తీరు మారడం లేదు. అయితే ఈ దారిలో సోమనహల్లి మల్లయ్య కృష్ణ(SM Krishna) ఏనాడూ పయనించలేదు.దేశంలో కర్ణాటకలోని బెంగళూరు నగరానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఏమాత్రం పట్టుకోల్పోకుండా ఐటీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే.. భారత్‌కు సెమీకండక్టర్ హబ్‌గానూ పేరుగాంచింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా బెంగళూరును ఇవాళ పిలుచుకుంటున్నాం. అయితే.. ఈ నగరానికి ఇంతలా ఘనత దక్కడానికి ఎఎస్ఎం కృష్ణ చేసిన కృషి గురించి కచ్చితంగా చెప్పుకుని తీరాలి. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్ఎం కృష్ణ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా 1999-2004 మధ్య పని చేశారు. అదే టైంలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా స్వయంప్రకటిత విజనరీ నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎస్ఎం కృష్ణతో పోలిస్తే అప్పటికే చంద్రబాబు ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా పని చేసి ఉన్నారు. పైగా హైటెక్ సిటీలాంటి కట్టడంతో కొంత పేరూ దక్కించుకున్నారు. అయితే నిజంగా చంద్రబాబు తాను చెప్పుకునే విజన్‌తో.. తన రాజకీయానుభవం ఉపయోగించి ఉంటే ఆనాడే హైదరాబాద్ ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ ఘనత దక్కించుకుని ఉండేదేమో!. కానీ, ఎస్ఎం కృష్ణ తన రియల్ విజన్‌తో ఆ ట్యాగ్‌ను బెంగళూరుకు పట్టుకెళ్లిపోయారు.విజన్ అంటే ఇది.. 1999 టైంలో.. ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన ఐటీ సంస్థలు భారత్‌లో తమ తమ కంపెనీలకు అనుకూలమైన స్పేస్ కోసం వెతుకుతున్నాయి. అప్పటికీ హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఏర్పాటైనా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ నడిచింది. మరోవైపు ఆపాటికే బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ఏర్పాటైంది. ఇదే అదనుగా ఐటీ కంపెనీలను ఎలాగైనా బెంగళూరుకు తీసుకురావాలని నిర్ణయించుకున్న ఎస్ఎం కృష్ణ.. ఆ పరిశ్రమ వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా.. ఐటీ పార్కులు మరియు ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) ఏర్పాటుతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఈ నిర్ణయం దేశీయ, అంతర్జాతీయ టెక్ కంపెనీలను బెంగళూరులో తమ కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి ఆకర్షించింది. అలాగే.. ఐటీ రంగం అభివృద్ధి చెందాలంటే ఏం అవసరం అనే అంశాలపై అప్పటికే ఐటీ మేధావులతో ఆయన చర్చలు జరిపి ఉన్నారు. పన్ను ప్రోత్సాహకాలు, సరళీకృత నిబంధనలతో పాటు స్టార్టప్‌లకు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో పారిశ్రామికవేత్తలతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తద్వారా వాళ్ల అవసరాలకు అనుగుణంగా తెచ్చిన సంస్కరణలు.. బెంగళూరులో టెక్ కంపెనీల కార్యకలాపాలను సులభతరం చేశాయి.ఇక.. ఒకవైపు ఐటీ రంగం కోసం ప్రతిభావంతులైన నిపుణుల అవసరాన్ని గుర్తించి విద్యతో పాటు స్కిల్‌డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు ఐటీ పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడానికి ఇంజనీరింగ్ కాలేజీలు, శిక్షణా సంస్థల స్థాపనకూ ప్రాధాన్యత ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా.. అంతర్జాతీయ వేదికలపై బెంగళూరును ఎస్ఎం కృష్ణ ప్రమోట్ చేశారు. తద్వారా భాగస్వామ్యాలను, విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగారు. బాబు విజన్.. వాస్తవం ఎంత?‘‘హైదరాబాద్‌లో టెక్నాలజీ నా చలవే’’ అంటూ హైటెక్ సిటీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు ఒక భ్రమను కల్పించారనే వాదన ఒకటి ఉంది. కానీ, అంతకు ముందే హైదరాబాద్‌కు టెక్ కంపెనీల రాక మొదలైంది. నగరానికి 1965లోనే ఈసీఐఎల్, ఆ తర్వాత ఈఎంఈ వచ్చింది. తద్వారా ఎలక్ట్రానిక్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే హైదరాబాద్‌లో ఐటీ విస్తరణకు మూలం అయ్యింది. 1982లో సీఎంసీ ఆర్ అండ్ డీ వచ్చింది. ఇది సాఫ్ట్వేర్ సంస్థ. బెంగళూర్ కన్నా మూడేళ్ల ముందే అది హైదరాబాద్‌కు వచ్చింది. దాన్ని ఆ తర్వాత టీసీఎస్‌కు అమ్మేశారు.ఇక.. 1987లో ఇంటర్‌గ్రాఫ్ హైదరాబాద్‌లోని బేగంపేటలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత దేశానికి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ.. హైదరాబాద్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఐటీ వృద్ధికి కృషి జరిపారు. ఈ క్రమంలోనే మైత్రీవనంలో 1991లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటైంది. ఆ తర్వాత మాదాపూర్ ప్రాంతంలో ‘‘హైటెక్ సిటీ’’కి అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి పునాది వేశారు. ఆ తర్వాత మైత్రీవనంలోని సంస్థలు అక్కడికి తరలిపోయాయి.కర్ణాటక సీఎంగా ఎస్ఎం కృష్ణ వ్యూహాత్మక దృక్పథం, ఆయన విశేషకృషి వల్లే బెంగళూరు భారతదేశ ఐటీ విప్లవానికి పర్యాయపదంగా మారింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అనే బిరుదును సంపాదించుకోగలిగింది. అయితే ఇతరుల్లా ఏనాడూ ఆయన ఆ ఘనతను.. తన ఘనతగా తర్వాతి కాలంలోనూ చెప్పుకుంది లేదు!.ఎస్ఎం కృష్ణకి నివాళిగా.. -
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
-
రాజకీయాలకు ఎస్ఎం కృష్ణ గుడ్‌బై
శివాజీనగర: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఎస్ఎం కృష్ణ క్రియాశీల రాజకీయాలకు ‘గుడ్‌బై’ చెప్పారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘రాజకీయాలకు ఇక దూరంగా ఉంటాను. 90 ఏళ్ల వయసులో 50 ఏళ్ల వ్యక్తిలా నటించడం సాధ్యం కాదు. అందుకే ప్రజల్లోకి రావడం కూడా తగ్గించాను’ అని తెలిపారు. బీజేపీలో నిర్లక్ష్యానికి గురయ్యారా? అని మీడియా ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని ఆయన బదులిచ్చారు. వయసు రీత్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, కర్ణాటకలోని మాండ్య జిల్లా మద్దూరులోని రైతు కుటుంబంలో జన్మించిన ఎస్ఎం కృష్ణ.. బెంగళూరు, అమెరికాలోని పలు ప్రముఖ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించారు. న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1962లో మద్దూరు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి.. పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1989 నుంచి 1993 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా, అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఎస్ఎం కృష్ణ 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. యూపీఏ హయాంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆయన 2017లో బీజేపీలో చేరారు. -
కాఫీ డే కింగ్ అరుదైన ఫోటో
సాక్షి, బెంగళూరు : కేఫే కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థ హెగ్డే అకాలమృతి అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. మాజీ కేంద్ర మంత్రి, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు స్వయానా అల్లుడు సిద్ధార్థ. మాజీ సీఎం కుమార్తె , ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన మాళవికను ఆయన వివాహమాడారు. తాజాగా సిద్ధార్థ, మాళవిక పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో సిద్ధార్థ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. ట్విటర్లో ‘ఆర్ఐపి సిద్దార్థ’ హ్యాహ్టాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఏ బలహీనత ఆయనను ఆవరించిందింతో తెలియదు కానీ.. సిద్ధార్థలో అపారమైన శక్తిని నింపిన ‘బలమే జీవితం, బలహీనతే మరణం’ అన్న వివేకానంద సూక్తి ఆయనను కాపాడలేకపోయింది. చివరికి ఆయన ఎంతో అభిమానించి, గురువుగా భావించిన మహేష్ కంపాని (బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ ప్రెసిడెంట్, జేఎంక్యాపిటల్ అధినేత, కారు యాక్సిడెంట్లో అనుమానాస్పదంగా మరణించారు) మాదిరిగానే సిద్ధార్థ జీవితం కూడా విషాదాంతమైంది. ‘ఎలాట్ కెన్ హ్యాపెన్ ఓవర్ ఎ కాఫీ’ అంటూ కాఫీ తాగుతూ ఒత్తిడిని దూరం చేసుకోమని ప్రపంచానికి మార్గం చూపించిన సిద్ధార్థను చివరికి ఆ ఒత్తిడే మింగేయడం అత్యంత విషాదం. వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించిన సిద్ధార్థ ప్రధానంగా వికలాంగులకు ప్రాధాన్యం ఇచ్చేవారట. కాఫీ డే కంపెనీలో ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టే అన్నంత సంబరం ఉద్యోగుల్లో. కాగా కాఫీడే ఎంటర్ప్రైజెస్ బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి ఎస్వీ రంగనాథ్‌ను నియమించారు. సిద్ధార్థ రాసినట్టుగా చెబుతున్న లేఖ పై కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ దర్యాప్తునకు ఆదేశించనుందని తెలుస్తోంది. ఆగస్టు 8న తదుపరి బోర్డు సమావేశంలో దీనిపై చర్చిచనున్నారని సమాచారం. పలువురు రాజకీయవేత్తల, వ్యాపార వర్గాలు, కార్పొరేట్ వర్గాలు ఆయనకు తుది నివాళులు అర్పించేందుకు వేలాదిగా కర్ణాటకలోని చిక్మంగళూరుకు తరలివచ్చారు. మరికొద్ది క్షణాల్లో సిద్ధార్థ అంత్యక్రియలు ముగియనున్నాయి. -
సిద్ధార్థ అంత్యక్రియలకు ఎస్ఎం కృష్ణ
బెంగళూరు : ఆర్థిక ఒత్తిళ్లతో అదృశ్యమై విగత జీవిగా మారిన కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అంత్యక్రియలకు ఆయన మామ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ బయలు దేరారు. బెంగళూరులో తన స్వగృహం నుంచి అంత్యక్రియలు జరిగే బేళూరుకు పయనమయ్యారు. సిద్ధార్థ మృతికి సంతాపంగా దేశ వ్యాప్తంగా ఉన్న కేఫ్ కాఫీ డేలు ఈ రోజు (బుధవారం) బంద్‌ను పాటిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి అదృశ్యమైన వీజీ సిద్ధార్థ మృతదేహం నేత్రావతి నదిలో ఈ ఉదయం లభ్యమైన విషయం తెలిసిందే. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరుకి 375 కిలోమీటర్ల దూరంలో మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్.. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. వీజీ సిద్ధార్థ మృతి పట్ల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. సిద్ధార్థ మరణం షాక్‌కు గురిచేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘వీజీసిద్ధార్థ మరణించిన తీరు దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం నాకు దక్కింది. స్నేహపూర్వకంగా ఉండే జెంటిల్మెన్. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కాఫీ డేకు ఈ కఠిన సమయాన్ని తట్టుకునే ధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నాను.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘సిద్ధార్థ ఎవరో నాకు తెలియదు. ఆయన ఆర్థిక సమస్యల గురించి కూడా అవగాహన లేదు. నాకు తెలిసింది ఒక్కటే పారిశ్రామికవేత్తలు వ్యాపార నష్టాలతో బలవన్మరణం పొందడం సరైంది కాదు. ఎందుకంటే ఇది పారిశ్రామికరంగాన్నే చచ్చిపోయేలా చేస్తుంది’- ఆనంద్ మహింద్ర. -
కాఫీ డే ‘కింగ్’ కథ విషాదాంతం
సాక్షి, బెంగళూరు : సౌమ్యుడు, వివాదరహితునిగా పేరుపొందిన కేఫె కాఫీ డే (సీసీడీ) అధినేత వీజీ సిద్ధార్థ కథ చివరకు విషాదాంతమైంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, కెఫే కాఫీడే యజమాని, మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ మృతదేహం బుధవారం ఉదయం నేత్రావతి నది వద్ద లభ్యమైన విషయం తెలిసిందే. వీజీ సిద్ధార్థ సొంతూరు కాఫీ సీమ చిక్కమంగళూరు అయితే ముంబైలో వ్యాపార మెళుకువల్ని ఒంటబట్టించుకున్నారు. కాఫీ ఎస్టేట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి ఆ రంగంలో మేటిగా నిలిచారు. వీజీ సిద్ధార్థ తనకు ఇష్టమైన కెఫె కాఫీ డేను మొదట బెంగళూరు నగరంలో ప్రారంభించి ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలలతో పాటు పలు దేశాల్లో కూడా ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల్లో 1800 పైగా కాఫీడేలు ఉన్నాయి. అనేక వ్యాపార రంగాల్లో వేలకోట్ల లావాదేవీలు చేసే స్థాయికి ఎదిగారు. ఇంతలో అనూహ్యమైన ఆటుపోట్లు వచ్చాయో, ఏమో.. ఆకస్మాత్తుగా కనిపించకుండాపోయారు. సోమవారం సాయంత్రం మంగళూరు సమీపంలో నేత్రావతి నది వంతెన వద్ద అదృశ్యమైన సిద్ధార్థ చివరకు శవమై తేలారు. చదవండి: నేత్రావతి నదిలో సిద్ధార్థ మృతదేహం లభ్యం ఎస్ఎం కృష్ణ నివాసంలో విషాదం వీజీ సిద్ధార్థ మృతదేహం లభ్యం కావడంతో మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ నివాసంలో విషాదం నెలకొంది. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎస్ఎం కృష్ణ పెద్ద కుమార్తె మాళవిక భర్తే సిద్ధార్థ. సదాశివనగరలోని ఉన్న ఎస్ఎం కృష్ణ నివాసానికి నాయకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సిద్ధార్థ ఆత్మహత్యతో నగరంలోని రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు ఎస్ఎం కృష్ణ ఇంటికి క్యూ కట్టారు. మరోవైపు సిద్ధార్థ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. సిద్ధార్థ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి సిద్ధార్థ మృతదేహానికి మంగళూరులోని వెన్లాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయింది. పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా మంగుళూరు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ ఇవాళ ఉదయం నేత్రానదిలో ఓమృతదేహం లభ్యమైందని, దాన్ని అదృశ్యమైన వీజీ సిద్ధార్థగా గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికే ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించామన్నారు. సిద్ధార్థ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నామని, ఆర్థిక సమస్యలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు సీపీ వెల్లడించారు. ‘ట్రాజిక్ ఎండ్ టూ ది కాఫీ కింగ్’ మరోవైపు ఈ విషాద సంఘటనపై ‘ట్రాజిక్ ఎండ్ టూ ది కాఫీ కింగ్’ అని బీజేపీ మహిళా నేత శోభ ట్వీట్ చేశారు. అలాగే సిద్ధార్థ ఆత్మహత్యపై శృంగేరి ఎమ్మెల్యే టీడీ రాజేగౌడ మాట్లాడుతూ..‘ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఒత్తిడితో సిద్ధార్థ కొంచెం అప్సెట్ అయ్యాడు. ఆస్తులు అమ్మి సెటిల్ చేద్దామనుకున్నాడు. అతడికున్న అప్పుల కన్నా ఆస్తులే ఎక్కువ. ఇంతలో ఈ దారుణం జరిగింది.’ అని అన్నారు. సిద్ధార్థ ఆత్మహత్య సంఘటన దురదృష్టకరమని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఎస్ఎం కృష్ణను నిన్న (మంగళవారం) పలువురు ప్రముఖులు పరామర్శించారు. ముఖ్యమంత్రి యడియూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడ, డీకే శివకుమార్, మాజీ సీఎం కుమారస్వామి, సిద్దరామయ్య, నటులు శివరాజ్‌కుమార్, పునీత్‌రాజ్‌కుమార్, రాఘవేంద్రరాజ్‌కుమార్, మాజీమంత్రులు ఆర్.వి.దేశ్‌పాండే, శివశంకర్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్.అశోక్, కట్టా సుబ్రమణ్యం నాయుడు, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, హెచ్‌కే. పాటిల్ తదితరులు ఎస్ఎం కృష్ణను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సిద్ధార్థ మృతదేహం లభ్యం
సాక్షి, బెంగళూరు : కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ మిస్సింగ్ కేసు విషాదాంతం అయింది. ఆయన మృతదేహం నేత్రావతి నదిలో లభ్యమైంది. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్ధార్థ సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. బెంగళూరుకి 375 కిలోమీటర్ల దూరంలో మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్ మాట్లాడుతూ అలా నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్.. ఆయన కోసం వెతికినా కనిపించలేదు. కుటుంబసభ్యులకు కారు డ్రైవర్ సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. (చదవండి : కాఫీ కింగ్ అదృశ్యం) (చదవండి : వ్యాపారవేత్తగా విఫలమయ్యా... ) -
కాఫీ కింగ్ అదృశ్యం
సాక్షి, బెంగళూరు : దేశ కార్పొరేట్ ప్రపంచమంతా మంగళ వారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాఫీ కింగ్‌గా పేరొందిన ప్రముఖ వ్యాపారవేత్త, కెఫే కాఫీ డే(సీసీడీ) వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారన్న వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, వ్యాపారవేత్తగా తాను విఫలమయ్యానని పేర్కొంటూ సిద్ధార్థ సంతకంతో ఒక లేఖ బయటపడింది. అందులో ఆదాయపు పన్ను అధికారులు, పీఈ భాగస్వామ్య సంస్థ నుంచి తీవ్రమైన వేధింపులు ఉన్నాయంటూ ఆయన పేర్కొనడం పారిశ్రామిక వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. సిద్ధార్థ అదృశ్య వార్తలతో కాఫీ డే షేరు ధర 20 శాతం కుప్పకూలింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సిద్ధార్థ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? ప్రమాదవశాత్తు పడిపోయారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఇలా అదృశ్యమయ్యారు ‘సోమవారం సాయంత్రం సకలేశపురకు అని చెప్పి డ్రైవర్ బసవరాజు దేశాయితో కలసి వీజీ సిద్ధార్థ బయలుదేరారు. కానీ సకలేశపురకు చేరుకోగానే, అక్కడి నుంచి మంగళూరుకు వెళ్లు అని డ్రైవర్‌కు సూచించారు. మంగళూరు సమీపంలోని ఉల్లాల్ వద్దనున్న నేత్రావతి నది వద్దకు చేరుకోగానే కారు నిలపమని డ్రైవర్‌ను ఆదేశించారు. ఆ తర్వాత కారును వంతెనకు అటువైపు చివరకుతీసుకెళ్లి నిలిపి ఉండు, నేను నడుచుకుంటూ కారు దగ్గరికి వస్తాను అని చెప్పి దిగేశారు. అయితే వంతెనపై నడుచుకుంటూ ఎంతసేపటికీ రాకపోవడంతో డ్రైవర్ వెనక్కి వచ్చి చూడగా చుట్టుపక్కల ఎక్కడా సిద్ధార్థ కనిపించలేదు. ఫోన్ చేస్తేనేమో స్విచ్చాఫ్ అయింది. దీంతో డ్రైవర్ పోలీసులకు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు’ అని దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ సెంథిల్ శశికాంత్ సెంథిల్ పేర్కొన్నారు. అదృశ్య వార్తను సిద్ధార్థ కుమారుడికి ఫోన్ చేసి డ్రైవర్ వెల్లడించాడు.. వారు కూడా స్థానిక కాఫీడే సిబ్బందికి తెలియజేసి గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి గాలింపు ప్రారంభించింది. సిద్ధార్థ అదృశ్యంపై అతని కారు డ్రైవర్ని మంగళూరు పోలీసులు ప్రశ్నించారు. సిద్ధార్థ కాల్ డేటా ఆధారంగా అన్ని కోణాల్లోనూ విచారణ సాగిస్తున్నారు. మంగళూరులో సిద్ధార్థ బస చేసే హోటళ్లు, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని హోటల్లు, బంధువుల ఇళ్లలోనూ గాలింపు చేపట్టారు. ఆత్మహత్యా అనుమానాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆయన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు నుంచి మంగళూరుకు కారులో వెళుతున్నంత సేపు తన స్నేహితులకు ఫోన్లు చేసి ‘నన్ను క్షమించండి’ అంటూ భాగోద్వేగానికి లోనవడంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, మంగళూరు నగరంలోని డీసీపీలు హనుమంతరాయ, లక్ష్మి గణేశ్‌ల నేతృత్వంలోని సుమారు 200 మందికి పైగా పోలీసు సిబ్బంది, అధికారులు సోమవారం రాత్రి నుంచి సిద్ధార్థ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిద్ధార్థ అదృశ్యమైన నేత్రావతి నదిలో గజ ఈతగాళ్లు, 25 బోట్లు ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టారు. నది చుట్టుపక్కల కూడా వెతుకుతున్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలంలో మకాం వేసి శోధిస్తున్నారు. అలాగే వీరికి కోస్టుగార్డు సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది కూడా సాయపడుతున్నారు. స్థానిక మత్స్యకారుల సాయం కూడా తీసుకుంటున్నామని, చివరిగా ఆయన ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో కూడా చెక్ చేస్తున్నామని మంగళూరు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ వెల్లడించారు. ఎస్ఎం కృష్ణకు నేతల పరామర్శ సిద్ధార్థ అదృశ్యంతో బెంగళూరు సదాశివనగరలో ఆయన మామ ఎస్ఎం కృష్ణ ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొంది. శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య తదితరులు కృష్ణకు ధైర్యం చెప్పారు. సిద్ధార్థ నదిలో దూకడాన్ని చూశా కాఫీ డే యజమాని సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకడాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు సైమన్ డిసోజా అనే స్థానిక జాలరి తెలిపారు. తను చేపలకు వల వేస్తుండగా నీటిలోకి ఎవరో దూకిన శబ్దం వినిపించిందని మంగళవారం స్థానిక మీడియాకు తెలిపారు. తను అక్కడికి వెళ్లేలోపు దూకిన వ్యక్తి నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ లోపలికి మునిగిపోయాడని చెప్పారు. రాత్రి 7 నుంచి 7:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ అనేకం జరిగినట్లు తెలిపారు. దేశీ కాఫీ కింగ్ సిద్ధార్థ .. దాదాపు 140 ఏళ్లుగా కాఫీ వ్యాపారంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సిద్ధార్థ జీవితంలో పలు మలుపులు ఉన్నాయి. ఆయన ముందుగా భారతీయ ఆర్మీలో చేరాలనుకున్నారు. కానీ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ పట్టా తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకరుగా మారారు. 1984లో సొంతంగా శివన్ సెక్యూరిటీస్ పేరిట ఇన్వెస్ట్మెంట్, వెంచర్ క్యాపిటల్ సంస్థను ప్రారంభించారు. దాన్నుంచి వచ్చిన లాభాలతో కర్ణాటకలోని చిక్మగళూర్ జిల్లాలో కాఫీ తోటలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో కుటుంబ కాఫీ వ్యాపారంపై మరింత ఆసక్తి పెంచుకున్నారు. 1993లో అమాల్గమేటెడ్ బీన్ కంపెనీ (ఏబీసీ) పేరిట కాఫీ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు. అప్పట్లో రూ. 6 కోట్లుగా ఉన్న ఈ సంస్థ వార్షిక టర్నోవరు ఆ తర్వాత రూ. 2,500 కోట్ల స్థాయికి చేరింది. దేశీయంగా ఇది ప్రస్తుతం అతి పెద్ద గ్రీన్ కాఫీ ఎగుమతి సంస్థ. ఇక, జర్మన్ కాఫీ చెయిన్ ’చిబో’ స్ఫూర్తితో సొంత కెఫేలను కూడా సిద్ధార్థ ప్రారంభించారు. తేనీటిప్రియులను కూడా ఘుమఘుమలాడే కాఫీ వైపు మళ్లేలా చేశారు. 1994లో బెంగళూరులో తొలి కెఫే కాఫీ డే ప్రారంభమైంది. ప్రస్తుతం వియన్నా, ప్రాగ్, కౌలాలంపూర్ తదితర 200 పైచిలుకు నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా 1,750 కెఫే కాఫీ డే అవుట్‌లెట్స్ ఉన్నాయి. 2015లో కాఫీ డే పబ్లిక్ ఇష్యూకి కూడా వచ్చింది. బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్ధార్థ అంగీకరించారు: ఐటీ శాఖ అదృశ్యమైన కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థను తాము గతంలో దర్యాప్తు సందర్భంగా వేధించామన్న ఆరోపణలను ఆదాయపు పన్ను శాఖ ఖండించింది. లేఖలోని సిద్ధార్థ సంతకం, తమ దగ్గరున్న సంతకానికి చాలా తేడా ఉందని ఐటీ శాఖ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. గతంలో తాము జరిపిన సోదాల్లో తనవద్ద బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్ధార్థ అంగీకరించారని కూడా ఐటీ శాఖ తెలిపింది. భారీ మొత్తంలో పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు తగిన ఆధారాలు దొరకడంతోనే షేర్లను అటాచ్ చేశామని, 2017లో కాఫీ డే గూపు కంపెనీల్లో సోదాలను కూడా చేశామని ఐటీ అధికారులు చెప్పారు. ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారమే తాము చర్యలు తీసుకున్నామని కూడా స్పష్టం చేశారు. కాగా, మైండ్ ట్రీ షేర్ల విక్రయం ద్వారా సిద్ధార్థకు దాదాపు రూ.3,200 కోట్లు వచ్చాయని.. ఈ డీల్ విషయంలో కనీస ప్రత్యామ్నాయ పన్నుగా రూ.300 కోట్లను సిద్ధార్థ చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.46 కోట్లను మాత్రమే కట్టారని కూడా ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ వద్ద రూ.362.11 కోట్ల లెక్కలో చూపని ఆదాయం(బ్లాక్ మనీ) తో పాటు, తన వద్ద రూ.118.02 కోట్ల నగదు ఉన్నట్లు సిద్ధార్థ ఒప్పకున్నారని ఐటీ వర్గాలు వివరించాయి. సీసీడీడీలో 6% వాటా ఉంది: కేకేఆర్ సీసీడీ వ్యవస్థాపకుడు సిద్దార్థ అదృశ్యం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ పేర్కొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఒక ప్రకటన విడుదల చేసింది. సిద్దార్థపైన నమ్మకంతో సీసీడీలో తాము తొమ్మిదేళ్ల క్రితం చేసిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని గతేడాది విక్రయించామని.. దీంతో తమ వాటా 10.3 శాతం నుంచి ప్రస్తుతం 6 శాతానికి పరిమితమైనట్లు కేకేఆర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఒక పీఈ ఇన్వెస్టర్ నుంచి షేర్ల బైబ్యాక్ కోసం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నానంటూ సిద్దార్థ రాసినట్లు చెబుతున్న లేఖలో బయటపడిన నేపథ్యంలో కేకేఆర్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా పీఈ ఫండ్స్ ఏడాది నుంచి ఏడేళ్ల కాలానికి మాత్రమే పెట్టుబడులు పెట్టి వైదొలగుతుంటాయని, అయితే తాము మాత్రం సీసీడీ వృద్ధి చెందేంతవరకూ సహకారం అందించి కొంత వాటాను మాత్రమే విక్రయించామని కేకేఆర్ వివరించింది. బకాయిలేమీ లేవు: హెచ్డీఎఫ్సీ సిద్ధార్థతో సంబంధం ఉన్న కంపెనీల నుంచి తమకు రుణ బకాయిలు ఉన్నట్లు వచ్చిన వార్తలను హెచ్డీఎఫ్సీ తోసిపుచ్చింది. ‘సీసీడీకి చెందిన టాంగ్లిన్ డెవలప్మెంట్స్ బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్‌పార్క్ ప్రాజెక్టు కోసం గతంలో మేం రుణాలిచ్చాం. అయితే, 2019 జనవరిలో ఈ మొత్తం రుణాన్ని సంబంధిత సంస్థ చెల్లించేసింది. ప్రస్తుతం కాఫీడే ఎంటర్ ప్రైజెస్ గ్రూపు నుంచి మాకు ఎలాంటి బకాయిలూ లేవు’ అని హెచ్డీఎఫ్సీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నాం: సీసీడీ సిద్ధార్థ అదృశ్యంతో సీసీడీ డైరెక్టర్ల బోర్డు మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది. సిద్దార్థ రాసినట్లు బయటికొచ్చిన లేఖలోని అంశాలను సమీక్షించడంతోపాటు లేఖ కాపీలను సంబంధిత అధికారులకు అందజేసినట్లు కంపెనీ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. కాగా, వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేకుండా తగిన చర్యలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించింది. ‘సిద్దార్థ అదృశ్య సంఘటనతో మేం షాక్‌కు గురయ్యాం. ఆయన కుటుంబ సభ్యులు, ఆప్తులకు మా పూర్తి మద్దతను తెలియజేస్తున్నాం. ఆయన ఆచూకీ కోసం మేం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. నిపుణులైన నాయకత్వంలో కంపెనీ నడుస్తున్నందున వ్యాపార కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి’ అంటూ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. మైండ్‌ట్రీ డీల్‌తో రూ.3,200 కోట్లు కాఫీ దగ్గరే ఆగిపోకుండా సిద్ధార్థ కొంగొత్త వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టారు. ఇటు ఆర్థిక సేవల నుంచి అటు ఐటీ దాకా వివిధ రంగాల్లో కార్యకలాపాలు విస్తరించారు. ఐటీ రంగంలో ప్రవేశించి గ్లోబల్ టెక్నాలజీ వెంచర్స్‌ని ఏర్పాటు చేశారు. అటు ఆర్థిక సేవలు అందించే శివన్ సెక్యూరిటీస్ కింద చేతన్ ఉడ్ ప్రాసెసింగ్, బేర్‌ఫుట్ రిసార్ట్స్ (ఆతిథ్య రంగం), డార్క్ ఫారెస్ట్ ఫర్నిచర్ (కలప వ్యాపారం) పేరిట మరో మూడు అనుబంధ సంస్థలు ఏర్పాటు చేశారు. 1999లో సుబ్రతో బాగ్చీ, కేకే నటరాజన్, రోస్టో రవనన్‌లు మైండ్‌ట్రీ సంస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు సిద్ధార్థను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా తీసుకొచ్చారు ఐటీ రంగంలో సీనియర్ అయిన అశోక్ సూతా. ఒక దశలో మైండ్‌ట్రీలో ఆయన అతి పెద్ద వాటాదారు కూడా. ఈ ఏడాది మార్చిలోనే తనకున్న 20.41 శాతం వాటాలను లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ)కి విక్రయించారు. ఈ వివాదాస్పద డీల్ ద్వారా రూ. 3,200 కోట్లు వచ్చాయి. దాదాపు రూ. 2,900 కోట్ల రుణభారాన్ని ఈ నిధులతో తగ్గించుకున్నారు. అప్పుల కుప్ప.. కాఫీ డే కాఫీ డే చెయిన్ మాతృ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు ఈ ఏడాది మార్చి నాటికి రూ. 6,550 కోట్ల మేర రుణభారం పేరుకుపోయింది. రుణాలతో పాటు నష్టాలు కూడా భారీగా పెరిగిపోయాయి. దేశీయంగా కాఫీ ఉత్పత్తి తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధరలు 13 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కీలకమైన సిద్ధార్థ వ్యాపారాన్ని గట్టిగానే దెబ్బతీసింది. అయితే, రుణాల భారాన్ని తగ్గించుకునేందుకు మైండ్‌ట్రీలో వాటాలు విక్రయించేసిన సిద్ధార్థ.. ఇతర వ్యాపారాల్లో కూడా వాటాలను విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నారు. రూ. 10,000 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువతో కెఫే కాఫీ డే (సీసీడీ)లో కొంత వాటాలను కోక కోలా సంస్థకు అమ్మేసేందుకు చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి. రియల్టీ రంగంలో సిద్ధార్థ నెలకొల్పిన టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో దాదాపు రూ. 2,800 కోట్లతో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా : సిద్దార్థ
బెంగళూరు : కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ అదృశ్యం సంచలనంగా మరింది. సోమవారం రాత్రి దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్ బ్రిడ్జిపై ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన సిద్దార్థ కనిపించకుండా పోయారు. దీంతో ఆయన నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ఆచూకీ కోసం నదిలో అధికారులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. అయితే తను ఇంట్లో నుంచి వెళ్లే ముందు కాఫీ డే ఉద్యోగులకు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు ఓ లేఖను రాసినట్టుగా తెలుస్తోంది. అందులో తాను పారిశ్రామికవేత్తగా విఫలమైనట్టుగా ఆయన పేర్కొన్నారు. గతంలో ఇన్కమ్ ట్యాక్స్ డీజీగా పనిచేసిన వ్యక్తి నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలిపారు. ‘37 ఏళ్లుగా ఎంతో కష్టపడి నిబద్ధతతో పనిచేశాను. మన కంపెనీల్లో ప్రత్యక్షంగా 30 వేల మందికి, బయట మరో 20 వేల మందికి ఉపాధి కల్పించాను. కానీ ప్రస్తుతం ఎంత ప్రయత్నించినా వ్యాపారాన్ని లాభాల బాట పట్టించలేకపోతున్నాను. ఓ ప్రయివేటు ఈక్విటీలోని షేర్లను బైబ్యాక్ చేయమని వాటాదారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నాను. ఇంతకు ముందు ఇన్కమ్ ట్యాక్స్ డీజీగా పనిచేసిన వ్యక్తి నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాను. మీ అందరు నాపై ఉంచిన నమ్మకాన్ని కాదని వెళ్తున్నందుకు క్షమించండి. ఎవరిని మోసం చేయాలనేది, తప్పుదోవ పట్టించాలనేది నా ఉద్దేశం కాదు. తప్పులన్నింటికీ నా ఒక్కడిదే బాధ్యత. నేను జరిపిన ఆర్థిక లావాదేవీల గురించి నా టీమ్‌కు, ఆడిటర్లకు, మేనేజ్మెంట్కు తెలియదు. మీరంతా కొత్త యాజమాన్యంతో కలిసి ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఓ వ్యాపారవేత్తగా నేను విఫలమయ్యాను. ఏదో ఒక రోజు మీరంతా నన్ను అర్థం చేసుకుని క్షమిస్తారని అనుకుంటున్నాన’ని సిద్దార్థ లేఖలో పేర్కొన్నారు. కాగా, సిద్దార్థ చిక్‌మంగళూర్‌లో జిల్లాలో జన్మించారు. అతని తల్లిదండ్రులు కాఫీ తోటలను పెంచేవారు. దీంతో సిద్దార్థ కూడా ఆ రంగంలోకి ప్రవేశించారు. 1996లో తొలి కేఫ్ కాఫీ డేను ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని చాలా అభివృద్ధి చేశారు. కేఫ్ కాఫీ డేను అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చారు. దేశంలో ‘కాఫీ కింగ్’గా పేరొందారు. సిద్దార్థ ఇటీవల మైండ్ ట్రీ కంపెనీలో తనకున్న వాటాలను రూ. 3 వేల కోట్లకు అమ్మేశారు. కేఫ్ కాఫీ డేను కోకా కోలా కంపెనీకి అమ్మేందుకు సిద్దార్థ చర్చలు జరిపినట్టుగా వార్తలు వచ్చాయి. సిద్దార్థ బీజేపీ నాయకుడు ఎస్ఎం కృష్ణ పెద్ద కుమార్తె మాళవికను వివాహం చేసుకున్నారు. చదవండి : మాజీ సీఎం అల్లుడు అదృశ్యం -
మాజీ సీఎం అల్లుడు అదృశ్యం
మంగళూరు : కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ అదృశ్యమయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. అయితే సిద్దార్థ దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్ బ్రిడ్జిపై నుంచి నేత్రావతి నదిలోకి దూకి ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. అతని డ్రైవర్ చెప్పిన కథనం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఉంది. దీంతో పోలీసులు నదిలో బోట్ల సాయంతో గాలింపు చేపట్టారు. అయితే గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో భారీగా నీటి ప్రవాహం ఉంది. దీంతో పోలీసుల గాలింపుకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు సిద్దార్థ ఆచూకీ లభించలేదు. మరోవైపు అతని ఫోన్ కూడా అందుబాటులో లేనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ‘సిద్దార్థ సోమవారం బెంగళూరు నుంచి సకలేశ్‌పూర్‌కు కారులో బయలుదేరారు. కానీ డ్రైవర్‌ను మంగళూరుకు పోనివ్వమన్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఉల్లాల్ బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లమని డ్రైవర్‌కు తెలిపాడు. అయితే సాయంత్రం ఏడు గంటల సమయంలో బ్రిడ్జి సమీపంలో కారును పార్క్ చేయమని డ్రైవర్‌కు చెప్పిన సిద్దార్థ.. తాను బ్రిడ్జిపై వాకింగ్‌కు వెళ్తున్నట్టు చెప్పాడు. చాలా సేపయిన సిద్దార్థ తిరిగి రాకపోవడంతో డ్రైవర్ అతని కుటుంబసభ్యులకు, పోలీసులకు ఈ సమాచారం అందించాడ’ని తెలిపారు. ఈ విషయం తెలిసుకున్న కర్ణాటక సీఎం యడియూరప్ప, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్, బీఎల్ శంకర్లు బెంగళూరులోని ఎస్ఎం కృష్ణ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు సిద్దార్థ ఆచూకీ కోసం నేత్రావతి నదిలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు 200 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. అలాగే స్థానిక మత్య్సకారుల సాయం కూడా తీసుకుంటున్నారు. -
అనారోగ్యంతో మాజీ సీఎం సోదరుడు మృతి
సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం. కృష్ణ సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ ఎస్.ఎం. శంకర్ (82) అనారోగ్యంతో మరణించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. మండ్య జిల్లాలోని సొంతగ్రామం సోమనహళ్లిలో అంత్యక్రియలు నిర్వహించడానికి శంకర్ కుటుంబ సభ్యులు పార్థివదేహాన్ని అక్కడికి తరలించారు. అనంతరం రెండు గంటల పాటు గ్రామంలోని మల్లయ్య విద్యాసంస్థ ఆవరణలో శంకర్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు మండ్య ఎంపీ సుమలత పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. -
నమ్మకాలకు విలువిస్తాం
పతనంతిట్ట: ప్రజలు తమ నమ్మకాలను, మనోభావాలను వ్యక్తపరిచేందుకు తాము అనుమతిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలో అన్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడాన్ని ఎన్నికల అస్త్రంగా మలుచుకోవాలని బీజేపీ చూస్తున్న తరుణంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే తన ప్రసంగంలో రాహుల్ ఎక్కడా శబరిమల అంశాన్ని నేరుగా ప్రస్తావించలేదు. శబరిమల అంశానికి సంబంధించి ఆందోళనలు మొదలైన పతనంతిట్టలో రాహుల్ మంగళవారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. మనసులో ఉన్న దానిని ప్రజలు బయటపెట్టగలిగే స్వేచ్ఛ ఉన్న దేశాన్ని తమ పార్టీ కోరుకుంటోందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తుండటం తెలిసిందే. ఇతర ప్రజల నమ్మకాలను కేరళ గౌరవిస్తుంది కాబట్టి తాను పోటీ చేసేందుకు వాయనాడ్‌ను ఎంచుకున్నట్లు రాహుల్ తెలిపారు. అనంతరం కొల్లాం జిల్లాలోనూ రాహుల్ ప్రచారం నిర్వహించారు. అక్కడ మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్‌ల చేతిలో దేశం దాడికి గురవుతోందనీ, తమకు వ్యతిరేక గొంతుక దేశంలో వినిపించకూడదని వారు అనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. దేశ పాలన ప్రజల చేతిలో ఉండాలి కానీ ఒక వ్యక్తి లేదా ఒక సిద్ధాంతం చేతిలో కాదని అన్నారు. గతవారం మరణించిన కేరళ కాంగ్రెస్ (ఎం) నాయకుడు కేఎం మణి కుటుంబసభ్యులను రాహుల్ పరామర్శించారు. మణి కేరళలో ప్రముఖ నాయకుల్లో ఒకరనీ, కేరళ ప్రజల పక్షాన ఆయన ఎంతో పోరాడారని రాహుల్ గుర్తుచేసుకున్నారు. కాగా, వాయనాడ్‌లో రాహుల్ బుధవారం ప్రచారం చేయనున్నారు. రాహుల్ ‘అపరిమిత అవివేకి’:ఎస్ఎం కృష్ణ బెంగళూరు: రాహుల్ గాంధీ ‘అప్రబుద్ధ అన్లిమిటెడ్’(అపరిమిత అవివేకి) అంటూ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ విమర్శించారు. రఫేల్ కేసుకు సంబంధించి రాహుల్ సొంతంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఆ విషయాలను సుప్రీంకోర్టే చెప్పిందని ప్రసంగాల్లో పేర్కొనడం, అనంతరం కోర్టు రాహుల్‌కు మొట్టికాయలు వేయడం తెలిసిందే. దీనిపై కృష్ణ మాట్లాడుతూ ‘ఎవరైనా ఓ పెద్ద పదవికి చేరుకున్నప్పుడు, ప్రత్యేకించి 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నవారు, ఏదైనా మాట్లాడేటప్పుడు ఎంతో ఆలోచించుకోవాలి. అది పరిణతికి చిహ్నం. కానీ ఈరోజు మనం చూస్తున్న వ్యక్తి అపరిమిత అవివేకి’ అని ఎస్ఎం కృష్ణ వ్యాఖ్యానించారు. -
రాహుల్ ప్రవర్తన నచ్చకే...: ఎస్ఎం
బెంగళూరు : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మాజీమంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రవర్తన నచ్చకే తాను మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు. నిన్న మాండ్యలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎస్ఎం కృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం పార్టీలో 80ఏళ్లు దాటిన వృద్ధులను కేబినెట్ నుంచి తొలగించాలంటూ రాహుల్ అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా విదేశాంగ మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కేబినెట్‌పై ఏమాత్రం అధికారం లేదని, అధికారం మొత్తం రాహుల్ చేతుల్లోనే ఉండేదని ఎస్ఎం కృష్ణ విమర్శించారు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా అవినీతి, కుంభకోణాలు చోటుచేసుకున్నాయన్నారు. పదేళ్ల క్రితం రాహుల్ ఎంపీగా మాత్రమే ఉన్నారని, ఆయన ఎలాంటి పార్టీ పదవులు చేపట్టకపోయినా... అన్ని విషయాల్లో తలదూర్చేవారని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటికీ ఆయనకు తెలియకుండానే రాహుల్ పలు నిర్ణయాలు తీసుకునేవారని ఎస్ఎం కృష్ణ వ్యాఖ్యానించారు. దేశానికి మరో అయిదేళ్లు నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమని అభిప్రాయపడిన ఆయన..మోదీ సర్కార్‌లో ఎలాంటి అవినీతి, కుంభకోణాలు జరగలేదన్నారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయాక కూడా రాహుల్ పెత్తనం తగ్గలేదని, అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా ఎస్ఎం కృష్ణ 2017 మార్చిలో బీజేపీలో చేరిన విషయం విదితమే. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ యువ నాయకత్వం కోసం పార్టీలోని సీనియర్ నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని మరోసారి స్పష్టం చేశారు. -
రంగంలోకి ఎస్ఎం కృష్ణ తనయ
సాక్షి, బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడుడు ఎస్ఎం కృష్ణ కుమార్తె శాంభవి ఈసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. బెంగళూరులో శాంతినగర లేదా యశవంతపుర నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ టికెట్‌తో పోటీ చేసే అవకాశముంది. కేంద్రమంత్రులు అనంతకుమార్, ప్రకాష్ జవదేకర్ రెండురోజుల క్రితం సదాశివనగర్‌లో శాంభవితో సమావేశమయ్యారు. శాంభవిని పోటీకి నిలపాలని వారు ఎస్ఎం కృష్ణను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. కాగా, శాంభవికి టికెట్ కోసం ఎస్ఎం కృష్ణ ముందునుంచీ ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరినా పెద్దగా దక్కిన తాయిలాలు లేవనే చెప్పాలి. పైగా ఆయన అల్లుడు సిద్ధార్థ్‌కు చెందిన రెస్టారెంట్లు, ఆస్తులపై ఐటీ శాఖ భారీఎత్తున దాడులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కృష్ణ ముభావంగా ఉంటున్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడం లేదు. అక్కడే ఎందుకంటే.. ఎస్ఎం కృష్ణ ఒక్కళిగ. యశవంతపుర నియోజకవర్గంలోనూ ఒక్కళిగ కులస్తులు ఎక్కువగా ఉండటంతో అక్కడ పోటీ చేస్తే కూతురికి కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. శాంతినగర నియోజకవర్గంలో సంపన్న, మధ్యతరగతి జనాభా అధికం. అక్కడ అయినా ఫర్వాలేదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా బెంగళూరు, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో ప్రచారం చేయాలని ఎస్ఎం కృష్ణను ఈ సందర్భంగా కేంద్రమంత్రులు కోరినట్లు సమాచారం. -
సొంత గూటికి మాజీ ముఖ్యమంత్రి..!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నువ్వా నేనా అంటూ కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. పార్టీ అధినేతలతో రోడ్ షో లు నిర్వహిస్తూ గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది బీజేపీలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేకమార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్.ఎం. కృష్ణ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, స్పీకర్‌గా, గవర్నర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాహుల్ గాంధీ పార్టీలోని సీనియర్ నాయకులకు తగిన గౌరవం ఇవ్వడంలేదని భావించిన కృష్ణ గతేడాది బీజేపీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన కూతురు శాంభవి రాజరాజేశ్వరనగర అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించారని, బీజేపీ ఇందుకు నిరాకరించడంతో కృష్ణ పార్టీని వీడేందేందుకు సిద్ధపడ్డారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మానసికంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయిన కృష్ణ కాషాయ పార్టీలో ఇమడలేకపోతున్నారని, తనకు తగిన ప్రాధాన్యం లభించడంలేదని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర మాట్లాడుతూ.. కృష్ణను పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవన్నీ ఊహాగానాలే: బీజేపీ ఎస్.ఎం. కృష్ణ పార్టీ సమావేశాలకు, ఫంక్షన్లకు హాజరుకావడం లేదని, పార్టీలో ఆయనకు తగిన స్థానం ఇవ్వడం లేదా అన్న విలేకరుల ప్రశ్నకు సమాధానంగా... అలాంటిదేమీ లేదని బీజేపీ పేర్కొంది. ఓల్డ్ మైసూర్లో బలహీనంగా ఉన్న బీజేపీ.. కృష్ణను రంగంలోకి దింపడం ద్వారా వొక్కలిగ ఓట్లను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోన్న నేపథ్యంలో ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేసింది. కాగా ఈ విషయమై ఎస్.ఎం. కృష్ణ వ్యక్తిగత సిబ్బందిని ప్రశ్నించగా తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. -
అల్లుడి ఆస్తులు రూ.650 కోట్లు!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణ అల్లుడు, కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఇళ్లు, కార్యాలయాల్లో జరుగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ముగిశాయి. గురువారం నుంచి జరిగిన ఈ సోదాల్లో దాదాపు రూ.650 కోట్ల కంటే ఎక్కువ స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిద్ధార్థ కాఫే కాఫీ డేతో పాటు పలు టూరిజం, ఐటీ సంస్థలను నడుపుతున్నారు. నోట్ల రద్దు జరిగిన సమయంలో ఆయా సంస్థల నుంచి పెద్ద ఎత్తున వివిధ బ్యాంకుల్లో సొమ్ములను డిపాజిట్ చేసినట్లు ఐటీ అధికారులకు ఉప్పందింది. ఈ నేపథ్యంలో బెంగళూరు, హాసన్, చిక్మగుళూరు, చెన్నై, ముంబైలోని సిద్ధార్థకు చెందిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ‘సిద్ధార్థకు సంబంధించిన కాఫీ టూరిజం, ఇన్పర్మేషన్ టెక్నాలజీ, ఇతర కార్యాలయాల్లో సోదాలు జరిపాం. రూ.650 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించాం. మరిన్ని ఆస్తులు వెలుగు చూసే అవకాశముంద’ని ఆదాయపన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐటీ దాడులపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఎంఎస్ కృష్ణ ఇంకా స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ల పాటు కొనసాగిన ఎంఎస్ కృష్ణ ఇటీవలే బీజేపీలో చేరారు. అంతకుముందు కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఐటీ శాఖను అడ్డుపెట్టుకుని తమ నాయకులపై రాజకీయ కక్ష సాధిస్తోందని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించింది. ఎంఎస్ కృష్ణ అల్లుడిపైనా ఐటీ దాడులతో కేంద్రం ప్రమేయం లేదని రుజువైందని బీజేపీ అంటోంది. -
ఎస్ఎం కృష్ణ అల్లుడికి ఐటీ షాక్
సాక్షి, బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థకి ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. సిద్ధార్థకు చెందిన పలు ప్రదేశాల్లో ఐటీ రైడ్స్ చేపట్టింది. బెంగళూరు, ముంబై, చెన్నై, చిక్మగళూర్తో సహా 20కి పైగా ప్రాంతాల్లో ఐటీ రైడ్స్ జరుపుతోంది. కృష్ణ అల్లుడు సిద్ధార్థ కేప్ చైన్ కేఫ్ కాఫీ డే యజమాని. బెంగళూరులో కేప్ చైన్ కేఫ్ కాఫీ డే ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలో కూడా ఐటీ తనిఖీలు చేపడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన ఎస్ఎం కృష్ణ ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. -
ఎస్ఎం కృష్ణ అల్లుడికి ఐటీ షాక్
-
‘ఇంత దరిద్రమైన పాలన ఎప్పుడూ లేదు’
మైసూరు: కర్ణాటకలో అనేక మంది ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలను చూశాను కాని ఇలా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని మాజీ సీఎం, బీజేపీ నేత ఎస్ఎం కృష్ణ అన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఎటువంటి లక్ష్యం, ముందుచూపు లేవని విమర్శించారు. సోమవారం మైసూరు జిల్లా నంజనగూడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ ప్రసాద్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూస్తుంటే ప్రజల కోసం రోజు 24 గంటలూ పనిచేసేలా లేదని అన్నారు. ఉదయం కార్యాలయానికి వచ్చి సాయంత్రం మళ్లీ తాళం వేసుకుని వెళ్లేలా ఉందని ఎద్దేవా చేశారు. నేను చూసిన అతి దరిద్రమైన పరిపాలన, ప్రభుత్వం సిద్ధరామయ్యదే అని విమర్శించారు. తన ఐదున్నరేళ్ల రాజకీయ జీవితంలో ఇంత అధ్వాన్న ప్రభుత్వాన్ని చూడలేదని ధ్వజమెత్తారు. ఆయన పరిపాలన చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదీ అని వెతుక్కునే పరిస్థితి ఉందన్నారు. మీడియా కూడా కాంగ్రెస్ పార్టీవారికి సహకరించాలని చమత్కరించారు. తాను ఎలాంటి ఆశలు పెట్టుకుని బీజేపీలోకి రాలేదని చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ ఎస్ఎం కృష్ణ రాష్ట్ర పారిశ్రామిక మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎస్ఎం కృçష్ణను కలువడానికి వెళ్ళానని అన్నారు. మైసూరు నగరంలో ఉన్న జలదర్శిని గెస్ట్‌హౌస్‌కు వెళ్ళి ఆయన కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయని అన్నారు. అలాంటి నేత రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బీజేపీ నాయకులు పెద్దసంఖ్యలో వచ్చి రైల్వేస్టేషన్లో కృష్ణకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గుండ్లుపేట వెళ్లారు. అక్కడ కూడా ప్రచారసభల్లో పాల్గొన్నారు. -
త్వరలో మా పార్టీలోకి 20మంది బీజేపీ నేతలు!
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో వరుస వలసలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీ అగ్రనేత, మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీ గూటిలోకి చేరగా.. మాజీ మంత్రులైన శ్రీనివాస్ ప్రసాద్, కుమార్ బంగారప్ప, కే జయప్రకాశ్ హెగ్డే వంటి నేతలు కూడా హస్తాన్ని వీడి.. కాషాయ కండువాను కప్పుకున్నారు. ఈ వలసల్లో కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. త్వరలోనే దాదాపు 20 మంది బీజేపీ నేతలు, మరికొందరు జేడీఎస్ నేతలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. గతంలోనే ఈ విషయాన్ని చెప్పిన పరమేశ్వర తాజాగా గురువారం తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నేతలు, జేడీఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాన్ని ప్రజలకు తెలిపేందుకు తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు? వారు ఏ ప్రాంతానికి చెందినవారు? అన్నది త్వరలోనే క్లారిటీ ఇస్తామని ఆయన చెప్పారు. ఇంతకు ఎంతమంది బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరబోతున్నారు? వారు చోటామోటా నేతలా? లేక బడా నేతలా? అంటు కర్ణాటక కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. -
ఆయన చేరికతో అదనంగా 40 సీట్లు గెలుస్తాం
బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌లో ఘనవిజయం సాధించడంతో జోష్ మీదున్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో కాషాయ జెండా ఎగరేయాలని దృష్టిసారిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ చేరికతో తమకు విజయావకాశాలు మరింత పెరిగాయని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో 224 అసెంబ్లీ సీట్లకు గాను 150 సాధించడం తమకు కష్టంకాదని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కృష్ణ చేరిక వల్ల తమ పార్టీ అదనంగా 40 సీట్లు గెలుస్తుందని చెప్పారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో పనిచేసిన కృష్ణ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీలోకి కృష్ణ చేరడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని యడ్యూరప్ప ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు ఎస్ఎం కృష్ణ బెంగళూరు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన హయాంలోనే ఐటీ రంగం అభివృద్ధి చెందిందని తెలిపారు. దీంతో బెంగళూరు ప్రజల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉందని, ఇది తమ పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కర్ణాటకలో బీజేపీని గెలిపిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని, ఇందులో సందేహం లేదని యడ్యూరప్ప చెప్పారు. -
రంగంలోకి కృష్ణ వారసురాలు!
బెంగళూరు: మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ బీజేపీలోకి చేరడంతో ఆయన కుమార్తె శాంభవి సిద్ధార్థ బీజేపీ తరపున రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించడం దాదాపుగా ఖాయమయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరు రాజరాజేశ్వరినగర్ నియోజకవర్గం టికెట్‌ను ఆమెకు ఇవ్వాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా బీజేపీ మరింత బలోపేతమవుతోందని ఆశిస్తున్నారు. కృష్ణకు ఆమే వారసురాలుగా ప్రచారంలో ఉంది. తన కుమార్తెకు కానీ, అల్లుడికి కానీ బీజేపీ టికెట్ ఇవ్వాలని కోరలేదని, అప్పగించిన భాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే ముఖ్య కర్తవ్యమని ఎస్ఎంకృష్ణ చెబుతున్నారు. కాగా ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. నేడు నగరానికి ఎస్ఎం కృష్ణ మరోవైపు ఎస్ఎం కృష్ణ ఇవాళ (శుక్రవారం) బెంగళూరు రానున్నారు. నంజనగూడు, గుండ్లుపేట ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారని బీజేపీ సీనియర్‌నేత ఆర్.అశోక్ తెలిపారు. ఢిల్లీ నుంచి నగరానికి చేరుకోనున్న ఆయనను ఊరేగింపుగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేయగా, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు వస్తాయని కృష్ణ వారించారని చెప్పారు. ఎయిర్‌పోర్టు నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ నేతలతో సమావేశమవుతారని తెలిపారు. -
కృష్ణ పెద్ద తప్పు చేశాడు!
ఇంతటి వృద్ధ వయస్సులోనూ సిద్ధాంతాలను పక్కనబెట్టి పార్టీ మారడం ద్వారా కర్ణాటక మాజీ సీఎం, సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ పెద్ద తప్పు చేస్తున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. బీజేపీలో చేరాలన్న ఆయన నిర్ణయం తమను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ ఆయనకు అన్ని పదవులు ఇచ్చి.. అన్ని రకాలుగా గౌరవించిందని పేర్కొన్నారు. ’ఆయనకు పార్టీ అన్ని ఇచ్చింది. అన్ని రకాల పదవులు, గౌరవాలు పొందిన అతికొద్దిమంది కాంగ్రెస్ నేతల్లో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియడం లేదు’ అని కాంగ్రెస్ నేత ఖర్గే అన్నారు. ’ 50 ఏళ్లుగా అనుసరిస్తున్న భావజాలపరమైన సిద్ధాంతాలను ఆయన మార్చుకోవడానికి కారణం ఏమిటో నాకు తెలియదు. ఇంకా జీవితంలో కొన్నిరోజలు మాత్రమే మిగిలి ఉన్న దశలో ఆయన నమ్మిన సిద్ధాంతాలను వదులుకోవడం ద్వారా పెద్ద తప్పు చేస్తున్నారు’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా, కేంద్రమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేక పదవులు చేపట్టిన ఎస్ఎం కృష్ణ తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన బుధవారం బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. -
కృష్ణకు బీజేపీ తీర్థం!
సాక్షి, బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణ ఈ నెల 15న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుంది. అటుపై బెంగళూరుతో పాటు మైసూరు, మండ్యా తదితర ప్రాంతాల్లో జరిగే సభల్లో ఆయన రాజకీయ అనుచరులు బీజేపీలో చేరతారు. గుండ్లుపేట, నంజనగూడు ఉప ఎన్నికల ప్రచారంలోనూ ఎస్.ఎం కృష్ణ పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన వెంటనే ఆయనను పార్టీలో చేరాలని బీజేపీ ఆహ్వానించడం తెలిసిందే. భవిష్యత్‌లో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆయన అందుకు సమ్మతించారు. ఆయన గవర్నర్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అమిత్‌షా నుంచి స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికల్లో బెంగళూరుతో పాటు దక్షిణ కర్ణాటకలో బీజేపీ గెలుపు తన బాధ్యత అని ఎస్ఎం కృష్ణ భరోసా ఇచ్చినట్లు కమలనాథులు చెబుతున్నారు.