
ప్రతీకాత్మక చిత్రం
వైఎస్సార్ కడప : జిల్లాలోని రాయచోటిలో దారుణం చోటుచేసుకుంది. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం..! అనే తీరుగా కొందరు వ్యవహరించారు. చనిపోయిన వ్యక్తికి చెందిన ఆస్తులను కొందరు దుండగులు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ ఘటనలో రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది ముఖ్య పాత్ర ఉందని తెలుస్తోంది. లంచాలు తీసుకుని మృతుని ఆస్తులను వేరొకరికి రిజిస్టర్ చేశారనీ, ఘటనలో ప్రమేయమున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.42.23 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా, పరారీలో ఉన్న మరో ఇద్దరి నిందితుల్లో ఒకరు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment