fake registrations
-
మరణించిన వారు వచ్చి రిజిస్ట్రేషన్!
జడ్చర్ల: వారు మరిణించి దశాబ్దాంన్నరకు పైగానే గడిచింది. కానీ వారి పేరున ఉన్న వ్యవసాయ భూములు మాత్రం వారే వచ్చి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇది నమ్మలేకున్నా జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. చివరకు పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తేటతెల్లం కావడంతో ఇలాంటి మోసాలకు పాల్పడిన నిందితులు కటకటాలపాలయ్యారు. జడ్చర్ల రూరల్ సీఐ శివకుమార్ కథనం మేరకు.. రాజాపూర్ మండలం తిరుమలిగిరికి చెందిన పాత్లావత్ ఘాన్సీబాయికి సర్వే నంబర్లు 189, 208, 211, 212, 200లో 5.18 ఎకరాల భూమి ఉంది. అదేవిదంగా పాత్లావత్ కేశవులుకు సర్వే నంబర్లు 200/1యు, 212/ఆర్యు, 211/1యులలో 4.04 ఎకరాల భూమి ఉంది. అయితే వీరు దాదాపు 15సంవత్సరాల క్రితమే మరణించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన పాత్లావత్ దీప్లా, పాత్లావత్ రమేశ్, పాతాల్వత్ అంబ్రి, సీత్యాలు తప్పుడు ఆధార్ కార్డులు, తదితర పత్రాలు సృష్టించి 2010లో ఇతరులు పేరున వారి భూమిని జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఆధార్ కార్డుల్లో ఫొటోలు మార్చి రిజిస్ట్రేషన్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 2018లో ఘాన్సీబాయి కూతురు జమున, తదితరులు బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం గురువారం వారిని రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితులకు సహకరించిన అప్పటి వీఆర్ఓ, సర్పంచ్, తదితరులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఈసందర్భంగా సీఐ వెల్లడించారు. -
చనిపోయిన వ్యక్తి ఆస్తుల రిజిస్ట్రేషన్!
వైఎస్సార్ కడప : జిల్లాలోని రాయచోటిలో దారుణం చోటుచేసుకుంది. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం..! అనే తీరుగా కొందరు వ్యవహరించారు. చనిపోయిన వ్యక్తికి చెందిన ఆస్తులను కొందరు దుండగులు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ ఘటనలో రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది ముఖ్య పాత్ర ఉందని తెలుస్తోంది. లంచాలు తీసుకుని మృతుని ఆస్తులను వేరొకరికి రిజిస్టర్ చేశారనీ, ఘటనలో ప్రమేయమున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.42.23 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా, పరారీలో ఉన్న మరో ఇద్దరి నిందితుల్లో ఒకరు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫేస్బుక్ ఫ్రెండ్‌తో కలిసి ఆస్తి కాజేశారు!
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : సత్యనారాయణపురం సీతన్నపేటలోని 176 గజాల ఆస్తికి చెందిన హక్కుదారు ఫొటోలు మార్చి నకిలీ పత్రాలతో ఆ ఆస్తిని విక్రయించిన కేసులో 8 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్తిదారు మహిళ స్థానంలో చెన్నైకి చెందిన ఓ యువతి, నాటి గన్నవరం రిజిస్ట్రార్‌తో పాటు మరో ఆరుగురు ఈ కేసులో సూత్రధారులుగా పోలీసులు తేల్చారు. అద్దెదారుడి సలహా..కథ నడిపిందంతా పరిచయస్తుడే.. రామవరప్పాడుకు చెందిన చింతమనేని జగదీష్‌కు సత్యనారాయణపురం సీతన్నపేటలో 176 గజాల స్థలం ఉంది. దాన్ని ఆయన 2002లో సుబ్బరాజు (56) కు 2009 వరకూ అగ్రిమెంట్ చేసుకొని అద్దెకు ఇచ్చారు. అయితే కొంతకాలానికే జగదీష్ మృతి చెందగా ఆమె కుమార్తె చింతమనేని సాహితికి వీలునామా ద్వారా ఆ ఆస్తి సంక్రమించింది. ఒప్పందం ముగిశాక సాహితీ అద్దెల కోసం సుబ్బరాజు వద్దకు పలుమార్లు వెళ్తుండగా ఆయన సమాధానం చెప్పకుండా తిరుగుతూ కాలయాపన చేశాడు. జగదీష్ చనిపోయిన తర్వాత ఆ ఆస్తిపై సుబ్బరాజుకు కన్ను పడింది. ఎలా కాజేయాలా అని ఆలోచనలు చేస్తుండగా మురళీనగర్‌కు చెందిన కళ్లేపల్లి సీతారామరాజు (32) పరిచయమయ్యాడు. అతను తన బంధువు, స్నేహితులతో కలిసి మిగిలిన కథ మొత్తం నడిపించాడ. ఫేస్బుక్ స్నేహితురాలిని చూపి రిజిస్ట్రేషన్.. పక్కా ప్రణాళికను రూపొందించిన సీతారామరాజు తనకు ఫేస్బుక్లో పరిచయమైన చెన్నైకు చెందిన అనుశ్రీ అనే యువతిని సాహితిగా చూపించేందుకు ప్లాన్ వేశాడు. ఆమెతో చింతమనేని సాహితిగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేయించాడు. తర్వాత గన్నవరం రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బందిని పట్టుకొని అప్పటి సబ్ రిజిస్ట్రార్ డి.సాయిమోహన్రెడ్డితో బేరం కుదుర్చుకున్నాడు. ఆధార్ కార్డు దరఖాస్తు ఎన్రోల్మెంట్ కాపీ పెట్టి 176 గజాల ఆస్తిని యనమలకుదురుకు చెందిన తన బావమరిది కళ్లేపల్లి వంశీరాజు (30) కు విక్రయించినట్లుగా రిజిస్టర్ చేయించాడు. ఆ తర్వాత వంశీరాజు నుంచి సీతారామరాజు కొనుగోలు చేసినట్లు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ డాక్యుమెంట్లను రూ.35 లక్షలకు ఓ మహిళ దగ్గర తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నారు. కొన్ని రోజులకు ముత్యాలంపాడుకు చెందిన కవులూరి లక్ష్మీనారాయణ (50) వద్ద డబ్బులు తీసుకొని మహిళ రుణం తీర్చి కాగితాలు తీసుకున్నాడు. అదే రోజు విజయవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లక్ష్మీనారాయణకు ఆస్తిని విక్రయించాడు. తర్వాత లక్ష్మీనారాయణ ఆ డాక్యుమెంట్స్‌తో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే సంస్థలో రూ.1.30 కోట్లు రుణం తీసుకున్నాడు. లోన్ సరిగా చెల్లించకపోవడంతో ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్లు ఇంటికి నోటీసులు అంటించడంతో అసలు ఆస్తిదారైన చింతమనేని సాహితి దృష్టికి ఈ తతంగం అంతా వెళ్లింది. దీనిపై ఈసీ ద్వారా ఆరా తీసిన ఆమె జరిగిన మోసం గురించి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీతారామరాజు, సుబ్బరాజు, వంశీరాజు, లక్ష్మీనారాయణలతో పాటు ఫేస్బుక్ స్నేహితురాలైన అనుశ్రీ, నాటి గన్నవరం సబ్ రిజిస్ట్రార్ డి.సాయిమోహన్‌రెడ్డి, విట్నెస్ సంతకాలు పెట్టిన పన్నీర్కుమార్, కళ్లేపల్లి పవన్కుమార్వర్మలపై కేసు నమోదు చేశారు. నిందితుల అరెస్టుపై గోప్యత నిందితుల వివరాలు వెల్లడించడంపై పోలీసులు గోప్యంగా వ్యవరించారు. కేసు నమోదు చేసినప్పుడు అదుపులోకి తీసుకున్న ఏ1 సీతారామరాజు, ఏ2 సుబ్బరాజు, వంశీరాజు, లక్ష్మీనారాయణలనే అరెస్టు చూపించి మీడియాకు తెలియకుండా మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. మిగిలిన నిందితుల కోసం గా>లిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. -
నకిలీ రిజిస్ట్రేషన్లు : 15 మంది అరెస్ట్
-
నకిలీ రిజిస్ట్రేషన్లు : 15 మంది అరెస్ట్
చౌటుప్పల్: యాదాద్రి జిల్లాలో నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా నగదు, పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ పోలీసు స్టేషన్లో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీబీనగర్ మండలం రాఘవపురంలో వ్యాస్ అనే ఎన్ఆర్ఐకు 24 ఎకరాల స్థలం ఉంది. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ప్రభుత్వంతో అంగీకారం చేసుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకుని హైదరాబాద్‌లోని మారేడుపల్లిలో ఉంటున్నారు. అయితే ఆ స్థలంపై కొందరి కన్నుపడింది. మహేష్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ తీరులో జితేందర్ కుమార్ భండారి అనే వ్యక్తిని స్థలం యజమాని అంటూ గ్రామస్తులకు పరిచయం చేశాడు. మహేష్ మరో 21 మంది ముఠాగా ఏర్పడి డాక్యుమెంట్ రైటర్ ద్వారా నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నాడు. విషయం తెలిసిన అసలు ఎన్ఆర్ఐ వారం క్రితం రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లి జరిగిన మోసాన్ని తెలుసుకుని రాచకొండ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు 15 మంది యువకులను అరెస్టు చేశారు. వీరినుంచి రూ. 8 లక్షల నగదు, పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురిని పట్టుకోవాల్సి ఉందని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. -
మంగళగిరిలో ఆర్టీవో అధికారుల మాయ