స్పాలో ఉద్యోగం ఆశచూపి.. | Girl Lured With Spa Job Offer In Delhi Confined And Raped | Sakshi
Sakshi News home page

స్పాలో ఉద్యోగం ఆశచూపి..

Published Sun, Jul 29 2018 8:28 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

Girl Lured With Spa Job Offer In Delhi Confined And Raped - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్పాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి 16 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఓ మహిళ సహా నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సుల్తాన్‌పురి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని అవుటర్‌ ఢిల్లీ డీసీపీ ఎస్‌పీ కురువిల్లా చెప్పారు. తనకు స్పాలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ అభిషేక్‌ (18) అనే వ్యక్తి తనను హరిద్వార్‌కు తీసుకువెళ్లి లైంగికంగా వేధించాడని, అక్కడ నాలుగురోజులు గడిచిన అనంతరం తాము ఢిల్లీకి చేరుకోగా, రవి అనే నిందితుడు ఉద్యోగం, షెల్టర్‌ కల్పిస్తానని నమ్మబలికాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరుసటి రోజు రవి తనను ఘజియాబాద్‌లోని ఇంటికి తీసుకువెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, రవి భార్య రింకీ ఇందుకు సహకరించిందని చెప్పారు. అనంతరం ఇంతెజార్‌, హీనా అనే వ్యక్తులు తనను రోహిణికి తీసుకువెళ్లి అశోక్‌ గోయల్‌కు అప్పగించారని గోయల్‌ తన స్పాలో పని కల్పించాడని తెలిపారు. గోయల్‌ తన క్లయింట్లతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి తెచ్చేవాడన్నారు.

బాధితురాలి స్టేట్‌మెంట్‌ ఆధారంగా అభిషేక్‌, రవి, రింకీ, రోహిత్‌, ముఖేష్‌లను అరెస్ట్‌ చేశామని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న ఇతర నిందితులు గోయల్‌, విక్కీ, ఇంతెజార్‌, హీనాల కోసం గాలిస్తున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement