ముంబై : తక్కువ కులం వాడిని ప్రేమించావంటూ తల్లితండ్రుల వేధింపులు తీవ్రం కావడంతో 19 సంవత్సరాల యువతి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. పూణేకు చెందిన యువతి తాను ప్రేమించిన యువకుడికి మరో ఏడాదిలో 21 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. యువతి ప్రేమించిన యువకుడు తక్కువ కులానికి చెందిన వాడని, అతడిని పెళ్లి చేసుకుంటే ఇద్దరినీ చంపేస్తామని తల్లితండ్రులు బెదిరించారు.
కుటుంబ సభ్యులు తమ ప్రేమను నిరాకరించడంతో ఆమె యువకుడి చెంతకు చేరి వారి కుటుంబ సభ్యులతో నివసిస్తోంది. తల్లితండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని బాంబే హైకోర్టును ఆశ్రయించింది. బాధితురాలు ప్రేమించిన వ్యక్తి నిమ్న కులానికి చెందిన వాడైనా ఆమె అత్తవారింట్లో సంతోషంగా జీవిస్తోందని యువతి తరపు న్యాయవాది నితిన్ సత్పుటే చెప్పారు. యువతికి వివాహానికి అర్హమైన వయసు ఉందని, లా చదువుతుండగా వారిద్దరికీ పరిచయమైందని తెలిపారు. కాగా తన ప్రియుడి కుటుంబంపై కిడ్నాప్ కేసు బనాయిస్తామని తమ తల్లితండ్రులు బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment