చండీగఢ్ : వృద్ధురాలు అనే కనికరం లేకుండా అత్తను చిత్ర హింసలకు గురిచేసిందో కోడలు. ఇష్టారీతిన ఆమెను కొడుతూ అసభ్యపదజాలంతో దూషించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మహేంద్రఘడ్‌కు జిల్లాకు చెందిన చాంద్ బాయీ(80) భర్త సరిహద్దు భద్రతా బలగాల విభాగంలో ఎస్సైగా పనిచేసేవాడు. అతడి మరణానంతరం చాంద్ బాయీకి ప్రభుత్వ పెన్షన్ వస్తోంది. ప్రస్తుతం ఆమె తన కోడలు కంటా బాయితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమె దగ్గరున్న డబ్బు కోసం కంటా బాయీ.. అత్తను వేధించేది. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న చాంద్ బాయిని అస్సలు సహించేది కాదు.
ఇందులో భాగంగా ఓరోజు ఆరు బయట మంచంలో పడుకున్న చాంద్ బాయిని జుట్టుపట్టుకుని ఈడ్చిపారేసింది. అనంతరం అభ్యంతరకర భాష వాడుతూ ఆమెను తీవ్రంగా కొట్టింది. ఈ క్రమంలో పక్కింట్లో ఉన్న విద్యార్థిని ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కంటా బాయిని అరెస్టు చేశారు. కాగా ఈ ఘటనపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టార్ స్పందించారు. ‘ ఇది హేయమైన, ఖండించదగిన చర్య. ఇటువంటి ఘటనలను పౌర సమాజం హర్షించదు. కేసు నమోదు చేసి నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు అని ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment