ప్రతీకాత్మక చిత్రం
ముంబై : వసతి గృహాల్లో నివసించే అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఏమాత్రం సందేహం రాని వస్తువులు.. అడాప్టర్, స్విచ్‌బోర్డు, ఫ్యానుల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసి యువతుల దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ముంబైలో అడాప్టర్‌లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి యువతుల దృశ్యాలను చిత్రీకరించాడు ఓ ప్రబుద్ధుడు. దక్షిణ ముంబైలో పీజీ చదువుతున్న అమ్మాయిల వీడియోలను సేకరించి, ఇతరులకు పంపించాడు. నాలుగు బెడ్ రూములున్న ప్లాట్ ను హాస్టల్‌గా మార్చి, ముగ్గురిని పేయింగ్ గెస్టులుగా చేర్చుకున్నాడు. వారి గదిలో అమర్చిన మొబైల్ అడాప్టర్‌లో సీక్రెట్ కెమెరాను ఉంచాడు.
ఆపై వారి కదలికలను తన మొబైల్ ఫోన్‌తో చిత్రీకరించాడు. వారితో ఎక్కువగా మాట్లాడటం.. వారి గదుల్లో ఏం మాట్లాడుకుంటున్నారో అవే విషయాలు ప్రస్తావించడంతో అనుమానం వచ్చిన ఓ అమ్మాయి అడాప్టర్ పై తన వస్త్రానన్ని కప్పింది. దీంతో తనిఖీ పేరిట గదిలోకి వచ్చిన యజమాని, వస్త్రాన్ని ఎందుకు కప్పావని ప్రశ్నించాడు. దీంతో అనుమానం వచ్చిన అమ్మాయిలు.. అడాప్టర్‌ను పరిశీలించి పోలీసులను ఆశ్రయించారు. హాస్టల్ యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఏడాదిన్నరగా అమ్మాయిల ఫుటేజ్ లను యజమాని సేకరించాడని తేల్చారు. అతనిపై ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని మీడియాకు తెలిపారు. అతనికి 47 ఏళ్ల వయస్సని, పెళ్లి జరగలేదని, వృద్ధ దంపుతులైన అతని తల్లిదండ్రులతో నివసిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఇటీవల హైదరాబాద్‌లో ఓ మైనర్ బాలుడు హాస్టల్లోని అమ్మాయిల వీడియోలు చిత్రీకరిస్తూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇలానే తమిళనాడు, కర్ణాటకల్లోని లేడీస్ హాస్టల్లో కూడా సీక్రెట్ కెమెరాలు బయటపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment