ఆమె లేకుండా నేను జీవించలేకపోతున్నా | Husband Commits End Life With Wife Deceased in Tamil nadu | Sakshi
Sakshi News home page

భార్య మృతితో భర్త ఆత్మహత్య

Published Wed, Jul 22 2020 6:25 AM | Last Updated on Wed, Jul 22 2020 7:14 AM

Husband Commits End Life With Wife Deceased in Tamil nadu - Sakshi

అరవిందరాజన్, పవిత్ర, ఫేస్‌బుక్‌లో అరవింద్‌ పెట్టిన పోస్ట్‌

తిరువొత్తియూరు: భార్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో ఆ దుఃఖాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరునిండ్రవూరులో జరిగింది. దిలీపన్‌ నగర్‌కు చెందిన అరవింద రాజా (26) పెయింటర్‌. 2016లో పవిత్ర (24)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం లేదు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. మనస్తాపం చెందిన పవిత్ర ఇటీవల పట్టాభిరామంలోని తల్లి ఇంటికి వెళ్లింది. ఈ నెల 15న ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం అరవవిందరాజన్‌కు తెలియడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సోమవారం ఇంటిలో ఉరివేసుకుని తనువు చాలించాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అరవింద ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ పెట్టాడు. అందులో తాను ప్రేమ వివాహం చేసుకున్నామని.. ఆమె లేకుండా నేను జీవించలేకపోతున్నానని.. ఇద్దరి మృతికి పవిత్ర ప్రేమ కారణమని పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement