పశ్చిమ గోదావరి , తాళ్లపూడి: భార్యను బెదిరిద్దామనుకున్నాడో లేక టిక్ టాక్ వీడియో చేద్దాం అనుకున్నాడో కానీ ఉరి బిగుసుకుని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని మలకపల్లిలో గెడ్డం గణేష్(30) అనే యువకుడు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తాళ్లపూడి ఎస్సై జి.సతీష్ సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడికి భార్య ఇద్దరు íపిల్లలున్నారు. భార్య కొంత కాలంగా ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటోంది. అయితే కొద్ది రోజులుగా ఆమె ఫోన్ చేయకపోవడంతో భార్యను బెదిరించడానికి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా ప్రమాదం జరిగింది. గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వీడియో తీసుకుంటుండగా ఉరి బిగుసుకుపోయింది. ఈఘటనకు సంబంధించి మొత్తం సెల్ ఫోన్‌లో 30 నిమిషాలు వీడియో రికార్డు అయినట్టు ఎస్సై చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.(మంటల్లో దూకి యువకుడి ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment