
సంతోష్, కావ్యారాణి(ఫైల్)
మైసూరు: జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన డబ్బు తీసుకురావాలని భర్త వేధిస్తున్న నేపథ్యంలో భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈఘటన మైసూరు జిల్లా, కేఆర్ నగర తాలుకాలోని నాటనహళ్లిలో చోటు చేసుకుంది. గ్రామంలో సంతోష్, కావ్యారాణి (28) దంపతులు నివాసం ఉంటున్నారు. సంతోష్ కాంగ్రెస్ నాయకుడుగా కొనసాగుతున్నాడు. వచ్చే జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన రూ. 15 లక్షలు పుట్టింటినుంచి తీసుకురావాలని కొంతకాలంగా సంతోష్ తన భార్యను వేధించేవాడు.
అంతేగాకుండా అత్త, ఆడపడుచులు కావ్యారాణిని వేధించేవారని సమాచారం. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి కావ్యారాణి బాధపడేది. వేధింపులు తీవ్రతరమైన నేపథ్యంలో కావ్యారాణి శుక్రవారం వంటిపై కాలిన గాయాలతో అస్వస్థతకు గురైంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. సంతోష్, అతని తల్లి శారదమ్మ, అడపడుచు సౌమ్య, సౌమ్య భర్త చంద్రశేఖర్‌లు తమ బిడ్డపై కిరోసిన్‌పోసి నిప్పు అంటించారని మృతురాలి తల్లిదండ్రులు కేఆర్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment