విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్
విజయవాడ: విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ ఇంట్లో మంగళవారం రాత్రి జీఎస్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పటమట పోస్టల్ కాలనీ బస్టాప్ సమీపంలోని మేయర్ ఇంట్లో 8 మంది అధికారుల బృందం దాడులు నిర్వహించి కీలకపత్రాలు, రికార్డులు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. పుష్కరాల సమయంలో పుష్కరనగర్ తదితర ప్రాంతాల్లో అధికారులు, సిబ్బందికి భోజనాల ఏర్పాటు సహా పలు ఈవెంట్ల నిర్వహణను చేపట్టిన కేఎంకే సంస్థపై అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. కేఎంకే ఈవెంట్స్ సంస్థకు మేయర్ భార్య డైరెక్టర్‌గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
దీనికి తోడు కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టిన నేపథ్యంలో కొంతమంది కార్పొరేటర్లు జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జీఎస్టీ అధికారులు మంగళవారం రాత్రి మేయర్ ఇంటికి ద్విచక్రవాహనాలపై వచ్చి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు సుమారు 2 గంటల పాటు సోదాలు జరిగాయి. జీఎస్టీ చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటంతోనే సోదాలు జరిపినట్లు సమాచారం అందింది.
Comments
Please login to add a commentAdd a comment